Stamp Duty
-
రియల్టీ నుంచి ప్రభుత్వాలకు రూ.2 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రియల్ ఎస్టేట్ పరిశ్రమ పెద్ద ఆదాయ వనరుగా మారింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2022–23) ఈ పరిశ్రమ నుంచి రూ.2 లక్షల కోట్ల మేర ఆదాయం స్టాంప్ డ్యూటీ, రిజి్రస్టేషన్ ఫీజు తదితర రూపంలో ప్రభుత్వాలకు సమకూరింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు గడిచిన ఆర్థిక సంవత్సరంలో వచ్చిన మొత్తం ఆదాయంలో రియల్ ఎస్టేట్ పరిశ్రమ వాటా 5.4 శాతంగా ఉంది. ఈ వివరాలను ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ ‘నైట్ ఫ్రాంక్ ఇండియా’తో కలసి రియల్ ఎస్టేట్ కౌన్సిల్ ‘నరెడ్కో’ విడుదల చేసింది. ‘‘భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ 12 రెట్లు పెరిగి 2047 నాటికి 5.8 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంటుంది. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఇది 477 బిలియన్ డాలర్లుగా ఉంది. 2047 నాటికి దేశ జీడీపీలో 15 శాతం వాటాను సమకూరుస్తుంది. ప్రస్తుతం పరిశ్రమ వాటా జీడీపీలో 7.3 శాతంగా ఉంది. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 33–40 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుంది’’అని నైట్ ఫ్రాంక్ నివేదిక తెలిపింది. నివాస మార్కెట్ 3.5 ట్రిలియన్ డాలర్లు నివాస గృహాల మార్కెట్ పరిమాణం గత ఆర్థిక సంవత్సరం నాటికి 299 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2047 నాటికి 3.5 ట్రిలియన్ డాలర్లకు వృద్ధి చెందుతుందని ఈ నివేదిక అంచనా వేసింది. ఆఫీస్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిమాణం 40 బిలియన్ డాలర్ల నుంచి 473 బిలియన్ డాలర్లకు.. వేర్ హౌసింగ్ మార్కెట్ సైజు 2.9 బిలియన్ డాలర్ల నుంచి 34 బిలియన్ డాలర్లకు విస్తరిస్తుందని అంచనా వేసింది. -
AP: ఆస్తుల రిజిస్ట్రేషన్లు సులభతరం.. స్పెషల్ సాఫ్ట్వేర్ ‘కార్డ్ ప్రైమ్’
సాక్షి, అమరావతి: ఇది టెక్నాలజీ యుగం. అన్ని పనులు ఆన్లైన్లోనే, అరచేతిలోనే నిమిషాల్లో అయిపోతున్నాయి. ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. వేచి ఉండాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇకపై ఆస్తుల రిజిస్ట్రేషన్లు కూడా ఆన్లైన్లోనే చేసుకోవచ్చు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖను రాష్ట్ర ప్రభుత్వం టెక్నాలజీ వైపు నడిపిస్తోంది. కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్టుమెంట్ (కార్డ్)ను ఆధునీకరించి కార్డ్ 2.0కు రూపకల్పన చేస్తోంది. ‘కార్డ్ ప్రైమ్’ పేరుతో ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందిస్తోంది. దీని ద్వారా స్టాంపు పేపర్లు, సంతకాలతో పనిలేకుండా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. డాక్యుమెంట్‌ను ఎవరికివారే ఆన్లైన్లో తయారు చేసుకుని, ఆన్లైన్లోనే చలానా (స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు) కట్టి, ఒక టైం స్లాట్‌ను (అపాయింట్మెంట్) బుక్ చేసుకుని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, లేదా గ్రామ, వార్డు సచివాలయానికి వెళితే అక్కడ వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసే విధానం త్వరలో అందుబాటులోకి రానుంది. కొత్త విధానంలో సులభంగా రిజిస్ట్రేషన్లు ప్రస్తుత విధానంలో డాక్యుమెంట్ తయారీ, చలానా కట్టడం వంటివన్నీ రిజిస్ట్రేషన్ల శాఖతో సంబంధం లేకుండా బయట జరుగుతున్నాయి. వీటిని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇస్తే అక్కడ రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇదో పెద్ద ప్రహసనం. కార్డ్ ప్రైమ్ విధానంలో చాలా తక్కువ సమయంలో సులభంగా రిజిస్ట్రేషన్లు ప్రక్రియ పూర్తవుతుంది. కేవలం బయోమెట్రిక్ ద్వారా వేలిముద్ర వేయడానికి 5 నుంచి 10 నిమిషాలు ఉంటే సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం బయట జరిగే పనిని సులభంగా ఆన్లైన్లో చేసుకోవచ్చు. దీన్ని పబ్లిక్ డేటా ఎంట్రీ ఇంటిగ్రేషన్ అంటారు. అంటే వినియోగదారులే ఆన్లైన్లో డాక్యుమెంట్ తయారు చేసుకోవచ్చు. ఆస్తి వివరాలు, పేరు, ఆధార్, సాక్షులు వంటి సమాచారాన్ని ఆన్లైన్లో ఎంటర్ చేస్తే వెంటనే ఆస్తి మార్కెట్ విలువ, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ ఛార్జీలు ఎంత కట్టాలో చూపిస్తుంది. ఆ సొమ్మును ఆన్లైన్లో చెల్లించొచ్చు. ఆఫ్‌లైన్, స్టాక్‌హోల్డింగ్ ద్వారా కూడా చలానా కట్టొచ్చు. అనంతరం రిజి్రస్టేషన్కి టైమ్ స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆ సమయానికి సబ్ రిజి్రస్టార్ కార్యాలయం లేదా గ్రామ/వార్డు సచివాలయానికి వెళితే అక్కడ అప్లికేషన్లో నమోదు చేసిన ఆధార్ వివరాలను సరి చూస్తారు. బయోమెట్రిక్ ద్వారా వినియోగదారుని వేలిముద్ర తీసుకుంటారు. రిజిస్ట్రేషన్‌తోపాటే సబ్ డివిజన్, మ్యుటేషన్ ఇదంతా అయిన తర్వాత ఆ ఆస్తిని సబ్ డివిజన్ చేయాల్సి వస్తే వెంటనే చేస్తారు. పాత విధానంలో రిజి్రస్టేషన్ పూర్తయ్యాక దాన్ని రెవెన్యూ శాఖలో సబ్ డివిజన్ చేయించడం ఓ పెద్ద ప్రహసనం. కార్డ్ ప్రైమ్‌లో రిజిస్ట్రేషన్ సమయంలోనే సబ్ డివిజన్ (అవసరమైతే) పూర్తవుతుంది. వ్యవసాయ భూములైతే మ్యుటేషన్ కూడా ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది. దానికోసం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. రెవెన్యూ రికార్డుల్లో పేరు కూడా వెంటనే మారిపోతుంది. ఇందుకోసం కార్డ్ 2.0ని రెవెన్యూ శాఖ వెబ్‌ల్యాండ్ సాఫ్ట్వేర్కి అనుసంధానం చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత రిజిస్ట్రేషన్లు డాక్యుమెంట్‌ను ప్రింట్ తీసి ఇస్తారు. గతంలో మాదిరిగా స్టాంప్ పేపర్ల అవసరం ఉండదు. వినియోగదారుడు కోరుకొంటే స్టాంప్ పేపర్లపై ప్రింట్ ఇస్తారు. ఈ విధానంలో వినియోగదారుడు ఎక్కడా సంతకం పెట్టాల్సిన అవసరం ఉండదు. ఈ–సైన్‌తోనే పని పూర్తవుతుంది. సులభం.. పారదర్శకం.. కార్డ్ ప్రైమ్ ద్వారా రిజిస్ట్రేషన్ల విధానం మరింత సులభమవుతుంది. మొత్తం ప్రక్రియ ఆన్లైన్లోనే పూర్తవుతుంది. రిజిస్ట్రేషన్లు చాలా తక్కువ సమయంలో సులభంగా, పారదర్శకంగా జరుగుతాయి. అవకతవకలకు ఆస్కారం ఉండదు. ప్రభుత్వ అనుమతితో త్వరలో దీన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. – వి. రామకృష్ణ, కమిషనర్ అండ్ ఐజీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ. ఇది కూడా చదవండి: ఏపీకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వరద.. టీడీపీకి షాకిచ్చిన రిపోర్ట్! -
పెరిగిన ఇళ్ల విక్రయాలు.. రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్లు
సాక్షి, ముంబై: కరోనా అదుపులోకి రావడంతో ప్రభుత్వం లాక్డౌన్ ఆంక్షలు పూర్తిగా సడలించింది. ఈ నేపథ్యంలోనే ముంబైలో ఇళ్ల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఒక్క మార్చి నెలలోనే రికార్డు స్థాయిలో అంటే 15,700 ఆస్తులు రిజిస్ట్రేషన్ అయ్యాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి స్టాంప్ డ్యూటీ రూపంలో రూ.1,084 కోట్ల ఆదాయం వచ్చింది. 2021–22 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే మార్చిలో రికార్డు స్ధాయిలో రెవెన్యూ వచ్చింది. ఫిబ్రవరితో పోల్చి చూస్తే మార్చిలో 51 శాతం ఆదాయం ఎక్కువ వచ్చింది. ముఖ్యంగా మార్చిలో ప్రతీరోజూ సగటున 507 ఆస్తులు కొనుగోలు జరిగినట్లు స్టాంపు డ్యూటీ కార్యాలయంలో నమోదైన రిజిస్టేషన్లను బట్టి తెలిసింది. కొనుగోలు చేసిన ఇళ్లలోనూ అధిక శాతం రూ.కోటి నుంచి ఐదు కోట్ల వరకు విలువచేసే (అంటే 500 చదరపు అడుగుల నుంచి వేయి చదరపు అడుగుల వరకు) ఇళ్లు కొనుగోలు చేశారు. కరోనాతో కొనుగోళ్ల పతనం... కరోనా మొదటి, రెండో దఫా ప్రభావం భవన నిర్మాణ రంగాలపై తీవ్రంగా చూపింది. కానీ మూడో దఫాలో ఇళ్ల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ప్రస్తుతం కరోనా వైరస్ పూర్తిగా అదుపులోకి రావడంతో ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తివేసింది. దీంతో అస్తవ్యస్తమైన జనజీవనం గాడిన పడింది. పరిస్థితులు సర్దుకోవడంతో ఇళ్ల విక్రయాలు, కోనుగోళ్లు జోరందుకున్నాయి. ముంబైకర్లు గృహ ప్రవేశం చేయడానికి సిద్ధంగా ఉన్న ఇళ్లు, ఫ్లాట్లతోపాటు నిర్మాణంలో ఉన్న వాటిని కూడా బుక్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా కరోనా మొదటి దఫాలో ఆర్థికంగా దెబ్బతిన్న బిల్డర్లను ఆదుకునేందుకు ప్రభుత్వం స్టాంపు డ్యూటీలో రాయితీ కల్పించింది. దీని ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది. ఫలితంగా బిల్డర్ల ఆర్ధిక వ్యవస్ధకు నవసంజీవని లభించినట్లయింది. -
ఇళ్ల ధరలకు రెక్కలు!
ముంబై: నిర్మాణ వ్యయం 20–25 శాతం పెరిగిందని రియల్టర్ల సంస్థ క్రెడాయ్ (భారత రియల్ ఎస్టేట్ డెవలపర్ల సంఘాల సమాఖ్య– సీఆర్‌ఈడీఏఐ) సోమవారం తెలిపింది. ప్రధానంగా గత 45 రోజులలో ఈ పెరగుదల భారీగా ఉందని పేర్కొంది. ఉక్కు వంటి ముడి ఉత్పత్తుల ధరలు పెరుగడం దీనికి కారణమని వివరించింది. ఈ నేపథ్యంలో బిల్డర్లు వచ్చే నెల నుంచి ప్రాపర్టీ ధరలను సగటున 10–15 శాతం పెంచాల్సి వస్తుందని వెల్లడించింది. క్రెడాయ్, ఆ సంస్థ మహారాష్ట్ర విభాగం ఎంసీహెచ్ఐ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశాయి. డెవలపర్లకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)ని అనుమతించడంతోపాటు స్టాంప్ డ్యూటీ, వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేట్లను తగ్గించాలని ఈ ప్రకటనలో డిమాండ్ చేశాయి. తద్వారా పరిశ్రమకు ఉపశమనం కలిగించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాయి. ప్రస్తుతానికి నిర్మాణ పనులను నిలిపివేయమని సభ్య డెవలపర్లకు సలహా ఇవ్వబోమని, అయితే ధరల పెరుగుదల కొనసాగితే బిల్డర్లకు ప్రాజెక్ట్ సైట్లలో పనులను నిలిపివేయడం,ముడిపదార్థాల కొనుగోలును వాయిదా వేయడం తప్ప వేరే మార్గం లేదని ప్రకటన తెలిపింది. తక్షణ ప్రాపర్టీ ధరల (10 నుంచి 15 శాతం శ్రేణిలో) పెరుగుదల వల్ల మహా రాష్ట్రలోని 2,773 ప్రాజెక్టులపై (గ్రేటర్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ 2021లో ఆమోదించిన) ప్రభావం పడుతుందని ప్రకటన తెలిపింది. దాదాపు 2,60,000 గృహాలు ఈ ప్రాజెక్టులకు సంబంధించి విక్రయించాల్సి ఉందని వివరించింది. క్రెడాయ్ భారతదేశంలోని ప్రైవేట్ రియల్టీ డెవలపర్ల అత్యున్నత వేదిక. 1999లో స్థాపించబడిన ఈ అసోసియేషన్ 21 రాష్ట్రాల్లోని 221 సిటీ చాప్టర్లలో 13,000 మంది డెవలపర్లకు ప్రాతినిధ్యం వహిస్తోంది. చౌక గృహాలపై ఎఫెక్ట్... ‘నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ. 400–500 పెరిగింది. ప్రధానంగా గత 45 రోజుల్లో ధరల తీవ్రత ఎక్కువగా ఉంది. చౌక గృహాల విభాగంపై ఈ ప్రభావం ఎక్కువగా కనబడుతోంది. భౌగోళిక–రాజకీయ పరిస్థితుల కారణంగా పెరిగిన ముడిసరుకు ధరల పెరుగుదల ప్రభావాన్ని తగ్గించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం స్టాంప్ డ్యూటీని 5–6% నుండి 3%కి కుదించాలి. సిమెంట్ వంటి ముడి పదార్థాలపై 18% జీఎస్టీ రేటును తగ్గించాలి. సిమెంట్, స్టీల్ ఎగుమతులను కొద్దికాలం పాటు నిషేధించాలి. డెవలపర్లు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)ని క్లెయిమ్ చేసుకోడానికి అనుమతించాలి. ఇప్పటికే డెవలపర్ల మార్జిన్లు పడిపోయిన పరిస్థితుల్లో డెవలపర్లు వచ్చే నెల నుంచి తమ అపార్ట్మెంట్ల ధరలను పెంచాల్సి ఉంటుంది. ధరల పెరుగుదల సగటున 10–15% వరకు ఉండవచ్చు. పెరుగుతున్న ఇన్పుట్ వ్యయాల భారాన్ని తగ్గించుకోడానికి ఈ తక్షణ పెంపు తప్పని పరిస్థితి ఉంది’ అని క్రెడా య్ సెక్రటరీ (మహారాష్ట్ర) అజ్మీరా చెప్పారు. వ్యయ భారాలు స్టీల్ ధర కిలోకు రూ.35–40 నుంచి రూ.85–90కి చేరింది. సిమెంట్ ధరలు బస్తాకు రూ.100 వరకు పెరిగాయి. ఇంధనం, రవాణా ఖర్చులు పెరిగాయి. దీంతో మొత్తం నిర్మాణ వ్యయం 20–25 శాతం పెరిగింది. గృహ నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపే వ్యయ భారాలివి. – దీపక్ గొరాడియా, క్రెడాయ్–ఎంసీహెచ్ఐ ప్రెసిడెంట్ రికవరీకి విఘాతం రెసిడెన్షియల్ సెక్టార్ సెగ్మెంట్లలో డిమాండ్ ఇప్పుడిప్పుడే పునరుద్ధరణ జరుగుతోంది. తాజా ముడిపదార్థాల పెరుగుదల నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇది రికవరీలో ఉన్న పునరుద్ధరణ ప్రక్రియను దెబ్బతీసే అవకాశం ఉంది. – రమేష్ నాయర్, కొలియర్స్ ఇండియా సీఈఓ గత రెండేళ్లుగా సిమెంట్, స్టీల్ ధరలు భారీగా పెరిగాయి. దీనితో ప్రతి చదరపు అడుగుల నిర్మాణ వ్యయం గణనీయంగా పెరిగింది. ఇన్పుట్ ధర పెరుగుదలను మేము వినియోగదారులకు బదలాయించలేకపోతున్నాము. దీనితో మా లాభాల మార్జిన్లు పెద్దఎత్తున దెబ్బతింటున్నాయి. ఈ పరిణామాలు మమ్మల్ని భవిష్యత్ కార్యాచరణ గురించి ఆలోచించేలా చేస్తున్నాయి. – సరాంశ్ ట్రెహాన్, ట్రెహాన్ గ్రూప్ ఎండీ -
రియల్టీ.. స్టాంప్‌డ్యూటీ.. బ్లాక్‌మనీ
న్యూఢిల్లీ: దేశ రియల్ ఎస్టేట్ రంగం ప్రక్షాళనకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుందని, ఫలితంగా ప్రాపర్టీ ఒప్పందాల్లో నల్లధనం తగ్గుముఖం పట్టినట్టు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి మనోజ్ జోషి తెలిపారు. నరెడ్కో–మహి (సంఘం మహిళా విభాగం) నిర్వహించిన ఒక కార్యక్రమానికి హాజరైన సందర్భంగా జోషి మాట్లాడారు. ‘‘స్టాంప్ డ్యూటీ దిగొచ్చింది. దీన్ని మరింత తగ్గించాలి. వ్యాపారాలు పారద్శకంగా నడుస్తున్నాయా (చట్టబద్ధమైన ధనంతో) లేక నల్లధనంతోనా అన్నది నిర్ణయించడంలో స్టాంప్ డ్యూటీ కీలక పాత్ర పోషిస్తుంది. నరెడ్కో, నిర్మాణ రంగం మరింత మంది మహిళా నిపుణులను ఈ రంగంలోకి తీసుకవచ్చేందుకు ప్రయత్నిస్తుండడం స్ఫూర్తిదాయకం’’ అని పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ పరిశ్రమ మరింత పారదర్శకంగా మారితే పనిచేసేందుకు ఎక్కువ మంది మహిళలు ముందుకు వస్తారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘‘గురుగ్రామ్ ప్రాంతానికి చెందిన ఒక స్నేహితుడు నిన్ననే నాకు ఫోన్ చేసి మాట్లాడాడు. చాలా వరకు ప్రాపర్టీ లావాదేవీలు ‘వైట్’ (స్వచ్ఛం)గానే జరుగుతున్నట్టు చెప్పాడు. మొత్తం చెల్లింపులు పారదర్శక మార్గంలోనే నడుస్తున్నాయి’’ అని జోషి వెల్లడించారు చదవండి: ఫ్లాట్ కొంటున్నారా? అదనపు వసూళ్లు తప్పడం లేదా? రెరా నిబంధనలు ఏం చెప్తున్నాయి -
‘రియల్’ ఒప్పందాల స్టాంప్ డ్యూటీపై మార్గదర్శకాలు జారీ
సాక్షి, అమరావతి: రియల్ ఎస్టేట్ రంగంలో జరిగే అభివృద్ధి, విక్రయ–జీపీఏ ఒప్పందాలకు కట్టే స్టాంప్ డ్యూటీకి సంబంధించిన అంశాలపై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ స్పష్టత కోసం కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. ఈ మేరకు ఆ శాఖ ఐజీ అండ్ కమిషనర్ రామకృష్ణ అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు 2 మెమోలు జారీ చేశారు. అపార్ట్మెంట్లు నిర్మించే ముందు భూ యాజమాని, డెవలపర్ మధ్య జరిగే ఒప్పందాలు, నిర్మాణం తర్వాత విక్రయ–జీపీఏ (సేల్ కం జీపీఏ అగ్రిమెంట్లు)ఒప్పందాలకు స్టాంప్ డ్యూటీ కట్టించుకునే విషయంలో చాలాకాలం నుంచి కొన్ని అనుమానాలు, అస్పష్టతలు ఉన్న విషయం కమిషనర్ దృష్టికి వెళ్లడంతో ఆయన వాటిని పరిష్కరించేందుకు పలు ఆదేశాలిచ్చారు. -
ఆస్తుల వాటా.. స్టాంప్ డ్యూటీకి టాటా
సాక్షి, అమరావతి: విజయవాడలోని ప్రముఖ వ్యాపారికి చెందిన ఉమ్మడి ఆస్తిని నలుగురు వారసులు పంచుకున్నారు. రిజిస్ట్రేషన్ శాఖ లెక్కల ప్రకారం ఆ ఆస్తి విలువ రూ.133.93 కోట్లు. హిందూ వారసత్వ చట్ట నిబంధనల ప్రకారం ఆస్తిని పంచుకున్న వారసులు రిజిస్ట్రేషన్ నిమిత్తం రూ.1.84 కోట్లను స్టాంపు డ్యూటీగా చెల్లించాలి. కానీ.. చట్టంలోని నిబంధనలను ఉల్లంఘిస్తూ వారసుల మధ్య ఆస్తులను సమానంగా పంపిణీ చేయలేదు. అంతేకాదు వారసులు కాని వారికి ఆస్తులను ముందే విక్రయించేసి.. కొనుగోలుదారులను కూడా వారసుల జాబితాలో చూపించారు. మొత్తంగా సుమారు రూ.75 లక్షల్ని మాత్రమే స్టాంప్ డ్యూటీగా చెల్లించారు. దాంతో ఖజానాకు రూ.1.09 కోట్ల నష్టం వాటిల్లింది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఓ ప్రముఖ వ్యాపారి, రాజకీయ నేత కుటుంబానికి చెందిన రూ.132 కోట్ల ఉమ్మడి ఆస్తుల రిజిస్ట్రేషన్ విషయంలోనూ ఖజానాకు రూ.1.03 కోట్ల మేర గండికొట్టారు. ఇలా 2014–20 సంవత్సరాల మధ్య స్టాంప్ డ్యూటీ రూపంలో రాష్ట్ర ఖజానా రూ.1,200 కోట్ల వరకు ఆదాయాన్ని కోల్పోయినట్టు ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (ఏపీ డీఆర్ఐ) గుర్తించింది. వారసత్వ చట్టం ప్రకారం ఆస్తుల పంపిణీలో నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రభుత్వ ఖజానాకు దశాబ్దాలుగా రూ.వేలాది కోట్లను గండికొడుతున్న మాయాజాలం ఏపీ డీఆర్ఐ పరిశీలనలో వెల్లడైంది. ఏటా 64 వేల వారసత్వ ఆస్తుల పంపిణీ రిజిస్ట్రేషన్లు వీలునామా లేని సందర్భాల్లో వారసుల మధ్య ఆస్తుల పంపిణీకి సంబంధించిన నిబంధనల్ని హిందూ వారసత్వం చట్టంలోని సెక్షన్ 8లో స్పష్టంగా పొందుపర్చారు. ఆ సెక్షన్ కింద రాష్ట్రంలో ఏటా దాదాపు 64 వేల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. మొత్తం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో ఇవి 4 శాతం. రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఏటా సగటున 16 లక్షల ఆస్తుల క్రయ, విక్రయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్లు చేస్తోంది. తద్వారా స్టాంపు డ్యూటీ రూపంలో ఏటా సగటున రూ.5,500 కోట్ల ఆదాయం ఖజానాకు చేరుతోంది. అందులో వారసత్వ ఆస్తుల పంపిణీ రిజిస్ట్రేషన్లు 4 శాతం అంటే 64 వేల రిజిస్ట్రేషన్ల ద్వారా స్టాంపు డ్యూటీ రూపంలో ప్రభుత్వానికి ఏటా రూ.75 కోట్ల ఆదాయం వస్తోంది. కానీ.. నిబంధనల ప్రకారం ఏటా రూ.275 కోట్లు స్టాంపు డ్యూటీ రావాలని ఏపీ డీఆర్ఐ తనిఖీల్లో వెల్లడైంది. ఆరేళ్లలో రూ.1,200 కోట్ల స్టాంపు డ్యూటీ ఎగవేత ఏపీ డీఆర్ఐ కమిషనర్ ఎం.నరసింహారెడ్డి ఇటీవల ప్రత్యేక బృందాలతో నిర్వహించిన తనిఖీల్లో విస్మయానికి గురిచేసే వాస్తవాలు వెలుగు చూశాయి. 2014 నుంచి 2020 వరకు రాష్ట్రంలో వారసత్వ ఆస్తుల రిజిస్ట్రేషన్లలో 50 రిజిస్ట్రేషన్లను ఏపీ డీఆర్ఐ బృందాలు తనిఖీ చేశాయి. వాటికి నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన స్టాంపు డ్యూటీ కంటే రూ.22.68 కోట్లు తక్కువ చెల్లించినట్టు గుర్తించారు. ఆ విధంగా 2014–20 మధ్య ఖజానాకు రూ.1,200 కోట్లు గండికొట్టినట్టు తేలింది. హక్కుదారులు కాకపోయినా.. ఉమ్మడి ఆస్తిలో చట్ట ప్రకారం హక్కుదారులు కాని వారిని కూడా హక్కుదారులుగా చేరుస్తున్నారు. ఆ మేరకు ముందుగానే ఆస్తుల అమ్మకానికి ఒప్పందం చేసుకుని కొనుగోలుదారులను ఆస్తి హక్కుదారులుగా చూపిస్తున్నారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయాల్సిన సబ్ రిజిస్ట్రార్లు కొందరు అవినీతికి పాల్పడుతూ నిబంధనలకు విరుద్ధంగా ఆమోదిస్తున్నారు. వారసులు కానివారికి ఆస్తిని రిజిస్ట్రేషన్ చేస్తే 3 శాతం స్టాంపు డ్యూటీ చెల్లించాలి. కానీ.. వారిని వారసులుగా పేర్కొని వాటాలు ఇస్తూ ఆ విలువపై కేవలం 1 శాతం స్టాంపు డ్యూటీ చెల్లిస్తున్నారు. దాంతో ప్రభుత్వం 2 శాతం స్టాంపు డ్యూటీ ఆదాయాన్ని కోల్పోతోంది. మరోవైపు స్వార్జిత ఆస్తిని కూడా ఉమ్మడి వారసత్వ ఆస్తిగా చూపిస్తున్నారు. దాంతో ఒక భాగానికి స్టాంపు డ్యూటీ మినహాయింపు పొందుతున్నారు. న్యాయ వివాదాలు తలెత్తితే నష్టం వారికే.. వారసత్వ చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా ఉమ్మడి ఆస్తుల పంపిణీ చేస్తుండటంతో న్యాయ వివాదాలు కూడా పెరుగుతున్నాయి. నిబంధనల ప్రకారం ఒకరికి ఎక్కువ వాటా ఇవ్వాలంటే ఆ మేరకు మిగిలిన వాటాదారులు తమ వాటాల్లోని భాగాన్ని ఎక్కువ వాటా పొందే వారికి చట్టబద్ధంగా బదిలీ చేయాలి. దానిపై 3 శాతం స్టాంపు డ్యూటీ చెల్లిస్తే అది చట్టబద్ధమైన బదలాయింపు అవుతుంది. కానీ.. ప్రస్తుతం తమ మధ్య సత్సంబంధాలు ఉన్నాయి కదా అని ఒకరికి ఎక్కువ, మిగిలిన వారికి తక్కువగా ఆస్తుల రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. కానీ అది ఆస్తులను చట్టబద్ధంగా బదిలీ చేసినట్టు కాదు. భవిష్యత్‌లో కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు వస్తే.. తమకూ సమాన వాటా దక్కాల్సిందే అని మిగిలిన వాటాదారులు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే చేయగలిగేదేమీ ఉండదు. ఎందుకంటే వాటాల బదిలీ చట్టబద్ధంగా జరగలేదు కాబట్టి వారసులందరికీ సమాన హక్కు సజీవంగా ఉన్నట్టే. రాష్ట్రంలో ఇలాంటి కేసులు లెక్కకు మించి న్యాయ వివాదాలు నమోదవుతూ ఉన్నాయి. ఉమ్మడి ఆస్తి పంపిణీపై స్టాంపు డ్యూటీ నిబంధనలివీ.. ► ఉమ్మడి ఆస్తిని విభజించి రిజిస్ట్రేషన్ చేసేప్పుడు దస్తావేజులో పేర్కొన్న పార్టీలు అందరూ ఉమ్మడి ఆస్తిలో వాటాదారులు కావాలి. వారి మధ్య ఆస్తిని సమ భాగాలుగా పంపిణీ చేస్తే.. అందులో ఒక భాగానికి స్టాంపు డ్యూటీ మినహాయింపు ఇస్తారు. ► మిగిలిన భాగాలకు రిజిస్ట్రేషన్ ఆస్తి విలువలో 1 శాతం స్టాంపు డ్యూటీ చెల్లించాలి. కన్వేయన్స్ డీడ్ ద్వారా ఆస్తి పొందిన వారు 4 శాతం స్టాంపు డ్యూటీ చెల్లించాలి. ► హక్కు విడుదల (అంటే చట్టబద్ధ వారసులు తమ వాటాలో కొంత భాగాన్ని ఇతరులకు ఇస్తే) ద్వారా ఆస్తి పొందిన వారు 3శాతం స్టాంపు డ్యూటీ చెల్లించాలి. ► గిఫ్ట్/సెటిల్మెంట్ డీడ్ ద్వారా ఆస్తి పొందితే 2శాతం స్టాంపు డ్యూటీ చెల్లించాలి. ఎగవేత సాగుతుందిఇలా.. ఉమ్మడి వారసత్వ ఆస్తి పంపిణీలో ఓ భాగానికి స్టాంపు డ్యూటీ మినహాయింపు నిబంధనను దుర్వినియోగం చేస్తూ స్టాంపు డ్యూటీని భారీగా ఎగవేస్తున్నారు. చట్టబద్ధ వారసులైన కుమారులు, కుమార్తెల మధ్య ఆస్తిని సమాన భాగాలుగా పంపిణీ చేయాల్సి ఉన్నా చేయడం లేదు. ఒకరికి ఆస్తిలో ఎక్కువ భాగం కేటాయిస్తున్నారు. ఆ పెద్ద భాగానికి స్టాంపు డ్యూటీ మినహాయింపు తీసుకుంటున్నారు. మిగిలిన భాగాలకు ఒక శాతం చొప్పున స్టాంపు డ్యూటీ చెల్లిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి నిబంధనల ప్రకారం స్టాంపు డ్యూటీ రావడం లేదు. వారసులు పరస్పర సమ్మతితో ఎక్కువ లేదా తక్కువ భాగాలు పంపిణీ చేసుకోవాలనుకుంటే ఎవరూ కాదనరు. కానీ.. నిబంధనల ప్రకారం సమానంగా పంపిణీ చేసుకుని.. ఎవరికి ఎక్కువ వాటా ఇవ్వాలి అనుకుంటున్నారో మిగిలిన వాటాదారులు తమ వాటా నుంచి ఆ మేరకు ఆస్తిని బదిలీ చేయాలి. అలా చేస్తే.. అది వారసత్వ హక్కును బదలాయించినట్టు అవుతుంది. ఆ మేరకు బదలాయించిన అదనపు ఆస్తి భాగంపై 3శాతం స్టాంపు డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఆ విధంగా చేయకపోవడంతో ప్రభుత్వం 3 శాతం స్టాంపు డ్యూటీని నష్టపోతోంది. -
ఏపీ: ఆ భూములకు స్టాంప్ డ్యూటీ మినహాయింపు
సాక్షి, అమరావతి: గోడౌన్ల నిర్మాణం కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలకు లీజుకిస్తున్న భూములకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులను ప్రభుత్వం మినహాయించింది. ఈ సొసైటీలను గ్రామ స్థాయిలో మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్లుగా తీర్చిదిద్దేందుకు వాటి పరిధిలో గోడౌన్లను నిర్మిస్తున్నారు. వీటి కోసం అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను లీజుకు ఇస్తోంది. ఈ భూములకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులను మినహాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవీ చదవండి: ఏపీ కేబినెట్ ఆమోదించిన అంశాలు ఇవే.. -
హైదరాబాద్‌లో రియల్టీ జోష్.. అమ్మకాలు అదుర్స్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ జోరందుకుంది. ముంబై, బెంగళూరు, పుణే వంటి దేశంలోని ఏ ఇతర నగరంలోనూ కనిపించిన వృద్ధి.. భాగ్యనగరి రియల్టీలో నమోదైంది. 2021 జనవరి–మార్చి (క్యూ1)లో హైదరాబాద్‌లో 4,400 గృహాలు విక్రయమయ్యాయి. 2020 క్యూ1లో ఇవి 2,680 యూనిట్లుగా ఉన్నాయి. అంటే వార్షికంగా 64 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది. అలాగే 2021 క్యూ1లో కొత్తగా 12,620 ఇళ్లు ప్రారంభం కాగా.. క్రితం ఏడాది క్యూ1లో ఇవి 3,380 యూనిట్లుగా ఉన్నాయి. వార్షికంగా 273 శాతం వృద్ధిని నమోదైనట్లు అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్ 2021 క్యూ1 నివేదిక వెల్లడించింది. హైదరాబాద్, ఎన్సీఆర్, ఎంఎంఆర్, బెంగళూరు, పుణే, చెన్నై, కోల్కత్తా దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 2021 క్యూ1లో 58,290 యూనిట్లు అమ్ముడుపోయాయి. 2020 క్యూ1లో ఇవి 45,200 యూనిట్లతో పోలిస్తే 29 శాతం వృద్ధి నమోదైంది. అలాగే 2020 క్యూ1లో 41,220 యూనిట్లు ప్రారంభం కాగా.. 2021 క్యూ1లో 51 శాతం వృద్ధి రేటుతో 62,130 యూనిట్లకు పెరిగాయి. మొత్తం ప్రారంభాల్లో రూ.40–80 లక్షల మధ్య ధర ఉన్న మధ్య స్థాయి గృహాల వాటా 43 శాతం, అఫర్డబుల్ హౌసింగ్ వాటా 30 శాతంగా ఉన్నాయి. అదేవిధంగా గతేడాది క్యూ1లో అమ్ముడుపోకుండా ఉన్న గృహాలు (ఇన్వెంటరీ) 6.44 లక్షలు ఉండగా.. ఈ ఏడాది క్యూ1 నాటికి 6.42 లక్షలకు తగ్గాయి. ఎన్సీఆర్, బెంగళూరు రెండు నగరాల్లో మాత్రమే ఏడాది కాలంలో ధరలు 2 శాతం మేర పెరిగాయి. స్టాంప్ డ్యూటీ తగ్గింపే వృద్ధికి కారణం.. ముంబై, పుణే వంటి నగరాల్లో గృహాల విక్రయాలకు ప్రధాన కారణం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు స్టాంప్ డ్యూటీని తగ్గించడమే. ఇతర నగరాల్లో వృద్ధికి గృహ రుణ వడ్డీ రేట్ల తగ్గింపు, డెవలపర్ల ఆఫర్లు, అందుబాటు ధరలు ప్రధాన కారణాలని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ చైర్మన్ అనూజ్ పురీ తెలిపారు. నగరాల వారీగా చూస్తే.. ఎన్సీఆర్లో 2020 క్యూ1లో 8,150 యూనిట్లు అమ్ముడుపోగా.. 2021 క్యూ1లో 8 శాతం వృద్ధితో 8,790 గృహాలకు పెరిగాయి. ఎంఎంఆర్‌లో 13,910 నుంచి 46 శాతం వృద్ధితో 20,350 యూనిట్లకు, బెంగళూరులో 8,630 నుంచి 8,670కి, పుణేలో 7,200 నుంచి 47 శాతం వృద్ధితో 10,550కి, చెన్నైలో 2,190 నుంచి 30 శాతం పెరుగుదలతో 2,850కి, కోల్‌కత్తాలో 2,440 యూనిట్ల నుంచి 10 శాతం వృద్ధితో 2,680 గృహాలకు చేరాయి. -
రిజిస్ట్రేషన్లు: స్టాంపు డ్యూటీ పెంచే యోచన!
సాక్షి, హైదరాబాద్: గతేడాది బడ్జెట్‌తో పోలిస్తే తాజా బడ్జెట్లో ప్రభుత్వం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయాన్ని రెట్టింపుకన్నా ఎక్కువ చేసి చూపించడటంతో ఆ శాఖకు ఉన్న ఆదాయ మార్గాలు ఏమిటన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాబడులు పెంచుకునేందుకు భూముల మార్కెట్ విలువల సవరణతో లేదా స్టాంపు డ్యూటీ పెంపు లేదా రెండు ప్రతిపాదనలను అమలు చేయడం తప్పనిసరి కానుందనే చర్చ ఆ శాఖలో జరుగుతోంది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలోని భూముల మార్కెట్ విలువలను సవరించకపోవడం, స్టాంపు డ్యూటీని పెంచకపోవడంతో ఇప్పుడు ఈ రెండింటిలో ఒకదాన్ని లేదా రెండింటినీ అమల్లోకి తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. నేటికీ 2013 విలువలతోనే... రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో రెండేళ్లకోసారి, పట్టణ ప్రాంతాల్లో ఏటా భూముల మార్కెట్ విలువలను సవరించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ లెక్కన రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ఏడుసార్లు, పట్టణ ప్రాంతాల్లో కనీసం మూడు దఫాలు మార్కెట్ విలువల సవరణ జరగాల్సి ఉంది. సవరణలు జరిగిన ఏడాది ఆగస్టు 1 నుంచి ఆ విలువలు అమల్లోకి వచ్చేవి. కానీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఈ ప్రక్రియ జరగలేదు. 2013లో జరిగిన సవరణల విలువల ఆధారంగానే ఇప్పటికీ రిజిస్ట్రేషన్ల రుసుము వసూలు చేస్తున్నారు. ఇందులో స్టాంపు డ్యూటీ కింద 6 శాతం వసూలు చేస్తున్నారు. ఈ స్టాంపు డ్యూటీని కూడా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి పెంచలేదు. దీంతో ఈ రెండు ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఈసారి బడ్జెట్ ప్రతిపాదనలను రూ. 6 వేల కోట్ల నుంచి రూ. 12,500 కోట్లకు పెంచారని సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం స్టాంపు డ్యూటీ మన పొరుగు రాష్ట్రాల్లో 7 శాతం వరకు ఉంది. దీనికి సమానంగా ఇక్కడ కూడా స్టాంపు డ్యూటీని పెంచే ఆలోచన సీఎం కేసీఆర్ మదిలో ఉందనే చర్చ రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాల్లో జరుగుతోంది. దీంతోపాటు మార్కెట్ విలువల సవరణ తప్పనిసరిగా ఉంటుందని, ప్రాంతాన్ని బట్టి ఈ విలువలు 50 శాతం నుంచి 200 శాతం వరకు పెంచుతారని సమాచారం. అయితే కేవలం స్టాంపు డ్యూటీ పెంచితే మాత్రం 6 శాతం నుంచి 10 శాతానికి పెంచినా ఆశ్చర్యం లేదన్న చర్చ కూడా నడుస్తోంది. మొత్తంమీద ప్రభుత్వం ఆశించిన మేర వచ్చే ఏడాదికి రెట్టింపు ఆదాయం రావాలంటే మార్కెట్ విలువల సవరణ, స్టాంపు డ్యూటీల పెంపు అనివార్యమని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. సవరణే... ఉత్తమం.. అయితే స్టాంపు డ్యూటీ పెంపు సాధారణ ప్రజానీకంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని స్టాంపుల శాఖ వర్గాలు చెబుతున్నాయి. కరోనా నేపథ్యంలో ప్రజలపై భారం పడకుండా ఉండేందుకు కర్ణాటకలో ఉన్న 5 శాతం ఉన్న స్టాంపు డ్యూటీని 3 శాతానికి తగ్గించారు. మహారాష్ట్రలో కూడా స్టాంపు డ్యూటీ తగ్గించారని అధికారుల ద్వారా తెలుస్తోంది. స్టాంపు డ్యూటీ పెంచితే రుణాలు తీసుకొని ప్లాట్లు, ఫ్లాట్లు కొనుక్కొనే వారిపై అదనపు భారం పడుతుందని, స్టాంపు డ్యూటీ పెంపు కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారులకే ఉపకరిస్తుందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. మార్కెట్ విలువలను సవరించాల్సిన అనివార్యత ఉంది కాబట్టి ఈ విలువలను అవసరమైతే 300 శాతం పెంచినా ప్రజానీకంపై ప్రత్యక్ష భారం ఉండదని, తద్వారా భూముల బహిరంగ విలువలు కూడా తగ్గే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మార్కెట్ విలువల సవరణ వైపే మొగ్గుచూపడం ద్వారా ప్రజలపై భారం మోపకుండా ఆదాయం పెంచుకోవచ్చని రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. కలవరపెడుతున్న వింతవ్యాధి -
రియల్టీ షేర్లకు మరాఠీ జోష్
కోవిడ్-19 కారణంగా ఎదురవుతున్న సవాళ్లనుంచి రియల్టీ రంగానికి ఉపశమనాన్ని కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా స్టాంప్ డ్యూటీని 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించేందుకు నిర్ణయించినట్లు వార్తలు వెలువడ్డాయి. గృహ వినియోగదారులకు మద్దతుగా స్టాంప్ డ్యూటీ తగ్గింపు నిర్ణయాన్ని ఈ ఏడాది డిసెంబర్‌వరకూ అమలు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. అంతేకాకుండా 2021 జనవరి 1 నుంచి మార్చి 31 వరకూ 3 శాతం స్టాంప్ డ్యూటీని మాత్రమే విధించనున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాలలో స్టాంప్ డ్యూటీ 4 శాతం నుంచి 1 శాతానికి తగ్గనుంది. 2021 జనవరి- మార్చి మధ్య కాలంలో 2 శాతంగా అమలుకానుంది. కరోనా వైరస్ విస్తృతితో ఇటీవల డీలాపడ్డ రియల్టీకి మద్దతుగా స్టాంప్ డ్యూటీని తగ్గించమంటూ కొంతకాలంగా రియల్టీ కంపెనీలు ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నట్లు నిపుణులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ వార్తలతో ఒక్కసారిగా రియల్టీ కౌంటర్లకు డిమాండ్ పెరిగింది. వెరసి ఎన్ఎస్ఈలో రియల్టీ రంగం 3.3 శాతం ఎగసింది. ప్రస్తుతం పలు కౌంటర్లు ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. ర్యాలీ బాటలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో సన్‌టెక్ రియల్టీ 8.5 శాతం దూసుకెళ్లి రూ. 225 వద్ద ట్రేడవుతోంది. ఈ బాటలో ఒబెరాయ్ రియల్టీ 6.3 శాతం జంప్‌చేసి రూ. 390ను తాకగా.. ఇండియాబుల్స్ రియల్టీ 4.7 శాతం ఎగసి రూ. 73కు చేరింది. ఇతర కౌంటర్లలో గోద్రెజ్ ప్రాపర్టీస్ 4.5 శాతం పెరిగి రూ. 889 వద్ద, శోభా లిమిటెడ్ 2.25 శాతం బలపడి రూ. 261 వద్ద ట్రేడవుతున్నాయి. ఇదేవిధంగా ప్రెస్టీజ్ ఎస్టేట్స్ 2 శాతం పుంజుకుని రూ. 245 వద్ద, బ్రిగేడ్ 2 శాతం లాభంతో రూ. 175 వద్ద కదులుతున్నాయి. ఇక ఒమాక్స్ 1.2 శాతం పెరిగి రూ. 75ను అధిగమించగా.. ఫీనిక్స్ 0.7 శాతం బలపడి రూ. 655 వద్ద, డీఎల్ఎఫ్ 0.7 శాతం లాభపడి రూ. 161 వద్ద ట్రేడవుతున్నాయి. -
సొంతిల్లు ఉన్నా.. కొంటున్నా!
సొంతిల్లు చాలా మంది స్వప్నం. సొంతింటితో పెనవేసుకున్న జ్ఞాపకాలను మధురంగా పరిగణించే వారు ఎందరో... అయితే, ఎంతో ఖర్చు చేసి కొన్న ఇంటిలో నివాసం ఉండేవారు కొందరు అయితే... అద్దెకు ఇచ్చేవారు కూడా కొందరు ఉంటారు. సొంతంగా నివాసం ఉండేవారు, అద్దెకు ఇచ్చిన వారిపై ఆదాయపన్ను చట్టం కింద పలు బాధ్యతలు ఉన్నాయి. వాటిని తప్పక తెలుసుకోవాలి. సొంతిల్లు ఉండి, ఉద్యోగ సంస్థ నుంచి హెచ్ఆర్ఏ పొందుతూ పన్ను మినహాయింపు పొందడం కుదరదు. రెండుకు మించిన ఇళ్లను సొంత వినియోగంలో ఉంచుకున్నా కానీ దానిపై అద్దె వస్తున్నట్టుగానే చట్టం పరిగణిస్తుంది. ఆదాయపన్ను చట్టంలోని నిబంధనల మేరకు ఇంటి చుట్టూ ముడిపడిన పన్నుల అంశాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నదే ఈ కథనం ఉద్దేశం. ఇంటిని కొంటుంటే...? మీరు ఇంటిని కొనుగోలు చేయడానికి సిద్ధపడుతుంటే... సంబంధిత లావాదేవీ పన్ను అధికారుల దృష్టికి వెళుతుందని గ్రహించాలి. ఇంటి కొనుగోలుపై మీరు చెల్లించే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలను ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపును పొందే అవకాశం అందుబాటులో ఉంది. అంతేకాదు, ఇంటి కొనుగోలుతో ఓ వ్యక్తి పన్నుల భారాన్ని కూడా తగ్గించుకోవచ్చు. ఒకవేళ బహుమతిగా తీసుకుంటుంటే మాత్రం ఆ ఇంటి విలువ మీ ఆదాయంలోనే కలుస్తుందని గుర్తుంచుకోవాలి. దానిపై పన్ను కూడా చెల్లించాల్సి రావచ్చు. కొనుగోలుపై టీడీఎస్ ఇంటి కొనుగోలు విలువ రూ.50 లక్షలు, అంతకుమించి ఉంటే విక్రయదారుకు నిర్ణీత విలువ చెల్లించడానికి ముందుగానే, దానిపై 1 శాతం టీడీఎస్‌ను మినహాయించుకోవాల్సి ఉంటుంది. ఈ టీడీఎస్‌ను ఎన్ ఎస్డీఎల్ వెబ్‌సైట్‌కు వెళ్లి ఫామ్ 26బిక్యూ ను ఫిల్ చేసి, కొనుగోలుదారు పాన్ , విక్రయదారు పాన్ వివరాలు ఇచ్చి చెల్లించాలి. లావాదేవీ జరిగిన నెల చివరి నుంచి 30 రోజుల్లోపు టీడీఎస్‌ను చెల్లించా ల్సి ఉంటుంది. అంతేకాదు మీకు విక్రయించిన వ్యక్తి కి టీడీఎస్ సర్టిఫికెట్ (ఫామ్ 16)ను ఇవ్వాలి. ట్రేసెస్ వెబ్సైట్ నుంచి దీన్ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ నిర్ణీత సమయంలోపు టీడీఎస్‌ను డిపాజిట్ చేయకపోతే, అప్పుడు 1–1.5 శాతం వడ్డీ రేటుతోపాటు పెనాల్టీ చార్జీలను కూడా చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ మీరు ఎన్ ఆర్ఐ నుంచి ఇంటిని కొనుగోలు చేస్తుంటే, అప్పుడు ఇంటి విలువ ఎంత ఉన్నా గానీ దానిపై 1 శాతం టీడీఎస్‌ను మినహాయించుకుని చెల్లింపులు చేయాలి. అయితే, ఈ టీడీఎస్‌ను ఇంటి విక్రయ ధరపై కాకుండా, ఆర్జించిన మూలధన లాభాలపైనే అమలు చేయాల్సి ఉంటుంది. బహుమతి అయితే పన్ను పడుద్ది మీ బంధువు లేదా స్నేహితులు మీకు ఇంటిని బహుమతిగా ఇస్తే దానిపై పన్ను చెల్లించాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి. బహుమతి విలువ రూ.50,000 దాటితే గిఫ్ట్ ట్యాక్స్ పరిధిలోకి వస్తారు. స్టాంప్ డ్యూటీ విలువను మీ ఆదాయంలో ఇతర మూలాల (ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్) నుంచి వచ్చినట్టు చూపించాలి. ఆదాయపన్ను శ్లాబు రేటు ప్రకారం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ప్రతీ నిబంధనలోనూ కొన్ని మినహాయింపులు ఉంటాయని తెలుసు కదా. అలాగే, గిఫ్ట్ ట్యాక్స్‌లోనూ కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఒకవేళ ఇంటిని మీ వివాహ సందర్భంలో బహుమతిగా పొందుతుంటే లేదా వీలునామా కింద మీకు దక్కుతున్నా లేదా వారసత్వంగా లేదా కొన్ని ప్రత్యేకంగా పేర్కొన్న ఇనిస్టిట్యూషన్ల నుంచి తీసుకుంటున్నా దానిపై పన్ను చెల్లించక్కర్లేదని చట్టం చెబుతోంది. ఇక అత్యంత సమీప బంధువుల నుంచి గిఫ్ట్‌గా తీసుకున్నా పన్ను భారం ఉండదు. ఈ పరిధిలోకి జీవిత భాగస్వామి, మీ సోదరులు, సోదరీమణులు లేక సంతానం, అలాగే మీ భార్య సోదరులు, సోదరీమణులు, తల్లిదండ్రులు వస్తారు. స్టాంప్ డ్యూటీపై పన్ను మినహాయింపు ఇంటిని కొనే సమయంలో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ రుసుముల భారం భరించక తప్పదు. ఇవన్నీ కలసి ప్రాపర్టీ కొనుగోలు విలువలో గరిష్టంగా 10 శాతం వరకూ ఉంటుంటాయి. అయితే దీనిపై ఆదాయపన్ను చట్టం కింద కొంత వెసులుబాటు పొందే అవకాశం ఉంది. ఈ చార్జీలను సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల మొత్తంపై పన్ను మినహాయింపు పొందేందుకు ఆదాయపన్ను చట్టం అనుమతిస్తోంది. కానీ, ఇక్కడే ఓ చిన్న తిరకాసు కూడా ఉంది. ఒకవేళ మీరు కొన్న ఇంటిపై ఈ చార్జీలను సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొంది, ఐదేళ్లు పూర్తి కాకముందే సంబంధిత ఇంటిని విక్రయిస్తే... గతంలో పొందిన మినహాయింపు మొత్తాన్ని తిరిగి మీ ఆదాయంలో చూపించి పన్ను చెల్లించాల్సి ఉంటుందని మరవొద్దు. ఇంటిపై పెట్టుబడితో తగ్గనున్న పన్ను దీర్ఘకాల పెట్టుబడుల రూపంలో ఉన్న బంగారం లేదా ఈక్విటీ షేర్లు లేదా రియల్ ఎస్టేట్ లేదా ఇంటిని విక్రయించగా వచ్చిన మొత్తంతో తిరిగి ఇంటిని కొనుగోలు చేస్తే... క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ భారం తగ్గుతుంది. నూతనంగా సమకూర్చుకున్న మొదటి ఇల్లు... దీర్ఘకాలిక పెట్టుబడులను విక్రయించడానికి ఏడాది ముందు లేదా తర్వాత రెండేళ్లలోపు సమకూర్చుకున్నప్పుడే ఈ ప్రయోజనం సిద్ధిస్తుందని గుర్తుంచుకోవాలి. ఒకవేళ దీర్ఘకాల పెట్టుబడుల విక్రయం ద్వారా పొందిన మూలధన లాభాల మొత్తాన్ని సంబంధిత ఆర్థిక సంవత్సరం రిటర్నులు ఫైల్ చేసే గడువు నాటికి నూతన ఇంటిపై ఇన్వెస్ట్ చేయకపోతే, అదే సమయంలో చట్టంలో ఇచ్చిన గడువు లోపు నూతన ఇంటిపై ఇన్వెస్ట్ చేయాలని భావిస్తున్నట్టు అయితే... అప్పుడు ఆ మొత్తాన్ని పన్ను మినహాయింపు కోసం నిర్దేశిత బ్యాంకుల్లో క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్‌కు బదలాయించాల్సి ఉంటుంది. దీర్ఘకాల మూలధన లాభాలపై పన్ను మినహాయింపును తిరిగి ఒక ఇంటి కొనుగోలుకే పరిమితం అన్నది ప్రస్తుత నిబంధన కాగా, దీన్ని కేంద్రం సడలించి 2020 ఏప్రిల్ 1 నుంచి రెండు ఇళ్ల కొనుగోలుకూ వర్తింపజేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంటి విక్రయంపై రూ.2 కోట్లు దాటకుండా వచ్చిన మూలధన లాభాల మొత్తాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రెండు ఇళ్ల కొనుగోలుపై ఇన్వెస్ట్ చేసినా గానీ పన్ను భారం నుంచి ఊపిరి పీల్చుకోవచ్చన్న విషయం ఇక్కడ గమనార్హం. ఇంటి యజమాని అయితే... ఓ ఇంటికి యజమాని అయితే ఇందుకు సంబంధించి నిబంధనలపై అవగాహన కలిగి ఉండడం ఎంతో అవసరం. సొంతంగా నివాసం ఉంటున్న ప్రాపర్టీయా లేక అద్దెకు ఇచ్చారా..? ఒకవేళ అద్దెకు ఇస్తే అద్దె ఆదాయంపై ఇంటి యజమాని పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అద్దె ఎవరి చేతికి వెళ్లినా కానీ, ఈ ఇంటి యజమానిగా రికార్డుల్లో ఉన్న వారే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. తమ ఇంట్లో తామే నివాసం ఉంటుంటే దాన్ని సెల్ఫ్ ఆక్యుపెయిడ్ ప్రాపర్టీ (ఎస్వోపీ)గా చట్టం పరిగణిస్తోంది. అటువంటి సందర్భాల్లో ఇంటిపై ఆదాయపన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఎస్వోపీలపై పన్ను ఉండదు. అయితే, సొంత నివాసం కోసం ఉంచుకునే ఇళ్ల విషయంలో ఐటీ చట్టం పరిమితి విధించింది. 2019–20 నుంచి ఒక వ్యక్తి రెండు ఎస్‌వోపీలను కలిగి ఉండొచ్చు. అంటే, మూడో ఇల్లు, అంతకంటే ఎక్కువ ఇళ్లను తమ పేరిట కలిగి ఉండి, వాటిని అద్దెకు ఇచ్చినా, లేక సొంత వినియోగానికి ఉంచుకున్నా గానీ వాటిపై అద్దె అదాయం వస్తున్నట్టుగానే చట్టం పరిగణిస్తుంది. కనుక నోషనల్ రెంట్‌పై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఇలా మూడు, అంతకంటే ఎక్కువ ఇళ్లు ఉన్న వారు వాటిల్లో తమ వంతు రెండు ఎస్‌వోపీలు ఏవన్నది ఎంపిక చేసుకునే స్వేచ్చ ఉంటుంది. అంటే ఎక్కువ అద్దె విలువ వచ్చే వాటిని తమ పేరిట ఉన్నట్టు చూపించుకోవచ్చు. పొందొచ్చు. రుణం తీసుకుని కొన్న ఇంటిపై... ఇంటి కొనుగోలు కోసం తీసుకున్న రుణానికి చేసే అసలుపై సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల మేర పన్ను మినహాయింపు పొందొచ్చు. ఇక ఇంటి రుణంపై అసలుతోపాటు ఏటా చేసే వడ్డీ చెల్లింపులకూ పన్ను మినహాయింపు ఉంటుంది. ఇంటి రుణంపై వడ్డీ చెల్లింపులకు మినహాయింపు అన్నది... ఆ ఇంటి నిర్మాణం పూర్తయిన ఏడాది లేదా దాన్ని సమకూర్చుకున్న ఏడాదిగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. రుణంపై సమకూర్చుకున్న ఇంటిని సొంత వినియోగానికి ఉంచుకుంటే గరిష్టంగా సెక్షన్ 24 కింద ఓ ఆర్థిక సంవత్సరంలో రూ.2 లక్షల వడ్డీ చెల్లింపులకు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఒకవేళ ఇంటిని అద్దెకు ఇచ్చినట్టయితే, ఆ ఇంటి రుణంపై చేసే వడ్డీ చెల్లింపులు మొత్తంపైనా పరిమితి లేకుండా పన్ను మినహాయింపు పొందొచ్చు. అయితే, ఒకవేళ రుణాన్ని 1999 ఏప్రిల్ 1కి ముందు తీసుకుని, ఆ రుణం తీసుకున్న ఆర్థిక సంవత్సరం నాటి నుంచి ఐదేళ్లలోపు ఇంటి కొనుగోలు లేదా నిర్మాణం పూర్తి కాకపోయి ఉంటే... వడ్డీ చెల్లింపులపై గరిష్టంగా రూ.30,000 వరకే పన్ను మిహాయింపు చూపించుకునే పరిమితి విధించారు. ఇక మొదటిసారి ఇంటిని కొనుగోలు చేసిన వారు సెక్షన్ 80ఈఈ కింద రూ.2 లక్షలకు అదనంగా మరో రూ.50,000 వరకు వడ్డీ చెల్లింపులపై మినహాయింపు చూపించుకోవచ్చు. అంటే మొత్తం రూ.2.5 లక్షల వడ్డీ చెల్లింపులకు పన్ను ప్రయోజనాన్ని పొందొచ్చు. నిర్మాణంలో ఉన్న సమయంలో రుణంపై చేసిన వడ్డీ చెల్లింపులకూ మినహాయింపు పొందొచ్చు. రుణం తీసుకున్న నాటి నుంచి నిర్మాణం పూర్తయి లేదా స్వాధీనం చేసుకునే నాటి వరకు చేసిన వడ్డీ చెల్లింపుల మినహాయింపునకు చట్టం అనుమతిస్తోంది. నిర్మాణం పూర్తయి లేదా స్వాధీనం చేసుకున్న సంవత్సరం తర్వాతి నుంచి 5 వాయిదాల్లో ఈ మొత్తంపై పన్ను మినహాయింపు ఉంటుంది. హెచ్ఆర్ఏ... పనిచేసే సంస్థ నుంచి ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) పొందే వారు దానిపై ఐటీ మినహాయింపు పొందవచ్చు. 1. సంస్థ నుంచి ఒక ఆర్థిక సంవత్సరంలో పొందిన మొత్తం హెచ్ఆర్ఏ. 2. మెట్రో నగరాల్లో వేతనంలో 50 శాతం, ఇతర ప్రాంతాల్లో నివాసం ఉండే వారి వేతనంలో 40 శాతం. 3. వాస్తవంగా మీరు చెల్లించిన ఇంటి అద్దె నుంచి... మీ వార్షిక వేతనంలో 10 శాతాన్ని మినహాయించగా వచ్చేది. ఈ మూడింటిలో ఏది తక్కువగా ఉంటే ఆదాయపన్ను చట్టం ప్రకారం దానిపైనే పన్ను మినహాయింపు లభిస్తుంది. మీరు ఉద్యోగి అయి ఉండి, హెచ్ఆర్ఏ పొందుతూ... సొంత ఇంట్లోనే నివాసం ఉంటుంటే అప్పుడు మీరు పొందే హెచ్ఆర్ఏపై పన్ను మినహాయింపు తీసుకోవడానికి చట్టం అనుమతించదు. అయితే, దీనికి బదులు మీరు నివాసం ఉంటున్న ఇంటికి తీసుకున్న రుణానికి చేసే అసలు, వడ్డీ చెల్లింపులకు పైన చెప్పుకున్న మేర పన్ను మినహాయింపులు లభిస్తాయి. ఇక సొంతిల్లు ఉన్నప్పటికీ దాన్ని అద్దెకు ఇచ్చి, మరో ప్రాంతంలో నివాసం ఉంటున్న వారి విషయంలో... ఇంటి రుణంపై అసలు, వడ్డీ చెల్లింపులకూ, మరో వైపు హెచ్ఆర్ఐపైనా పన్ను మినహాయింపులకు అవకాశం ఉంది. ఉదాహరణకు నోయిడాలో ఇల్లు ఉండి, దాన్ని అద్దెకు ఇచ్చి ఆఫీసుకు దగ్గర్లో ఉంటుందని ఢిల్లీలో నివాసం ఉంటున్నట్టు అయితే అటు ఇంటి రుణంపై చెల్లింపులు, మరోవైపు హెచ్ఆర్ఏపైనా పన్ను ప్రయోజనాలను సొంతం చేసుకునేందుకు చట్టం అనుమతిస్తోంది. ఇంటిని విక్రయిస్తుంటే... ఐటీ చట్టం ప్రకారం నివాస భవనం క్యాపిటల్ అస్సెట్ కిందకు వస్తుంది. కనుక ఇంటిని విక్రయించినప్పుడు పొందిన లాభం, నష్టం క్యాపిటల్ గెయిన్ రూపంలో పన్ను పరిధిలోకి వస్తుంది. ఇంటిని కొనుగోలు చేసిన నాటి నుంచి 24 నెలలలోపు విక్రయించినట్టయితే అది స్వల్ప కాల మూలధన లాభం (ఎస్టీసీజీ), 24 నెలలు దాటిన తర్వాత విక్రయించినప్పుడు వచ్చే లాభాన్ని దీర్ఘకాలిక మూలధన లాభం (ఎల్టీసీజీ)గా చట్టం పరిగణిస్తోంది. ఇంటి విక్రయ సమయంలో అయ్యే వ్యయాలను మూలధన లాభాల నుంచి మినహాయించుకోవచ్చు. బ్రోకరేజీ, స్టాంప్ పేపర్ చార్జీలను ఇందులో నుంచి తగ్గించుకోవచ్చు. అలాగే, ద్రవ్యోల్బణం ప్రభావాన్ని కూడా తగ్గించుకోవచ్చు. వీటిని తీసివేయగా మిగిలిన దీర్ఘకాలిక మూలధన లాభంపై 20 శాతం పన్నుకు అదనంగా సర్‌చార్జ్, సెస్సు చెల్లించాల్సి వస్తుంది. ద్రవ్యోల్బణ సూచీ ప్రభావ ప్రయోజనం, ఎస్టీసీజీకి ఉండదు. ఇంటి విక్రయం రూపంలో వచ్చే ఎస్టీసీజీని ఆ వ్యక్తి సంబంధిత ఆర్థిక సంవత్సరం తన ఆదాయానికి కలిపి తన శ్లాబు రేటు ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇంటి విక్రయ విలువపైనే మూలధన లాభార్జన ఆధారపడి ఉంటుంది. ఆదాయ పన్ను భారం తగ్గించుకునే ఉద్దేశ్యంతో విక్రయదారులు విక్రయ విలువను తక్కువ చేసి చూపడాన్ని నిరోధించేందుకు ఆదాయపన్ను శాఖ సెక్షన్ 50సీని ప్రవేశపెట్టింది. స్టాంప్ వ్యాల్యూ కంటే 5 శాతానికి మించి తక్కువ చేసి విలువ చూపించినప్పుడు ఈ చట్టం వర్తిస్తుంది. అటువంటి సందర్భాల్లో పన్ను అధికారులు స్టాంప్ వ్యాల్యూషన్ నే పరిగణనలోకి తీసుకుంటారు. మూలధన లాభాలపై పన్ను భారం పడకుండా... మూలధన లాభాల పన్ను చెల్లించకుండా ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఉన్నాయి. ఇంటి విక్రయం ద్వారా దీర్ఘకాలిక మూలధన లాభాన్ని పొందిన వారు.. నూతనంగా మరో ఇంటి కొనుగోలుకు వెచ్చించడం లేదా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా లేదా రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లేదా పవర్ ఫైనాన్స కార్పొరేషన్ జారీ చేసిన బాండ్లలో ఇన్వెస్ట్ చేసినా సరిపోతుంది. రూ.50 లక్షల వరకూ మూలధన లాభాన్ని ఈ బాండ్లలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇంటిని విక్రయించిన తర్వాత ఆరు నెలల్లోపే ఈ బాండ్లలో ఇన్వెస్ట్ చేయాలి. ఐదేళ్ల తర్వాతే తిరిగి ఆ బాండ్లను రిడీమ్ చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. ఒకవేళ మీ ఇంటిని వారసత్వంగా మరొకరికి బదలాయించినా లేదా గిఫ్ట్‌గా ఇచ్చినా, అటువంటి సందర్బాల్లో విక్రయం జరిగినట్టుగా చట్టం పరిగణించదు. కనుక దీనిపై మూలధన లాభాల పన్ను ఉండదు. అయితే వారసత్వంగా లేదా బహుమానం రూపంలో పొందిన ఇంటిని, విక్రయించడం ద్వారా మూలధన లాభాలు వస్తే మాత్రం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వారసత్వంగా లేక బహుమతిగా వచ్చి సందర్భాల్లో పూర్వపు యజమాని సంబంధిత ఆస్తి సమకూర్చుకున్న మొత్తం కొనుగోలు వ్యయంగా చట్టం పరిగణిస్తుంది. స్వల్ప కాల మూలధన లాభం లేక దీర్ఘకాలిక మూలధన లాభమా అన్నది నిర్ధారించేందుకు పూర్వపు యజమాని స్వాధీనంలో ఉన్న కాలాన్ని కూడా ప్రస్తుతం విక్రయించిన యజమాని స్వాధీనంలోని వచ్చిన కాలానికి కలుపుకోవచ్చు. -
సతాయిస్తున్న సర్వర్
సాక్షి, సిటీబ్యూరో: స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లకు మూహూర్తాలు పెట్టుకొని మరీ స్లాట్ బుక్ చేసుకుంటున్న దస్తావేజుదారులకు స్టాంప్ డ్యూటీ చెల్లింపు చుక్కలు చూపుతోంది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ సర్వర్‌లో ఈ–చలాన్ జనరేట్ అవుతున్నా... బ్యాంక్ సర్వర్‌లో మాత్రం కనిపించే సరికి ఆలస్యమవుతోంది. ఫలితంగా స్థిరాస్తి రిజిస్ట్రేషన్లకు పెట్టుకున్న ముహూర్తాలు మించిపోతుండడంతో దస్తావేజుదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు మరింత వేగవంతమైన, మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో మూడేళ్ల క్రితం ఈ–చలాన్ విధానం ప్రవేశపెట్టగా, సర్వర్ మొరాయిస్తుండడంతోఇబ్బందులు తప్పడం లేదు. ఈ–చలాన్‌కు సర్వర్ అనుసంధానం అంతర్జాల అంతర్గత సమస్యగా తయారైంది. సాఫ్ట్వేర్ సమస్య... బ్యాంక్ సర్వర్‌లో సాఫ్ట్వేర్ సమస్యగా మారింది. స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా (ఎస్బీఐ)లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) వీలినం తర్వాత స్టాంప్ డ్యూటీ ఈ–చలాన్ బాధ్యత కేవలం ఎస్బీఐకే పరిమితమైంది. దీంతో బ్యాంక్ సర్వర్‌పై ఈ–చలాన్ భారం అధికమై సాఫ్ట్వేర్ సమస్య తలెత్తింది. వాస్తవానికి ఈ–చలాన్ల స్వీకరణకు రిజిస్ట్రేషన్ల శాఖ ఎస్‌బీహెచ్‌తో ఒప్పందం కుదర్చుకుంది. గత రెండేళ్ల వరకు దస్తావేజుదారులు స్టాంప్ డ్యూటీ ఈ–చలాన్ చెల్లింపులు ఎస్బీహెచ్ ద్వారానే చేసేవారు. అయితే బ్యాంకుల విలీనం తర్వాత అది ఎస్బీఐకి మారింది. గతంలో రిజిస్ట్రేషన్ల శాఖ సెంట్రల్ సర్వర్ ముప్పుతిప్పలు పెట్టగా, ప్రస్తుతం బ్యాంకు సర్వర్‌కు అనుసంధానంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో ఉదయం ఈ–చలాన్ జనరేట్ అవుతుండగా, సాయంత్రం నాలుగైదు గంటలైతే తప్ప బ్యాంక్ సర్వర్‌లో ఈ–చలాన్ కనిపించడం లేదు. టోకెన్లతోనూ తిప్పలు... బ్యాంకుల్లో ఈ–చలాన్ చెల్లింపులకు ఆన్లైన్ టోకెన్ విధానం అమలవుతుండడంతో దస్తావేజుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దస్తావేజుదారుడు ఈ–చలాన్ చెల్లింపు కోసం టోకెన్ తీసుకొని గంటలకొద్దీ వేచి చూడాల్సి వస్తోంది. తీరా టోకెన్ సంఖ్య వచ్చేసరికి బ్యాంక్ సర్వర్‌లో ఈ–చలాన్ చూపించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. దస్తావేజుదారు తిరిగి టోకెన్ తీసుకొని మళ్లీ నంబర్ వచ్చేసరికి వేచి చూడాల్సి వస్తోంది. బ్యాంక్ సర్వర్‌లో ఈ–చలాన్ కనిపించే వరకు బ్యాంకర్లు చెల్లింపులు తీసుకోవడం లేదు. ఈ–చలాన్ చెల్లింపులు చేసిన తర్వాత కూడా తిరిగి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సర్వర్‌లో క్లియర్ చేసుకోవడానికీ అష్టకష్టాలు తప్పడం లేదు. దీంతో స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు నిర్ణయించుకున్న ముహూర్తాలకు పూర్తి కాకపోవడంతో దస్తావేజుదారులు నిరాశ చెందుతున్నారు. -
రిజిస్ట్రేషన్లలో నోటరీలకు స్వస్తి!
మున్సిపాల్టీల్లో మార్టిగేజ్ రిజిస్ట్రేషన్లపై స్పష్టత ఇచ్చిన రిజిస్ట్రేషన్ల శాఖ సాక్షి, హైదరాబాద్: పురపాలక సంఘాల్లో భూమి/భవ నాల తనఖాకు సంబంధించి నోటరీలు చెల్లవని రిజిస్ట్రే షన్ల శాఖ స్పష్టం చేసింది. దీనికి సంబంధించి 2013 డిసెంబర్లోనే ఉత్తర్వులిచ్చినా అమలుకు నోచుకోవడం లేదు. రిజిస్ట్రేషన్ల శాఖకు వార్షికాదాయం తగ్గడానికి ఇది కూడా కారణమని గ్రహించిన ఉన్నతాధికారులు తాజాగా దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇకపై పట్టణ ప్రాంతాల్లోని ఏ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలోనూ నోటరీలను పరిగ ణలోకి తీసుకోవద్దని సబ్రిజిస్ట్రార్లకు ఆదేశాలిచ్చారు. ఏదైనా భవన నిర్మాణానికి పురపాలక సంఘాల నుంచి అనుమతి తీసుకునేటప్పుడు నిబంధనల ప్రకారం 10 శాతం భూమి లేదా భవనాన్ని సదరు మున్సిపాలిటీకి మార్టిగేజ్ చేయాల్సి ఉంటుంది. మార్టిగేజ్ రిజిస్ట్రేషన్ చేసేందుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో స్టాంప్‌డ్యూటీ రూ.5వేలతో పాటు మార్కెట్ వాల్యూలో 0.5శాతం రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. 2013కు ముందు భవన నిర్మాణ అనుమతి కోసం పురపాలక సంఘాలకు దరఖా స్తు చేసుకునే యజమానులు 10 శాతం భూమి/భవనాన్ని తనఖా పెట్టినట్లుగా నోటరీ చేయించేవారు. 2013 తరువాత కూడా ఇది కొనసాగించడం వల్ల శాఖ ఆదాయానికి గండి పడుతోంది. దీంతో శాఖ తాజా నిర్ణయం తీసుకుంది. -
స్థిరాస్తి రిజిస్ట్రేషన్‌కు రూట్‌మ్యాప్ తప్పనిసరి
ఆదాయానికి గండిపడే మార్గాలపై రిజిస్ట్రేషన్ల శాఖ దృష్టి సాక్షి, హైదరాబాద్: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో అడ్డూఅదుపు లేకుండా జరుగుతున్న అక్రమాలకు కళ్లెం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సర్కారు ఆదేశాల మేరకు ఆదా యానికి గండిపడే మార్గాలపై రిజిస్ట్రేషన్ల శాఖ దృష్టి పెట్టింది. క్షేత్రస్థాయిలో నిబంధనల ఉల్లంఘనలకు సబ్రిజిస్ట్రార్లనే పూర్తి బాధ్యులుగా పరిగణించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో స్థిరాస్తి రిజి స్ట్రేషన్‌కు సదరు ఆస్తి ఉన్న ప్రదేశం రూట్‌మ్యాప్‌ను తప్పనిసరిగా సమర్పించాలని శాఖ నిబంధన పెట్టింది. అలాగే, రిజిస్ట్రేషన్ చేయా ల్సిన స్థిరాస్తి భవనం అయితే, తప్పనిసరిగా ముందువైపు నుంచి ఫొటోను తీసి దస్తావేజుకు జత చేయాలి. కొత్త నిబంధనల ద్వారా రిజిస్ట్రేషన్ అయిన స్థిరాస్తిని ఆడిట్ అధికారులు తనిఖీ చేసేందుకు వీలువుతుందని, దస్తావేజులో పేర్కొన్న భవన విస్తీర్ణాన్ని ఉద్దేశపూర్వకంగా తక్కువగా చూపేందుకు వీలుకాదని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ తరహా నిబంధనలను పాటించకుండా తక్కువ మొత్తంలో స్టాంపు డ్యూటీతో రిజిస్ట్రేషన్ చేస్తే సదరు సబ్ రిజిస్ట్రార్లనే బాధ్యులుగా పరిగణించాలని నిర్ణయించారు. వ్యవస్థను నీరుగార్చవద్దు... రిజిస్ట్రేషన్ సేవల నిమిత్తం ఫీజు, స్టాంప్‌డ్యూటీలను వసూలు చేయడం కూడా పన్నుల చట్టం కిందకే వస్తుందని, ఈ నేపథ్యంలో శాఖాపరంగా ఎటువంటి లోపాలకు గానీ, వ్యవస్థను పలుచన చేసేందుకు అధికారులు తావివ్వరాదని రిజిస్ట్రేషన్ల శాఖ స్పష్టం చేసిం ది. ఈ మేరకు తొలుత హైదరాబాద్, హైదరాబాద్ సౌత్ జిల్లాల్లో ఆడిట్ బృందాలు తనిఖీలు నిర్వహించి, 45 రోజుల్లోగా బకాయిలన్నింటినీ క్లియర్ చేసేందుకు కృషి చేయాలని, భవిష్యత్తులో అన్ని జిల్లాల్లోనూ పురోగతిని సాధించే విధంగా పనిచేయాలని ఉన్నతాధికారులు సూచించారు. -
ఎక్కడ.. ఎవరికి.. ఎలా..!
