
సాక్షి, అమరావతి: రియల్ ఎస్టేట్ రంగంలో జరిగే అభివృద్ధి, విక్రయ–జీపీఏ ఒప్పందాలకు కట్టే స్టాంప్ డ్యూటీకి సంబంధించిన అంశాలపై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ స్పష్టత కోసం కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. ఈ మేరకు ఆ శాఖ ఐజీ అండ్ కమిషనర్ రామకృష్ణ అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు 2 మెమోలు జారీ చేశారు.
అపార్ట్‌మెంట్లు నిర్మించే ముందు భూ యాజమాని, డెవలపర్ మధ్య జరిగే ఒప్పందాలు, నిర్మాణం తర్వాత విక్రయ–జీపీఏ (సేల్ కం జీపీఏ అగ్రిమెంట్లు)ఒప్పందాలకు స్టాంప్ డ్యూటీ కట్టించుకునే విషయంలో చాలాకాలం నుంచి కొన్ని అనుమానాలు, అస్పష్టతలు ఉన్న విషయం కమిషనర్ దృష్టికి వెళ్లడంతో ఆయన వాటిని పరిష్కరించేందుకు పలు ఆదేశాలిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment