Registrations branch
-
నయీమ్ ముఠా.. 24 హత్యలు
-
నయీమ్ ముఠా.. 24 హత్యలు
- అందులో నాలుగు సహజ మరణాలట! - తప్పుడు పోస్ట్‌మార్టమ్ నివేదికలు ఇచ్చిన ప్రభుత్వ డాక్టర్లు - వైద్యులకు నోటీసులు జారీ చేసి విచారించనున్న సిట్ - రాజకీయ నేతలు, అధికారుల భూదందాపై కన్ను - వారి భూముల వివరాలివ్వాలంటూ రిజిస్ట్రేషన్ల శాఖ డీజీకి సిట్ చీఫ్ లేఖ - అసెంబ్లీ సమావేశాల్లోపే కేసును కొలిక్కి తెచ్చే యత్నం - పొలిటికల్ లింకులను ఛేదించేందుకు మరో రెండు బృందాలు సాక్షి, హైదరాబాద్: నరహంతక నయీమ్ ముఠా ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. 24 మందిని హతమార్చింది! ఇందులో కొన్ని హత్యలను పథకం ప్రకారం సహజ మరణాలుగా చిత్రీకరించారు. ప్రభుత్వ వైద్యులే ఇలా తప్పుడు రిపోర్టులు ఇచ్చినట్లు వెల్లడైంది. నయీమ్ కేసులపై సిట్ చేస్తున్న దర్యాప్తులో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఇప్పటివరకు పోలీస్, పొలిటికల్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, మీడియా విభాగాలతో నయీమ్‌కు సంబంధాలున్నట్టు తేలింది. తాజాగా ప్రభుత్వ వైద్యులు సైతం ఈ ముఠాకు సహకరించినట్టు ఆధారాలు లభ్యమవడంతో కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చినట్లయింది. నయీమ్ చేసిన దారుణ హత్యలను సహజ మరణాలుగా చూపించి ప్రభుత్వ డాక్టర్లు సైతం అందరి కళ్లు గప్పినట్టు సిట్ గుర్తించింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన వారు ఇచ్చిన సమాచారంతోపాటు ఇతర ఆధారాల ప్రకారం నయీమ్ ముఠా 24 మందిని హతమార్చినట్టు లెక్కతేలింది. వీటిలో నాలుగు హత్యలకు సంబంధించి డాక్టర్లు.. పోస్టుమార్టం రిపోర్టును తప్పుడుగా ఇచ్చినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ హత్యలను కూడా సహజ మరణాలంటూ నివేదిక ఇచ్చినట్లు విచారణలో వెల్లడైంది. దీంతో ఆ డాక్టర్లకు నోటీసులు ఇచ్చేందుకు సిట్ బృందం సన్నద్ధమైంది. తప్పుడు నివేదికలు ఇవ్వాల్సిన అవసరం ఎందుకొచ్చింది..? నయీమ్ ముఠా ఏమైనా బెదిరించిందా..? అన్న వివరాలు రాబట్టేందుకు డాక్టర్లను సైతం విచారించాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. వారి లావాదేవీల వివరాలివ్వండి.. నయీమ్ ముఠాను అడ్డుపెట్టుకొని భూ లావాదేవీలతోపాటు ఆస్తులు కూడబెట్టిన పోలీసు అధికారులు, రాజకీయ నేతలపై సిట్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. వారికి సంబంధించిన భూముల వివరాలు అందించాలంటూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ డీజీకి లేఖ రాసింది. నయీమ్‌తో సంబంధాలున్నట్లు తేలిన అధికారులు, నేతలకు సంబంధించిన భూముల వివరాలను అందించాలని ఈ లేఖలో పేర్కొన్నట్టు సమాచారం. నయీమ్ కనుసన్నల్లో 7 జిల్లాల్లో దౌర్జన్యంగా భూములు లాక్కోవడం, కబ్జాలు, బలవంతపు రిజిస్ట్రేషన్లు సాగినట్టు విచారణలో తేలింది. 200కి పైగా బాధితులు ఇప్పటికే నయీమ్‌పై ఫిర్యాదు చేశారు. వీటిలో ఎక్కువ భూ బాగోతాలే. వీటిని ఓ కొలిక్కి తీసుకొచ్చేందుకు సిట్.. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ సాయం కోరింది. ఈ మేరకు సిట్ చీఫ్ వై.నాగిరెడ్డి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన ్లశాఖ ఐజీకి లేఖ రాశారు. నయీమ్ సహకారంతో భూ కబ్జాలకు పాల్పడిన వారిపై సిట్ నిఘా పెట్టింది. కాగా, బాధితులు అందజేసిన ఆధారాలు, విచారణలో లభ్యమైన ఎలక్ట్రానిక్ వస్తువులను పరిశీలన కోసం ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్)కి పంపించారు. త్వరలో నేతల లింకుల వెల్లడి నయీమ్ కేసును సిట్ సీరియస్‌గా తీసుకుంది. అసెంబ్లీ సమావేశాలకు ముందే ఈ కేసు దర్యాప్తును కొలిక్కి తేవాలని యోచి స్తోంది. పొలిటికల్ లింకులను ఛేదించడం కోసం ప్రత్యేకంగా మరో 2 బృందాలను రంగంలోకి దించింది. నయీమ్‌ను అడ్డు పెట్టుకొని రాజకీయ నేతలు పెద్దఎత్తున లాభపడినట్లు విచారణలో వెలుగు చూసింది. నయీమ్ డైరీలో.. నాయకులకు చేసిన ‘ప్రత్యేక’ సహాయాలను పొందుపరిచినట్లు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా బాధితుల నుంచి వస్తున్న ఫిర్యాదుల్లోనూ పలువురు నేతల పేర్లు ప్రస్తావనకు వస్తున్నాయి. నల్లగొండ జిల్లాకు చెందిన బాధితుడి ఫిర్యాదులో ఓ ఎమ్మెల్సీ పేరు ఏకంగా ఎఫ్ఐఆర్లో ప్రస్తావించారు. దీంతో నాయకుల లింకులను సాధ్యమైనంత త్వరలో ఛేదించాలని నిర్ణయించారు. అందుకోసం బలమైన ఆధారాలను సేకరిస్తున్నారు. -
‘రిజిస్ట్రేషన్’కు కార్పొరేట్ కళ
వినియోగదారులకు మెరుగైన వసతుల కల్పనకు రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్, జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలన్నీ అతి త్వరలోనే కార్పొరేట్ కళను సంతరించుకోబోతున్నాయి. ఇప్పటివరకు అరకొర వసతులతో అధ్వాన స్థితిలో కనిపించే ఆయా కార్యాలయాల్లో.. ఇకపై వినియోగదారులకు మెరుగైన వసతులు కల్పించాలని రిజిష్ట్రేషన్ల శాఖ నిర్ణయించింది. ఏడాదికి సుమారు రూ.4 వేల కోట్ల ఆదాయాన్ని అందించే రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కార్పొరేట్ స్థాయి వసతుల కల్పనకు ఆ శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వివిధ రకాల రిజిస్ట్రేషన్ల నిమిత్తం వచ్చే వినియోగదారులకు పరిశుభ్రమైన మంచినీరు, మరుగుదొడ్ల సదుపాయం, కూర్చునేందుకు మంచి ఫర్నిచర్, డాక్యుమెంట్లను సిద్ధం చేసుకునేందుకు అవసరమైన స్టేపుల్స్, పిన్నులు, ఫొటోలను అతికించేందుకు గమ్ స్టిక్స్, కార్యాలయానికి సమర్పించాల్సిన జిరాక్స్ ప్రతులను తీసుకునేందుకు ఫొటోస్టాట్ మెషీన్.. తదితర వసతులను సమకూర్చాలని అధికారులు భావిస్తున్నారు. దీనికోసం అయ్యే ఖర్చును వినియోగదారులు చెల్లిస్తున్న యూజర్ చార్జీల నుంచే భరించాలని సర్కారుకు విన్నవించారు. రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంపు డ్యూటీలతో పాటు ప్రతియేటా యూజర్ చార్జీల కింద వినియోగదారులు రూ.18 కోట్లను చెల్లిస్తున్నారు. అయితే, ఆ సొమ్మంతా రిజిస్ట్రేషన్ల శాఖకు రాకుండా ట్రెజరీ ద్వారా ప్రభుత్వ ఖాతాకు జమవుతుండటంతో వసతుల కల్పనకు నిధుల కొరత ఏర్పడుతోంది. యూజర్ చార్జీలు వినియోగదారుల కోసమే ఖర్చు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సమర్పించిన ప్రతిపాదనల్లో రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు పేర్కొన్నారు. వేగవంతమైన నెట్వర్క్ ఏర్పాటు రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో జరుగుతోన్న జాప్యానికి చెక్ చెప్పేందుకు వేగవంతమైన నెట్వర్క్ సదుపాయాన్ని కల్పించాలని రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయించింది. ఇందుకోసం మల్టీ ప్రొటోకాల్ కేబుల్ స్విచ్ నెట్‌వర్క్‌కు మారాలని నిర్ణయించారు. కొత్త నెట్‌వర్క్‌ను తీసుకుంటే ఏడాదికి రూ. 1.20 కోట్ల వ్యయం కానుందని, ప్రభుత్వం నుంచి అనుమతి కోసం లేఖ రాసినట్లు రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. -
ఆగస్టు 1 నుంచి భూమ్!