⇒ వాహనాల స్టాంపు డ్యూటీపై గందరగోళం ⇒ ఆర్టీఏ, స్టాంప్స్‌అండ్ రిజిస్ట్రేషన్ విభాగాల మధ్య సమన్వయం కరువు ⇒ రుణప్రాతిపదికన వాహనాలు కొనుగోలు చేసిన వారికి ఇబ్బందులు ⇒ వాహనాల రిజిస్ట్రేషన్లలో జాప్యం హైదరాబాద్: ఫైనాన్స్ వాహనాలపై 0.5 శాతం చొప్పున ప్రభుత్వం విధించిన స్టాంపు డ్యూటీపై గందరగోళం నెలకొంది. ఈ మేరకు ప్రభుత్వం జీవో విడుదల చేసి నెలరోజులు గడుస్తున్నా జీవో అమలుపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికితోడు రవాణాశాఖ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగాల మధ్య సమన్వయకొరవడడంతో స్టాంపు డ్యూటీ ఎక్కడ చెల్లించాలి, ఎవరికి చెల్లించాలో తెలియని సందిగ్థత నెలకొంది. స్టాంపు డ్యూటీ చెల్లించినట్లుగా ఆధారం ఉంటే తప్ప వాహనాలు నమోదు చేయడం సాధ్యం కాదని ఆర్టీఏ అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఎక్కడ చెల్లించాలి, ఏ విధంగా చెల్లించాలో తెలియక వాహనదారులు అయోమయానికి లోనవుతున్నారు. వాహన రుణాలపై ఫైనాన్షియర్లు, వాహనదారులకు మధ్య కుదిరిన రుణ ఒప్పందం మేరకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ విభాగానికి చేరేవిధంగా ప్రతి వాహనంపైన 0.5 శాతం చొప్పున స్టాంపు డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకులు, సహకార సంస్థలు తదితర పెద్ద సంస్థలకు సంబంధించిన కార్యకలాపాలు సక్రమంగానే జరుగుతున్నా వందల సంఖ్యలో ఉన్న ప్రైవేట్ ఫైనాన్షియర్ల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ జీవో ప్రకారం 0.5 శాతం చొప్పున ద్విచక్ర వాహనాలపైన రూ. 250 వరకు, కార్లు, ఇతర వాహనాలపైన రూ. 1500 నుంచి రూ.2500 వరకు వాహన ఖరీదు, తీసుకున్న రుణానికి అనుగుణంగా స్టాంపు డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. గ్రేటర్‌లోని 10 ఆర్టీఏ కార్యాలయాల్లో ప్రతి రోజూ 1000 నుంచి 1200 వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతాయి. మరో 500 వాహనాలు రుణ ప్రాతిపదికన చేతులు మారుతున్నాయి. అలాంటి వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ఫారమ్ 34 సమర్పించడానికి ముందు తప్పనిసరిగా వాహనయజమానికి, రుణదాతకు మధ్య కుదిరిన ఒప్పందంపై 0.5 శాతం స్టాంపు డ్యూటీ చెల్లించాలి. అవగాహన లేమితోనే అసలు సమస్య... వాహనాల హైపొతికేషన్, లీజ్ అగ్రిమెంట్, తదితర అంశాలపైన కుదుర్చుకొనే ఒప్పందాలపై స్టాంపు డ్యూటీ చెల్లించాలనే అంశం మోటారు వాహన చట్టాల్లోనే ఉంది. బ్యాంకులు, బడా ఫైనాన్స్ సంస్థలు ఈ మేరకు ముందస్తుగానే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ విభాగానికి కొంత మొత్తాన్ని చెల్లించి ఫ్రాంకిన్ మిషన్లను వినియోగిస్తున్నాయి. ప్రైవేట్ రంగంలోని చిన్న ఫైనాన్షియర్లు జరిపే క్రయవిక్రయాల్లో ఇది వసూలు కాకపోవడంతో ప్రభుత్వం తాజా జీవోను విడుదల చేసింది. అయితే స్టాంపు డ్యూటీని ఆర్టీఏలో తీసుకోవడం లేదు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగం ఖాతాలో జమ అయ్యేటట్లుగా ఆధారం ఉంటేనే వాహనం రిజిస్ట్రేషన్ చేస్తామని చెబుతున్నారు. ఈ చెల్లింపులకు సంబంధించి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ విభాగం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. ఆర్టీఏ కేంద్రా ల్లో ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు, లేదా ఈ సేవా కేంద్రాల నుంచి స్వీకరించడం వంటి ప్రత్యామ్నాయాలు లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు ఫైనాన్షియర్లు ఫ్రాంకిన్ మిషన్లు వినియోగిస్తున్నప్పటికీ అవి ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముద్రతో ఉండడం వల్ల ఆర్టీఏ అధికారులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వాహనాల రిజిస్ట్రేషన్లపైన జాప్యం నెలకొంటోంది. రవాణా అధికారులు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల విభాగం అధికారులు కలిసి సమావేశమై ఒక అంగీకారానికి వస్తే తప్ప ఈ సమస్య పరిష్కారమయ్యే సూచనలు కనిపించడం లేదు. -
భాగ్యనగరంలో భూమి బంగారమే!
ఆగస్టు 1 నుంచి నగరంలో పెరగనున్న భూముల ధరలు స్టాంపు డ్యూటీ తగ్గిస్తే మరింత లాభమంటున్న నిపుణులు ప్రస్తుతం హైదరాబాద్‌లో సెంటు జాగా కొనాలంటేనే లక్షలు కావాలి. అలాంటిది మరో రెండు వారాల్లో అయితే కోట్లు వెచ్చించాల్సిందే. ఎందుకంటే ఆగస్టు 1 నుంచి ఆయా ప్రాంతాలను బట్టి ఇప్పుడున్న ధరల కంటే 10-30 శాతం మేర భూముల ధరలను ప్రభుత్వం పెంచనుంది. అయితే స్టాంపు డ్యూటీని తగ్గించకుండా భూముల ధరలను పెంచితే రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం అంతగా పెరగదనేది స్థిరాస్తి నిపుణుల అభిప్రాయం. సాక్షి, హైదరాబాద్ : మాంద్యం, స్థానిక రాజకీయాంశాలతో కొన్నేళ్లుగా కుదేలైన భాగ్యనగర స్థిరాస్తి అభివృద్ధి తిరిగి పుంజుకోనుంది. మెట్రో రైల్, ఔటర్ రింగ్ రోడ్డు, ఐటీఐఆర్ ప్రాజెక్ట్, ఫార్మా, హెల్త్, ఫిల్మ్ సిటీలు, సత్వర అనుమతుల కోసం పారిశ్రామిక విధానం.. వంటి వాటితో నగరంలో భూములకు తిరిగి రెక్కలురానున్నాయి. అపార్ట్మెంట్ల అమ్మకాలు పెరిగి, విల్లాల జోరు అధికమై, వాణిజ్య సముదాయాలకు గిరాకీ రెట్టింపై దేశ, విదేశీ పెట్టుబడుదారులను హైదరాబాద్ వైపు దృష్టి సారించేలా చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే పలు ఐటీ, ఈ-కామర్స్ కంపెనీలు నగరంలో తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. మరికొన్ని విస్తరణ యోచనలో ఉన్నాయి. దీంతో ఉత్పత్తి, సేవా, ఆతిథ్యం, షాపింగ్ మాళ్లకు ఆదరణ పెరగనుంది. భారీగా పెరగనున్న ఉద్యోగులు, వేతనాలు.. వంటి కారణాల వల్ల స్థిరాస్తి రంగానికి ఢోకాలేదని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్ కూడా సానుకూలంగా ఉండటం వల్ల వివిధ నిర్మాణాల్లో అమ్మకాలు మెరుగ్గా సాగుతున్నాయంటున్నారు. గచ్చిబౌలి-పెద్ద అంబర్పేట్.. గతంలో స్థిరాస్తి వ్యాపారమంటే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హిమాయత్‌నగర్ వంటి ప్రాంతాల మీదే ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. మెట్రో రైలు, ఔటర్ రింగ్ రోడ్డులతో నగరం చుట్టూ అభివృద్ధికి బాటలు పరచుకుంది. మియాపూర్, గచ్చిబౌలి, నార్సింగి, అప్పా జంక్షన్, మణికొండ, ఉప్పల్ వంటి ప్రాంతాల్లోనే అభివృద్ధి జరుగుతుంది. 50 శాతం అభివృద్ధి తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్యే ఉందని పలువురు వ్యాపారులు చెబుతున్నారు. ప్రత్యేకించి గచ్చిబౌలి నుంచి పెద్ద అంబర్‌పేట వరకు హాట్‌స్పాట్. ఎందుకంటే ఇక్కడ భూమి ఉంది. ధరలూ అందుబాటులోనే ఉన్నాయి. విద్యుత్, నీరు వంటి మౌలిక వసతులు మెరుగ్గా ఉన్నాయి. పెపైచ్చు అంతర్జాతీయ విమానాశ్రయం. ఆ తర్వాత అభివృద్ధి విజయవాడ హైవే మీదు గా వరంగల్ హైవేకు మళ్లే అవకాశాలున్నాయి. మరో 8 నెలల్లో 40-50 శాతం మేర ధరలు పెరిగే అవకాశాలూ లేకపోలేదు. త్వరలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్న ఔటర్ రింగురోడ్డు, మెట్రో రైల్ కారణంగా భవిష్యత్తులో నగరమంతా అభివృద్ధి జరుగుతుందని స్థిరాస్తి వ్యాపారులు చెబుతున్నారు. ఫ్లాట్లకు గిరాకీ.. గతంలో సొంతూర్లలో స్థలాలు, ఇళ్లను కొనడం మీద దృష్టిసారించిన వారు సైతం నగరానికి ఉన్న ప్రత్యేకతను గుర్తించి భవిష్యత్తు అభివృద్ధిని అంచనా వేసుకొని ఇక్కడ ఫ్లాట్లను కొనడంపై మక్కువ చూపుతున్నారు. దీంతో ఒకప్పుడు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లలో మాత్రమే కన్పించే అపార్ట్మెంట్ సంస్కృతి ఇప్పుడు శివారు ప్రాంతాలైన నార్సింగి, అప్పా జంక్షన్ , మణికొండ వంటి ప్రాంతాలకు కూడా విస్తరించింది. ప్రసు ్తతం నిర్మిస్తున్న అపార్ట్మెంట్లలో చాలా వరకు మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో పెట్టుకునే రియల్టర్లు నిర్మాణాలు చేపడుతున్నారంటే ఫ్లాట్లకు ఉన్న గిరాకీని అర ్థం చేసుకోవచ్చు. నాణ్యత, వసతుల కల్పనలో ఏమాత్రం తగ్గకుండా లగ్జరీ అపార్ట్మెంట్లను నిర్మిస్తున్నారు కూడా. వాణిజ్య స్థిరాస్తి జోష్.. నగరంలో ఏటా 50 లక్షల చ.అ. వాణిజ్య స్థలం అభివృద్ధి చెందుతుంది. 2015 నాటికల్లా ఆఫీసు సముదాయాల విస్తీర్ణం 50 కోట్ల చ.అ.లకు చేరుకుంటుందని స్థిరాస్తి నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ స్థాయిలో వృద్ధిని నమోదు చేయడం వల్లే ప్రపంచంలో హైదరాబాద్ రియల్ మార్కెట్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఐటీ, ఐటీఈఎస్ రంగాల్లో విస్తరణ కారణంగా నిర్మాణ సంస్థలు ఐటీ పార్కులు, షాపింగ్ మాళ్లను ఏర్పాటు చేస్తున్నాయి. రెండేళ్ల నుంచి ఖాళీగా ఉన్న వాణిజ్య ఆఫీసు సముదాయాల్లో స్థలాల్ని తీసుకునేవారు విపరీతంగా పెరుగుతున్నారు. స్టాంపు డ్యూటీని తగ్గించాల్సిందే.. సరిగ్గా రెండేళ్ల తర్వాత నగరంలో భూముల ధరలను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. బహిరంగ మార్కెట్ ధరలను ప్రామాణికంగా తీసుకొని ప్రభుత్వం భూముల ధరలను పెంచనుంది. అయితే ఈ నిర్ణయం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ఆదిభట్ల, మహేశ్వరం, ఘట్కేసర్, భువనగిరి, షామీర్పేట వంటి ప్రాంతాలకు బాగా కలిసొస్తుందని భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) హైదరాబాద్ అధ్యక్షుడు ఎస్ రాంరెడ్డి ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. అయితే స్టాంప్ డ్యూటీని తగ్గించకుండా భూముల విలువను పెంచితే సామాన్యుల రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు ముందుకురారని ఆయన పేర్కొన్నారు. అందుకే 6 శాతంగా ఉన్న స్టాంప్ డ్యూటీని 4 శాతానికి తగ్గించాలని ఆయన కోరారు. అప్పుడే రిజిస్ట్రేషన్లలో పారదర్శకత పెరుగుతుందని, ప్రభుత్వానికి ఆదాయమూ దండిగా వస్తుందన్నారు. ఇదిలా ఉంటే భూముల ధరలు తక్కువగా ఉన్నచోట ఎలాగైతే పెంచనుందో.. అలాగే ఎక్కువగా ఉన్న చోట ధరలను అదుపులో ఉంచడం కూడా అవసరమేననేది ఆయన అభిప్రాయం. -
విదేశీ పెట్టుబడులకే పెద్దపీట
2015-2020 పారిశ్రామిక విధానం ప్రకటించిన ప్రభుత్వం మౌలిక వసతుల కల్పన రంగం, అనుబంధ రంగాల అభివృద్ధే లక్ష్యం పరిశ్రమల కోసం 15 నుంచి 20 లక్షల ఎకరాల భూ సేకరణ పరిమితంగానే రాయితీలు విద్యుత్ చార్జీలు, స్టాంప్ డ్యూటీ మినహాయింపులతోనే సరి రాయితీలకు కాలపరిమితిపై పారిశ్రామిక వర్గాల్లో అసంతృప్తి సాక్షి, హైదరాబాద్: విదేశీ పెట్టుబడులకే అత్యధిక ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2015-2020 పారిశ్రామిక విధానాన్ని బుధవారం ప్రకటించింది. మౌలిక వసతుల కల్పన రంగం, అనుబంధ రంగాల అభివృద్ధినే లక్ష్యంగా పెట్టుకుంది. పరిశ్రమల ఏర్పాటుకు 15 నుంచి 20 లక్షల ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో స్థానిక వనరులను పరిగణనలోనికి తీసుకుని, పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యమిచ్చింది. కేంద్రం ప్రత్యేక హోదా కల్పిస్తుందని నిరీక్షించిన రాష్ట్రం, అది సాధ్యం కాకపోవడంతో పారిశ్రామిక రాయితీలను పరిమితం చేసింది. విద్యుత్ చార్జీలు, స్టాంపు డ్యూటీ, వ్యాట్ల నుంచి మినహాయింపులే ప్రత్యేకంగా పేర్కొనదగిన వరాలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిపినా.. పరిశ్రమల స్థాపనకు అవసరమయ్యే యంత్ర సామాగ్రిపై రాయితీలకు కొత్త విధానంలో చోటు కల్పించలేదు. తీర ప్రాంతాలను పరిశ్రమల స్థాపనకు అనువైనవిగా గుర్తించినా, అక్కడ మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా వాయు, జల, రోడ్డు మార్గాల ఏర్పాటునే తొలి ప్రాధాన్యంగా ఎంచుకుంది. పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధిని టార్గెట్‌గా పెట్టుకుంది. ఆయా ప్రాంతాల్లో ప్రతిపాదిత ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, ఫార్మా పరిశ్రమలకు స్వల్పంగానే రాయితీలను అందించాలని నిర్ణయించింది. రాయలసీమలో సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులకు ప్రోత్సాహం ప్రభుత్వ విధానమైనప్పటికీ, భూ లభ్యతకు ఉన్న సందేహాలకు, ఉత్పాదక విద్యుత్ సరఫరాపై స్పష్టత ఇవ్వలేదు. ప్రభుత్వం ఇచ్చే రాయితీలకు గరిష్టంగా పదేళ్ల కాలపరిమితిని నిర్ణయించింది. కొత్త రాష్ట్రం కావడం, మౌలిక సదుపాయాల కల్పనకు సుదీర్ఘకాలం పట్టే అవకాశం ఉండటంతో.. పరిశ్రమలు స్థాపించి, ఉత్పత్తి మొదలు పెట్టేసరికే రాయితీల కాలపరిమితి తీరిపోతుందని పారిశ్రామిక వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ముఖ్యాంశాలు.. 2029 నాటికి పారిశ్రామికంగా తూర్పు, దక్షిణ ఆసియా దేశాలతో పోటీ లక్ష్యం. ఇప్పుడున్న 15 శాతం తయారీ రంగ వృద్ధి రేటును 17 శాతానికి, పారిశ్రామిక వృద్ధి రేటును 20.7 నుంచి 25 శాతానికి పెంచాలి. ఆహారశుద్ధి, ఫార్మా, బయోటెక్, వైద్య, జౌళి, ఐటీ, ఏరోస్పేస్, డిఫెన్స్, ఆటోమొబైల్, పెట్రోలియం, రసాయనాలు, ఇంధనం, ఖనిజ ఆధారిత పరిశ్రమలు, తోళ్ల పరిశ్రమల్లో వృద్ధి సాధించాలి. ఇందుకోసం ప్రత్యేకంగా 15 నుంచి 20 లక్షల ఎకరాలతో లాండ్ బ్యాంక్ ఏర్పాటు. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చేవారికి అర్హత, సామర్థ్యాన్ని బట్టి 99 ఏళ్ల పాటు భూముల లీజు. పారిశ్రామిక టౌన్ షిప్పులు, మెగాపార్కులు, స్టార్టప్ విలేజీల ఏర్పాటు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులన్నీ 21 రోజుల్లోనే క్లియర్ చేసేలా సింగిల్ డెస్క్ ఏర్పాటు. కొన్ని రకాల పరిశ్రమలకు ఐదేళ్ల పాటు విద్యుత్ చార్జీల్లో యూనిట్‌కు రూ.1చొప్పున రీ యింబర్స్‌మెంట్ ఉంటుంది. పారిశ్రామిక అవసరాలకు కొనుగోలు చేసే భూమి లీజుకు, కుదవ పెట్టేందుకు స్టాంప్ డ్యూటీ నుంచి 100 శాతం మినహాయింపు. వ్యాట్, ఎస్జీఎస్టీ నుంచి.. సూక్ష్మ స్థాయి, చిన్నతరహా పరిశ్రమలకైతే ఐదేళ్ల పాటు 100 శాతం, మధ్యతరహా పరిశ్రమలకు 75 శాతం (7 ఏళ్లు) భారీ పరిశ్రమలకు 50 శాతం (7 ఏళ్లు) మినహాయింపు. ఎస్సీ, ఎస్టీ, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేకంగా రాయితీలు. స్టాంప్ డ్యూటీలో, భూ బదలాయింపు చార్జీల్లో రాయితీ. విద్యుత్ స్థిర చార్జీల రీయింబర్స్మెంట్. జౌళి, బయో టెక్నాలజీ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ రంగాలకు సంబంధించిన విధానాలను కూడా ప్రభుత్వం ప్రకటించింది. జౌళి విధానం కింద టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు చేస్తారు. జిన్నింగ్, ప్రాసెసింగ్, వీవింగ్, డైయింగ్, గార్మెంట్ తయారీ తదితరాలలో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. విశాఖ తీరంలో వెయ్యి ఎకరాలతో ఇంటిగ్రేటెడ్ అపేరల్ సిటీ ఏర్పాటు లక్ష్యం. విశాఖ- చెన్నై, చెన్నై- బెంగళూరు పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు కొత్త విధానంలో భాగం.ఇందులో 956 మిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాలని నిర్ణయం. బయోటెక్నాలజీ పాలసీ కింద 120 పాలిటెక్నిక్, 225 ఇంజనీరింగ్, 35 ఫార్మా ఇనిస్టిట్యూట్ల ద్వారా నిపుణులను తయారు చేసుకోవాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం 200 ఎకరాలతో విశాఖలో మెగా లైఫ్‌సైన్స్ పార్క్‌ను అభివృద్ధి చేస్తారు. ఈ రంగంలో 100 కోట్ల డాలర్ల పెట్టుబడిని ఆహ్వానిస్తారు. ఆటోమొబైల్ రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడం లక్ష్యం. 318 కోట్ల డాలర్ల పెట్టుబడులను ఆకర్షించి, 2 లక్షల మందికి ఉపాధి కల్పించాలని భావించారు.ఈ పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే వారికి ఆటో క్లస్టర్లలో 50 శాతం సబ్సిడీతో మౌలికవసతులు కల్పిస్తారు. 10 ఏళ్ల పాటు 100 శాతం సీఎస్టీ టాక్స్ మినహాయింపు ఇస్తారు. వ్యాట్ ను తిరిగి చెల్లిస్తారు. విశాఖపట్నంలో కొత్తగా ఎలక్ట్రానిక్ హబ్‌ను ఏర్పాటు చేస్తారు. కాకినాడలో హార్డ్‌వేర్ పార్క్‌తో పాటు రాష్ట్రంలో మరో 20 చోట్ల ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ క్లస్టర్లను ఏర్పాటు చేస్తారు.ఈ పరిశ్రమల ఏర్పాటుకు స్టాంపు డ్యూటీలో 100 శాతం, రిజిస్ట్రేషన్, సేల్స్ డీడ్లకు 50 శాతం సబ్సిడీ ఇస్తారు. -
చౌక గృహ రుణాలకు ఆర్బీఐ బూస్ట్
- 10 లక్షల వరకూ రుణాలపై ఆఫర్! - రుణ విలువ లెక్కింపులోనే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలు న్యూఢిల్లీ: చౌక గృహాల నిర్మాణాలకు మరింత ఊపునిచ్చే చర్యలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గురువారం ప్రకటించింది. రూ.10 లక్షల వరకూ గృహ రుణాలకు సంబంధించిన నిబంధనలను సడలించింది. గృహ విలువకు సంబంధించి వ్యయం, రుణ మంజూరీలో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలను కలపడానికి బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. మొత్తం గృహ నిర్మాణ వ్యయం విషయంలో ఈ చార్జీల వాటానే దాదాపు 15 శాతం వరకూ ఉంది. ఈ మొత్తం సైతం రుణగ్రహీతకు భారం అవుతున్న పరిస్థితుల్లో ఆర్బీఐ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. దీని ప్రకారం ఎల్టీవీ (లోన్ టు వ్యాల్యూ) నిష్పత్తి లెక్కింపు ప్రక్రియలో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్, ఇతర డాక్యుమెంటేషన్ చార్జీలను కూడా ఇకపై బ్యాంకులు కలుపుతాయి. హౌస్ ప్రాపర్టీ విలువలో ఇప్పటివరకూ బ్యాంకులు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్, ఇతర డాక్యుమెంటేషన్ చార్జీలను కలపడం లేదు. ఈ వ్యయాలు సైతం భారంగా మారుతున్నాయని, రుణ విలువ లెక్కింపు ప్రక్రియలో వీటిని కూడా జోడించాలని ఆర్థికంగా బలహీన వర్గాలు (ఈడబ్ల్యూఎస్), దిగువస్థాయి ఆదాయ వర్గాల (ఎల్ఐజీ) నుంచి పలు విజ్ఞప్తులు అందుతున్నట్లు ఆర్బీఐ విడుదల చేసిన ఒక నోటిఫికేషన్ తెలిపింది. తాజా నిర్ణయానికి ఆయా అంశాలే కారణమని సైతం వెల్లడించింది. ప్రభుత్వ సంస్థల ప్రాజెక్టుల విషయంలో... ఒకవేళ ప్రభుత్వం లేదా చట్టబద్ధ సంస్థలు చౌక గృహ నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టినట్లయితే, ఆయా అథారిటీలు నిర్దేశించిన అంచెల ప్రకారం బ్యాంకులు రుణ మంజూరీలు చేయవచ్చని కూడా ఆర్బీఐ ఆదేశించింది. ఆయా సందర్భాల్లో వినియోగదారు ‘నిర్మాణ దశలకు అనుగుణంగా రుణ మంజూరు’ అంశాలను బ్యాంకులు ఇక్కడ పరిగణనలోకి తీసుకోనక్కర్లేదని ఆర్బీఐ తన నోటిఫికేషన్లో వివరణ ఇచ్చింది. బ్యాంకుల నుంచి ఈ మేరకు వచ్చిన సందేహాల పరిష్కారంలో భాగంగా ఆర్బీఐ ఈ సూచనలను చేసింది. -
జిల్లాలో రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా వడ్డన
ఒంగోలు సబర్బన్: రాష్ట్ర ప్రభుత్వం చడీచప్పుడు లేకుండా జిల్లా ప్రజలపై అదనపు బాదుడికి సన్నద్ధమైంది. ముఖ్యమంత్రి జపాన్ పర్యటనకు వెళ్తూ అత్యంత రహస్యంగా రెండు జీవోలను రాష్ట్ర ప్రజలపై రుద్దారు. రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచేశారు. అది కూడా బుధవారం నుంచి అమలులోకి వస్తుందని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. జిల్లాలో రెండు జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయాలున్నాయి. ఒకటి ఒంగోలు జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం కాగా, రెండోది మార్కాపురం జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం. ఈ రెండింటి పరిధిలో తొమ్మిదేసి చొప్పున సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. మొత్తం 18 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల ద్వారా రిజిస్ట్రేషన్ల క్రయ, విక్రయాలు జరుగుతుంటాయి. భూములు, స్థలాలు నిర్ణయించిన మార్కెట్ విలువను బట్టీ స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులను నిర్ణయిస్తారు. గతంలో కంటే ప్రతి రిజిస్ట్రేషన్‌పై చార్జీల మోత మోగించిన ఘనత ఒక్క ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికే దక్కింది. ముందెన్నడూ ఈ విధంగా అన్ని రకాల సేవలపై చార్జీలు పెంచలేదు. 2014-15 ఆర్థిక సంవత్సరానికిగాను జిల్లా మొత్తం మీద 209 కోట్ల రిజిస్ట్రేషన్ ఆదాయలక్ష్యంగా విధించారు. అయితే ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు, రాష్ట్రం విడిపోయినప్పటికీ జిల్లాకు ప్రత్యేకంగా ఎలాంటి పారిశ్రామిక అభివృద్ధి జరగకపోవడంతో భూముల ధరలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంలా తయారైంది. రిజిస్ట్రేషన్ పరంగా జిల్లావ్యాప్తంగా స్టాంప్ డ్యూటీదే సింహభాగం. ఒంగోలు జిల్లా రిజిస్ట్రార్ పరిధిలో 2014-15 ఆర్థిక సంవత్సరానికి 125 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా నిర్ణయించారు. దీంతో పాటు ప్రభుత్వం పెంచిన రిజిస్ట్రేషన్ చార్జీల వలన అదనంగా 15 కోట్ల భారం జిల్లా ప్రజలపై పడనుంది. మార్కాపురం జిల్లా రిజిస్ట్రార్ పరిధిలో ఈ ఆర్థిక సంవత్సరానికి 84 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా నిర్ణయించారు. దీంతో పాటు పెంచిన రిజిస్ట్రేషన్ చార్జీల వల్ల అదనంగా మరో 10 కోట్ల భారం ప్రజలపై పడనుంది. స్టాంప్‌డ్యూటీ గతంలో 4 శాతం ఉంటే ప్రస్తుతం ఒక శాతం పెంచడంతో అది 5 శాతమైంది. అదే విధంగా రిజిస్ట్రేషన్ చార్జీల కింద గతంలో స్టాంప్ డ్యూటీ మీద 0.5 శాతం విధించేవారు దానిని ఇప్పుడు ఒక శాతానికి పెంచారు. సెటిల్మెంట్స్, గిఫ్ట్ డీడ్లపై మార్కెట్ విలువను బట్టీ ఒకశాతం స్టాంప్ డ్యూటీ విధించేవారు, దానిని ప్రస్తుతం 2 శాతంగా పెంచారు. దీంతో పాటు రక్త సంబంధీకులకు కానుకల రూపంలో ఇచ్చే రిజిస్ట్రేషన్లు, కుటుంబ సభ్యుల మధ్య జరిగే ఒప్పందానికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు, ఇతరుల మధ్య జరిగే భాగస్వామ్య ఒప్పందాల రిజిస్ట్రేషన్ల స్టాంప్ డ్యూటీని కూడా ఒకటి నుంచి 2 శాతానికి పెంచారు. ఇతరుల మధ్య జరిగే ఒప్పందాలు (అగ్రిమెంట్లు) రిజిస్ట్రేషన్లపై గతంలో 2 శాతం స్టాంప్‌డ్యూటీ ఉండేది. ప్రస్తుతం దానిని 3 శాతానికి పెంచారు. అదే విధంగా ఇతరుల మధ్య కానుకలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు జరిగితే గతంలో 4 శాతం డ్యూటీ విధించేవారు, దానిని ప్రస్తుతం 4 నుంచి 5 శాతానికి పెంచారు. కుటుంబ సభ్యుల మధ్య ఒప్పందాలు (అగ్రిమెంట్లు) రూపంలో రిజిస్ట్రేషన్లు చేసుకుంటే గతంలో 0.5 శాతంగా ఉండేది, దానిని ఒక శాతానికి పెంచారు. అన్ని రకాల ఒప్పందాలు, రిజిస్ట్రేషన్లపై పెంచి కూర్చోవడంతో ప్రజలు ఇక రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. -
స్టాంపుడ్యూటీ బకాయిలు రూ.3.20కోట్లు
మంచిర్యాల టౌన్ : మంచిర్యాల పురపాలక సంఘానికి రిజిస్ట్రేషన్ శాఖ నుంచి సుమారు రూ.3.20 కోట్లపైగా స్టాంపు డ్యూటీ రావాల్సి ఉంది. అధికారుల నిర్లక్ష్యంతో గత పది నెలలుగా బకాయిలు పెండింగ్ పడ్డాయి. ప్రతీ నెల మంచిర్యాల సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చే ఆదాయం మొత్తంపై 1.50 శాతం స్టాంపు డ్యూటీని మున్సిపల్‌శాఖకు చెల్లించాల్సి ఉంటుంది. 2014 జనవరి నుంచి మున్సిపాలిటీకి రావాల్సిన స్టాంపు డ్యూటీ మున్సిపల్ ఖాతాలో జమకావడం లేదు. అధికారుల నిర్లక్ష్యంతోపాటు సిబ్బంది కొరత వల్ల జమ నిలిచిపోయింది. సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరిగిన రిజిస్ట్రేషన్ డ్యాకుమెంట్లు, వాటిపై వచ్చిన ఆదాయం వివరాలు ఏ నెలకు ఆ నెలా జిల్లా రిజిస్ట్రార్‌కు పంపించాలి. ఆ వివరాల ప్రకారం 1.50 శాతం స్టాంపు డ్యూటీని మున్సిపల్ పద్దులో జమ చేస్తారు. ఈ మొత్తాన్ని మున్సిపాలిటీ వివిధ పనుల కోసం వినియోగిస్తుంది. జనవరి నుంచి అక్టోబర్ వరకు రావాల్సిన స్టాంప్ డ్యూటీ ఇంత వరకు రాలేదు. సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి నెలనెలా వివరాలు పంపించకపోవడంతోనే ఆలస్యం జరిగినట్లు తెలుస్తోంది. పన్నుల వసూలు సమయం కాకపోవడంతో ప్రస్తుతం మున్సిపాలిటీలో సాధారణ నిధులు (జనరల్ ఫండ్) తక్కువగా ఉన్నాయి. స్టాంప్‌డ్యూటీ రాకపోవడంతో ఇబ్బందులు తలెత్తడంతో మున్సిపల్ అధికారులు సబ్ రిజిస్ట్రార్ దృష్టికి తీసుకువెళ్లినా సమస్య పరిష్కారం కాలేదు. గత సబ్ రిజిస్ట్రార్ పలు ఆరోపణలతో సస్పెండ్ కాగా ప్రస్తుతం కొత్తగా వచ్చిన అధికారికి కూడా ఈ విషయాన్ని తెలియజేశారు. తాను ఇటీవలే బాధ్యతలు స్వీకరించానని, త్వరలోనే స్టాంపు డ్యూటీ చెల్లించేలా చర్యలు తీసుకుంటానని చెబుతున్నారు. స్టాంపు డ్యూటీ వస్తే పట్టణ అభివృద్ధి మరింత వేగవంతంగా జరుగుతుందని, ఈ మేరకు ఎప్పటికప్పుడు సబ్ రిజిస్ట్రేషన్ అధికారులను సంప్రదిస్తున్నామని కమిషనర్ వెంకన్న తెలిపారు. -
రోజుకు 6 వేల రిజిస్ట్రేషన్లు!
