గిఫ్ట్ డీడ్‌పై తగ్గిన స్టాంపు డ్యూటీ | Stamp duty rate reduced on gift deed of property | Sakshi
Sakshi News home page

గిఫ్ట్ డీడ్‌పై తగ్గిన స్టాంపు డ్యూటీ

Published Thu, Nov 28 2013 1:09 AM | Last Updated on Sat, Sep 2 2017 1:02 AM

Stamp duty rate reduced on gift deed of property

5 శాతం నుంచి 4 శాతానికి తగ్గింపు
 సాక్షి, హైదరాబాద్: రక్త సంబంధీకులు కాని వారి మధ్య జరిగే గిఫ్ట్ డీడ్ (దాన విక్రయం) లావాదేవీలపై వసూలు చేస్తున్న స్టాంపు డ్యూ టీని 5 శాతం నుంచి 4 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు సీఎం కిరణ్ బుధవారం ఆమోదం తెలిపారు. సాధారణ లావాదేవీలపై ప్రస్తుతం 4 శాతం స్టాంపు డ్యూటీ వసూలు చేస్తుండటం తెలిసిందే.
 
 గిఫ్ట్ డీడ్ లావాదేవీలపై 5 శాతం హేతుబద్ధం కాదంటూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ తగ్గింపు ప్రతిపాదన చేసింది. రక్త సంబంధీకుల మధ్య జరిగే గిఫ్ట్ డీడ్ లావాదేవీల మీద ప్రస్తుతం 3 శాతం స్టాంపు డ్యూటీ ఉన్న విషయం తెలిసిందే. మార్పిడి దస్తావేజులపై కూడా స్టాంపు డ్యూటీని 5 నుంచి 4 శాతానికి తగ్గించారు. సెటిల్‌మెంట్ డీడ్‌పై 6 శాతం నుంచి 4 శాతానికి తగ్గించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement