
సాక్షి, హైదరాబాద్: దేశీయ రియల్ ఎస్టేట్ రంగం 2030 నాటికి 1 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని కేపీఎంజీ సర్వే తెలిపింది. అఫడబుల్ హౌజింగ్, కో–వర్కింగ్ స్పేస్ విభాగాలు వృద్ధి చెందుతుండటంతో రియల్టీ పరిశ్రమ 2025 నాటికి 650 బిలియన్ డాలర్లు, 2028 నాటికి 850 బిలియన్ డాలర్లకు చేరుతుందని పేర్కొంది. 2018 మార్చి నాటికి 3 బిలియన్ డాలర్లుగా ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) పెట్టుబడులు 2026 నాటికి 100 బిలియన్ డాలర్లకు చేరుతుందని.. ఏటా 15 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని నివేదిక తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment