- ఐదుగురు రిజిస్ట్రార్లకు స్థానచలనం ముగ్గురికి ఇన్‌చార్జి బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్: స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో జిల్లా రిజిస్ట్రార్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఎంతో కాలంగా ఖాళీగా ఉన్న వివిధ జిల్లా రిజిస్ట్రార్ పోస్టులను భర్తీ చేయడంతో పాటు సుదీర్ఘకాలంగా ఒకేచోట పనిచేస్తున్న వారికి స్థాన చలనం కల్పించారు. ఐదుగురు రెగ్యులర్ జిల్లా రిజిస్ట్రార్లకు సర్కారు స్థానచలనం కల్పించగా, ముగ్గురు గ్రేడ్-1 సబ్ రిజిస్ట్రార్లకు ఇన్‌చార్జి జిల్లా రిజిస్ట్రార్లుగా పోస్టింగులు లభించాయి. వరంగల్ జిల్లా రిజిస్ట్రార్ సుభాషిణికి మాత్రం ఇంకా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. తాజా ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని రిజిస్ట్రేషన్ల శాఖ ముఖ్య కార్యదర్శి వీకే అగర్వాల్ పేర్కొన్నారు.
తాజా బదిలీలు, పోస్టింగ్‌ల వివరాలిలా ఉన్నాయి..
జిల్లా రిజిస్ట్రార్ పేరు ప్రస్తుతం బదిలీ స్థానం
రెగ్యులర్ జిల్లా రిజిస్ట్రార్లు
ఎన్.సైదిరెడ్డి రంగారెడ్డి(ఆడిట్) రంగారెడ్డి ఈస్ట్
ఎస్.డి.ట్వింకిల్ మహబూబ్‌నగర్ హైదరాబాద్ సౌత్
డి.వి.వి.రాజు హైదరాబాద్ రంగారెడ్డి(ఆడిట్)
కె.మోహన్ నిజామాబాద్ ఆదిలాబాద్
కె.రఘుబాబు మెదక్ వరంగల్
ఎం.సుభాషిణి వరంగల్ పోస్టింగ్ ఇవ్వలేదు
ఇన్‌చార్జి(ఎఫ్‌ఏసీ) జిల్లా రిజిస్ట్రార్లు వీరే...
ఎస్.దినేశ్‌దత్తార్ హైదరాబాద్ కరీంనగర్
కె.జయకర్ నిజామాబాద్ ఖమ్మం
కె.వి.రమేశ్‌రెడ్డి గోల్కొండ(చిట్స్) నిజామాబాద్