విజయవాడ: ఆగస్టు ఒకటో తేదీ నుంచి పొలాలు, స్థలాల విలువలు పెంచేందుకు ప్రభుత్వం సిద్దమైందని వార్తలు వచ్చిన నేపథ్యంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పోటెత్తాయి. స్టాంప్ డ్యూటీ శుక్రవారం నుంచి భారీగా పెరుగుతుందన్న ఆందోళనతో భూముల రిజిస్ట్రేషన్ కు ప్రజలు బారులు తీరారు. గత మూడు రోజుల్లో ఒక్కో జిల్లాలో 6 వేలకు పైగా రిజిస్టేషన్లు జరిగినట్టు తెలుస్తోంది. మామూలుగా గుంటూరు జిల్లాలో ప్రతిరోజు 700 రిజిస్ట్రేషన్లు నమోదవుతుంటాయి. సోమవారం 2200, బుధవారం 3 వేల రిజిస్ట్రేషన్లు జరిగాయి. కృష్ణా జిల్లాలోని చిన్నచిన్న గ్రామాల్లోనూ భూముల రిజిస్ట్రేషన్లు పెరగడం విశేషం. ప్రతిప్తాడు, పెదకాకాని, నల్లపాడు గ్రామాలతో పాటు నందిగామ, జగ్గంపేట, గన్నవరం, నూజివీడు ప్రాంతాల్లోనూ పరిస్థితి ఇదే విధంగా ఉంది. కాగా, భూముల, రిజిస్ట్రేషన్ల ధరల పెంపుపై రేపు కేబినెట్లో చర్చిస్తామని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి గురువారం హైదరాబాద్ లో చెప్పారు. కేబినెట్ చర్చ తర్వాత పెంపుపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. -
ఏపీలో రిజిస్ట్రేషన్ బాదుడు!
* స్టాంపు డ్యూటీ ద్వారా రూ.1,000 కోట్ల అదనపు ఆదాయంపై కన్ను సాక్షి, విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా భూముల విలువలు పెంచి తద్వారా రిజిస్ట్రేషన్ల ఆదాయాన్ని భారీగా పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. మార్కెట్ విలువలో సగానికి పైగానే ప్రభుత్వ విలువ ఉండేలా మార్పులు చేయాలని భావిస్తోంది. సుమారు వెయ్యి కోట్ల రూపాయల అదనపు ఆదాయం లక్ష్యంగా ఈ కసరత్తు సాగుతున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 13 జిల్లాలు, ఆయూ ప్రాంతాల్లోని భూములు, భవనాలు, స్థలాల మార్కెట్ విలువలకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు గత కొద్దిరోజులుగా సేకరిస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రలో భూములు, ప్లాట్ల అమ్మకాలు, కొనుగోళ్లు ఊపందుకున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత రెవెన్యూ లోటును ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ సర్కారు గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం తదితర నగరాలు, పట్టణాల పరిధిలో మార్కెట్ విలువలు అమాంతంగా పెరగడాన్ని గమనంలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంచడం ద్వారా స్టాంపు డ్యూటీతో లభించే ఆదాయాన్ని భారీగా పెంచుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇదే క్రమంలో రాష్ట్రంలోని 267 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారులు తమ పరిధిలోని ప్రైవేటు ఆస్తుల విలువలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. రాష్ర్టంలో 13 జిల్లాలకు గాను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు 15 రోజుల క్రితం రూ.4,085 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా నిర్ధారించారు. తాజాగా రూ.1000 కోట్ల అదనపు ఆదాయాన్ని లక్ష్యంగా నిర్ధారించే అవకాశం ఉందని సమాచారం. భూముల విలువ పెంపు అంశంపై సీఎం చంద్రబాబు ఒకటీరెండు రోజుల్లో రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులతో భేటీ కానున్నట్లు తెలిసింది. -
లీజు ఒప్పందాలపై స్టాంపు డ్యూటీ తగ్గింపు
సాక్షి, హైదరాబాద్: హేతుబద్ధీకరణలో భాగంగా పలు రకాల లీజు ఒప్పందాలపై స్టాంపు డ్యూటీని ప్రభుత్వం తగ్గించింది. ఇది గురువారం నుంచి అమల్లోకి రానుంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ముఖ్య కార్యదర్శి వీకే అగర్వాల్ బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలిలా ఉన్నాయి... ఏడాది లోపు గడువున్న లీజు ఒప్పందాల రిజిస్ట్రేషన్‌కు ప్రస్తుతమున్న 4% స్టాంపు డ్యూటీలో ఎలాంటి మార్పూ లేదు ఏడాది నుంచి 5 ఏళ్ల లోపు లీజు ఒప్పందాల రిజిస్ట్రేషన్‌కు నివాస భవనాలకైతే ప్రస్తుతం మొత్తం అద్దెలో 0.4 శాతం స్టాంపు డ్యూటీగా ఉంది. కానీ ఇకపై వార్షిక సగటు అద్దెలో 0.5 శాతం చెల్లిస్తే సరిపోతుంది. నివాసానికి కాకుండా ఇతర అవసరాలకు తీసుకున్న లీజు ఒప్పందాలకు సగటు వార్షిక అద్దెలో 1 శాతం స్టాంపు డ్యూటీ చెల్లించాలి. 5 నుంచి 10 ఏళ్ల గడువున్న లీజు ఒప్పందాల రిజిస్ట్రేషన్‌కు నివాస భవనాలకు ప్రస్తుతం మొత్తం అద్దెలో 0.4 శాతం స్టాంపు డ్యూటీ ఉంది. దాన్ని ఇకపై వార్షిక సగటు అద్దెలో 1 శాతం చెల్లించాలి. ఇతర అవసరాలకు చేసుకున్న లీజు ఒప్పందాల రిజిస్ట్రేషన్‌కు వార్షిక సగటు అద్దెలో 2 శాతం చెల్లించాలి. 10 నుంచి 20 ఏళ్ల గడువున్న లీజు ఒప్పందాల రిజిస్ట్రేషన్‌కు ప్రస్తుతం మొత్తం అద్దెలో 0.6 శాతం స్టాంపు డ్యూటీ ఉంది. ఇకపై వార్షిక సగటు అద్దెలో 6 శాతం చెల్లిస్తే సరిపోతుంది. 20 నుంచి 30 ఏళ్ల లీజు ఒప్పందాల రిజిస్ట్రేషన్‌కు ప్రస్తుతం మొత్తం అద్దెలో 0.8 శాతం స్టాంపు డ్యూటీ ఉంది. అదిప్పుడు వార్షిక సగటు అద్దెలో 15 శాతానికి పరిమితం కానుంది. 30 ఏళ్లకు మించిన లీజు ఒప్పందాల రిజిస్ట్రేషన్‌కు ఆస్తి తాలూకు మొత్తం మార్కెట్ విలువలో 5 శాతం లేదా సగటు వార్షిక అద్దెకు 10 రెట్లలో ఏది ఎక్కువైతే అది ప్రస్తుతం అమల్లో ఉంది. ఇకపై లీజు ఒప్పందం చేసుకునే ఆస్తి మార్కెట్ విలువలో 3 శాతం చెల్లించాలి. మరికొన్ని రకాల ఒప్పందాల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లకు కూడా స్టాంపు డ్యూటీ స్వల్పంగా తగ్గింది -
తగ్గిన స్టాంపు డ్యూటీ
సాక్షి, హైదరాబాద్: కొన్ని రకాల స్థిరాస్తి కొనుగోళ్ల రిజిస్ట్రేషన్లపై స్టాంపు డ్యూటీని తగ్గిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తగ్గింపు సోమవారంనుంచి అమల్లోకి రానుంది. ఇందుకు సంబంధించిన వివరాలు... - వారసత్వపు ఆస్తి హక్కు కలిగిన వ్యక్తి కుటుంబంలోని వ్యక్తి నుంచి స్థిరాస్తిని రిజిస్ట్రేషన్ చేయించుకుంటే (సెటిల్మెంటు)కు ప్రస్తుతం మార్కెట్ విలువలో 3 శాతంగా విధించే స్టాంపు డ్యూటీ ఒక శాతానికి తగ్గింది. - స్వార్జిత ఆస్తిని కుటుంబ సభ్యుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించే సెటిల్మెంట్కు మార్కెట్ విలువలో స్టాంపు డ్యూటీ 6 శాతం నుంచి రెండు శాతానికి తగ్గింది. - రక్త సంబంధీకులకు (కొడుకు, కూతురు తదితరులకు) బహుమతి కింద చేసే రిజిస్ట్రేషన్లకు స్టాంపు డ్యూటీ 5 శాతం నుంచి ఒక శాతానికి తగ్గింది. - రక్త సంబంధీకులు కాని ఇతర కుటుంబ సభ్యులకు (అల్లుడు, కోడలు తదితరులకు) బహుమతి కింద చేసే రిజిస్ట్రేషన్లకు స్టాంపు డ్యూటీ 5 శాతం నుంచి 4 శాతానికి తగ్గింది. - కుటుంబ సభ్యులకు సంబంధించి భాగ పరిష్కార ఒప్పందాల రిజిస్ట్రేషన్‌కు స్టాంపు డ్యూటీ ఒక శాతం నుంచి అర శాతానికి తగ్గింది. ఇలా చేసుకునే దస్తావేజులలో ఆస్తి విలువకు అరశాతం స్టాంపు డ్యూటీ ఎంత ఎక్కువైనా, గరిష్టంగా రూ. 20 వేలు చెల్లిస్తే సరిపోతుంది. - కుటుంబేతరుల భాగ పరిష్కార ఒప్పందాల రిజిస్ట్రేషన్లకు స్టాంపు డ్యూటీ 3 నుంచి ఒక శాతానికి తగ్గింది. - భాగస్వామ్య సంస్థ పునరుద్ధరణ దస్తావేజుల రిజిస్ట్రేషన్‌కు స్టాంపు డ్యూటీ 5 శాతం నుంచి 3 శాతానికి తగ్గింది. - భాగస్వామ్య సంస్థ రిజిస్ట్రేషన్ రద్దుకు స్టాంపు డ్యూటీ 5 శాతం నుంచి 3 శాతానికి తగ్గింది. - అధీనంలో ఉన్న ఆస్తికి తనఖా దస్తావేజు రిజిస్ట్రేషన్‌కు 5 శాతంగా ఉన్న స్టాంపు డ్యూటీ 2 శాతానికి తగ్గింది. - సర్టిఫికెట్ ఆఫ్ సేల్, ఆస్తి బదలాయింపు తదితరాలకు స్టాంపు డ్యూటీ 5 శాతం బదులు 4 శాతం అయింది.