- భూముల మార్కెట్ విలువల పెంపు కోసం రిజిస్ట్రేషన్ల శాఖ ప్రతిపాదనలు - మూడేళ్లుగా పెంపు ప్రతిపాదనలకు సర్కారు నో సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ భూముల మార్కెట్ విలువలను పెంచాలని రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయించింది. ఈ మేరకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదనలను పంపింది. రిజిస్ట్రేషన్ల శాఖ ప్రతిపాదనలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన పక్షంలో పెరిగిన మార్కెట్ విలువలు వచ్చే ఆగస్టు ఒకటి నుంచి అమల్లోకి వస్తాయి. వాస్తవానికి భూముల మార్కెట్ వాల్యూను గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి రెండేళ్లకు, పట్టణ ప్రాంతాల్లో ప్రతియేటా రిజిస్ట్రేషన్ల శాఖ సమీక్షించడం ఎప్పట్నుంచో ఆనవాయితీగా వస్తోంది. బహిరంగ మార్కెట్లో పెరిగిన ధరలను బట్టి రిజిస్ట్రేషన్ విలువను లెక్కిస్తారు. ఆయా ప్రాంతాల్లో అత్యధికంగా, అత్యల్పంగా ఉన్న భూముల సగటు ధరను తీసుకొని, అందులో 65 శాతాన్ని మార్కెట్ వాల్యూగా నిర్ణయిస్తారు. గత మూడేళ్లుగా భూముల మార్కెట్ వాల్యూ పెంచాలని రిజిస్ట్రేషన్ల శాఖ ప్రతియేటా ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపుతున్నా సర్కారు అందుకు సమ్మతించ లేదు. దీంతో విభజనకు (2013) ముందు ధరలే ఇప్పటికీ అమల్లో ఉన్నాయి. మార్కెట్ ధరలను పున ః సమీక్షించని కారణంగా అంతగా భూమ్ లేని ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్ కంటే రిజిస్ట్రేషన్ విలువలే అధికంగా ఉండటంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే, మరికొన్ని ప్రాంతాల్లో భూముల ధరలు బహిరంగ మార్కెట్లో పెరిగినప్పటికీ పాత మార్కెట్ విలువలే అమల్లో ఉండటం వలన సర్కారు ఖజానాకు నష్టం వాటిల్లుతోందని రిజిస్ట్రేషన్ వర్గాలంటున్నాయి. మార్కెట్ విలువను బట్టే పెంపు ప్రతిపాదనలు వివిధ ప్రాంతాల్లో ప్రస్తుత మార్కెట్ ధరలను బట్టి భూముల మార్కెట్ విలువలను పెంచే నిమిత్తం ఏప్రిల్ 1 నుంచే రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు ప్రారంభించింది. గ్రామీణ , పట్టణ ప్రాంతాల్లో భూమి విలువను (10 నుంచి 70 శాతం వరకు) ఎంత శాతం పెంచవచ్చో ప్రత్యేక ఫార్మాట్ ద్వారా వివరంగా తెలపాలని సబ్ రిజిష్ట్రార్లకు, జిల్లా రిజిష్ట్రార్లకు సూచించింది. అలాగే.. ధరలు పెరగకుండా తటస్థంగా ఉన్న ప్రాంతాలు, ధరలు బాగా తగ్గిన ప్రాంతాలను కూడా ఫార్మేట్లో పేర్కొనాలని రిజిస్ట్రేషన్ల శాఖ ఆదేశించింది. కేవలం మార్కెట్ విలువల పెంపునకే పరిమితం కాకుండా, ధరలను తగ్గించాల్సి వస్తే, ఏ మేరకు తగ్గించాలో కూడా తెలపాలని ఉన్నతాధికారులు సూచించారు. 2003లో ఎకరం రేటు రూ. 10 వేలు ఉండే రాజధాని శివారు ప్రాంతాల్లోని భూముల ధరలను 2013కల్లా రూ. 40 లక్షల నుంచి 70 లక్షలకు అప్పటి ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రస్తుతం హైదరాబాద్ శివారులోని కొన్ని మండలాల్లో భూముల మార్కెట్ విలువ గణనీయంగా పడిపోయినందున ఆయా ప్రాంతాల్లో భూముల మార్కెట్ ధరలను తగ్గించాలని, విలువ పెరిగిన ప్రాంతాల్లో ఆ మేరకు మార్కెట్ వాల్యూను కూడా పెంచాలని రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయించింది. వివిధ వర్గాల నుంచి వ్యక్తమవుతున్న అభిప్రాయాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది భూముల రిజిస్ట్రేషన్ల ధరల పెంపు 10 నుంచి 15శాతం వరకు ఉండవచ్చని ఆ శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. -
రిజిస్ట్రేషన్ల శాఖలో ఈ-చలాన్లు
- ఎస్‌బీహెచ్‌తో ఎంవోయూకు ఏర్పాట్లు - ఆన్లైన్/ఆఫ్‌లైన్‌లో స్టాంప్ డ్యూటీ చెల్లించే సదుపాయం - మార్చి 1 నుంచి అమల్లోకి తెచ్చేందుకు అధికారుల సన్నాహాలు సాక్షి, హైదరాబాద్: రిజిస్ట్రేషన్ల శాఖలో మరో వినూత్న ప్రక్రియను ఆవిష్కరించేందుకు రంగం సిద్ధమైంది. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీల చెల్లింపునకు దశాబ్దాలుగా కొనసాగుతున్న పాత చలానా పద్ధతికి స్వస్తి పలికి, దాని స్థానంలో ఈ-చలాన్ల ప్రక్రియను ప్రవేశపెట్టాలని రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయించింది. వివిధ డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ నిమిత్తం సొమ్ము చెల్లింపులో వినియోగదారులకు మరింత వెసులుబాటు కల్పించడంతో పాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవకతవకలను నివారించే దిశగా అధికారులు ఈ-చలానా ప్రక్రియను రూపొందిస్తున్నారు. పూర్తిగా ఆన్లైన్ ప్రక్రియ కావడంతో వినియోగదారులతో పాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది ఇకపై బ్యాంకులు, ట్రెజరీల చుట్టూ తిరిగే పని ఉండదని ఉన్నతాధికారులు అంటున్నారు. ఈ ప్రక్రియ అమలు కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్)తో రిజిస్ట్రేషన్ల శాఖ త్వరలోనే అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకునేందుకు సన్నద్ధమవుతోంది. ఆన్లైన్ పేమెంట్స్ కోసం ఎస్ఎస్ఎల్ బ్యాంకుల తో ఆన్లైన్ లావాదేవీలను నిర్వహించేందుకు అవసరమైన సెక్యూరిటీ సాకెట్ లేయర్ (ఎస్ఎస్ఎల్) సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ శాఖకు లభించింది. దీంతో ఎస్బీహెచ్ ఇంట ర్నెట్ బ్యాంకింగ్ సదుపాయం ద్వారా సొమ్ము చెల్లింపు, స్వీకరణ సేవలను వినియోగించుకునేందుకు రిజిస్ట్రేషన్ల శాఖ మార్గం సుగమమైంది. గతంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో ఉన్న బ్యాంకు శాఖలో మాత్రమే వినియోగదారులు చలాన్లు చెల్లించవలసి వచ్చే ది. ఈ-చలాన్ల ప్రక్రియ అందుబాట్లోకి వస్తే బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేకుండానే ఆన్లైన్ లేదా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 950 ఎస్బీహెచ్ శాఖల్లో ఎక్కడైనా ఆఫ్లైన్లోనూ స్టాంప్ డ్యూటీ చెల్లించవచ్చు. సబ్ రిజిస్ట్రార్ ల ఖాతాలను రద్దు పరిచి కమిషనర్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ పేరిట ఒకే ఖాతా నెంబరుకు సొమ్ము జమ చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. దొంగ చలాన్లకు చెక్... ఏదైనా బ్యాంకులో లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా స్టాంప్ డ్యూటీ చెల్లించిన వినియోగదారులకు రశీదుతో పాటు 12 అంకెలు కలిగిన కోడ్ నెంబరును బ్యాంకు అందిస్తుంది. వినియోగదారులు తమవద్ద ఉన్న ర శీదు, బ్యాంక్ ఇచ్చిన కోడ్ నెంబరును సబ్ రిజిస్ట్రార్‌కు అందజేస్తే సరిపోతుంది. స్టాంప్ డ్యూటీ చెల్లింపు వివరాలను కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్న డాక్యుమెంట్‌పై ముద్రించేలా అధికారులు చర ్యలు చేపట్టారు. దీంతో దొంగ చలాన్లను అరికట్టడంతో పాటు తాము చెల్లించిన మొత్తానికి వినియోగదారులకు భరోసా కల్పించినట్లవుతుందని శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఎస్‌బీహెచ్‌తో ఎంవోయూకు అంతా సిద్ధంగా ఉందని, ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తే మార్చి 1 నుంచి ఈ-చలాన్ల ప్రక్రియను అమల్లోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
రిజిస్ట్రేషన్ల శాఖలో బదిలీలు
ఐదుగురు రిజిస్ట్రార్లకు స్థానచలనం ముగ్గురికి ఇన్చార్జి బాధ్యతలు సాక్షి, హైదరాబాద్: స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో జిల్లా రిజిస్ట్రార్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఎంతో కాలంగా ఖాళీగా ఉన్న వివిధ జిల్లా రిజిస్ట్రార్ పోస్టులను భర్తీ చేయడంతో పాటు సుదీర్ఘకాలంగా ఒకేచోట పనిచేస్తున్న వారికి స్థాన చలనం కల్పించారు. ఐదుగురు రెగ్యులర్ జిల్లా రిజిస్ట్రార్లకు సర్కారు స్థానచలనం కల్పించగా, ముగ్గురు గ్రేడ్-1 సబ్ రిజిస్ట్రార్లకు ఇన్చార్జి జిల్లా రిజిస్ట్రార్లుగా పోస్టింగులు లభించాయి. వరంగల్ జిల్లా రిజిస్ట్రార్ సుభాషిణికి మాత్రం ఇంకా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. తాజా ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని రిజిస్ట్రేషన్ల శాఖ ముఖ్య కార్యదర్శి వీకే అగర్వాల్ పేర్కొన్నారు. తాజా బదిలీలు, పోస్టింగ్‌ల వివరాలిలా ఉన్నాయి.. జిల్లా రిజిస్ట్రార్ పేరు ప్రస్తుతం బదిలీ స్థానం రెగ్యులర్ జిల్లా రిజిస్ట్రార్లు ఎన్.సైదిరెడ్డి రంగారెడ్డి(ఆడిట్) రంగారెడ్డి ఈస్ట్ ఎస్.డి.ట్వింకిల్ మహబూబ్‌నగర్ హైదరాబాద్ సౌత్ డి.వి.వి.రాజు హైదరాబాద్ రంగారెడ్డి(ఆడిట్) కె.మోహన్ నిజామాబాద్ ఆదిలాబాద్ కె.రఘుబాబు మెదక్ వరంగల్ ఎం.సుభాషిణి వరంగల్ పోస్టింగ్ ఇవ్వలేదు ఇన్చార్జి(ఎఫ్ఏసీ) జిల్లా రిజిస్ట్రార్లు వీరే... ఎస్.దినేశ్దత్తార్ హైదరాబాద్ కరీంనగర్ కె.జయకర్ నిజామాబాద్ ఖమ్మం కె.వి.రమేశ్‌రెడ్డి గోల్కొండ(చిట్స్) నిజామాబాద్ -
గిఫ్ట్ డీడ్‌పై తగ్గిన స్టాంపు డ్యూటీ
5 శాతం నుంచి 4 శాతానికి తగ్గింపు సాక్షి, హైదరాబాద్: రక్త సంబంధీకులు కాని వారి మధ్య జరిగే గిఫ్ట్ డీడ్ (దాన విక్రయం) లావాదేవీలపై వసూలు చేస్తున్న స్టాంపు డ్యూ టీని 5 శాతం నుంచి 4 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు సీఎం కిరణ్ బుధవారం ఆమోదం తెలిపారు. సాధారణ లావాదేవీలపై ప్రస్తుతం 4 శాతం స్టాంపు డ్యూటీ వసూలు చేస్తుండటం తెలిసిందే. గిఫ్ట్ డీడ్ లావాదేవీలపై 5 శాతం హేతుబద్ధం కాదంటూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ తగ్గింపు ప్రతిపాదన చేసింది. రక్త సంబంధీకుల మధ్య జరిగే గిఫ్ట్ డీడ్ లావాదేవీల మీద ప్రస్తుతం 3 శాతం స్టాంపు డ్యూటీ ఉన్న విషయం తెలిసిందే. మార్పిడి దస్తావేజులపై కూడా స్టాంపు డ్యూటీని 5 నుంచి 4 శాతానికి తగ్గించారు. సెటిల్మెంట్ డీడ్‌పై 6 శాతం నుంచి 4 శాతానికి తగ్గించారు.