భాగ్యనగరంలో భూమి బంగారమే! | Bhagyanagaram gold in the land! | Sakshi
Sakshi News home page

భాగ్యనగరంలో భూమి బంగారమే!

Published Sat, Jul 18 2015 2:24 AM | Last Updated on Sun, Sep 3 2017 5:41 AM

భాగ్యనగరంలో భూమి బంగారమే!

భాగ్యనగరంలో భూమి బంగారమే!

ఆగస్టు 1 నుంచి నగరంలో పెరగనున్న భూముల ధరలు
స్టాంపు డ్యూటీ తగ్గిస్తే మరింత లాభమంటున్న నిపుణులు

 
 ప్రస్తుతం హైదరాబాద్‌లో సెంటు జాగా కొనాలంటేనే లక్షలు కావాలి. అలాంటిది మరో రెండు వారాల్లో అయితే కోట్లు వెచ్చించాల్సిందే. ఎందుకంటే ఆగస్టు 1 నుంచి ఆయా ప్రాంతాలను బట్టి ఇప్పుడున్న ధరల కంటే 10-30 శాతం మేర భూముల ధరలను ప్రభుత్వం పెంచనుంది. అయితే స్టాంపు డ్యూటీని తగ్గించకుండా భూముల ధరలను పెంచితే రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం అంతగా పెరగదనేది స్థిరాస్తి నిపుణుల అభిప్రాయం.
 
 సాక్షి, హైదరాబాద్ : మాంద్యం, స్థానిక రాజకీయాంశాలతో కొన్నేళ్లుగా కుదేలైన భాగ్యనగర స్థిరాస్తి అభివృద్ధి తిరిగి పుంజుకోనుంది. మెట్రో రైల్, ఔటర్ రింగ్ రోడ్డు, ఐటీఐఆర్ ప్రాజెక్ట్, ఫార్మా, హెల్త్, ఫిల్మ్ సిటీలు, సత్వర అనుమతుల కోసం పారిశ్రామిక విధానం.. వంటి వాటితో నగరంలో భూములకు తిరిగి రెక్కలురానున్నాయి. అపార్ట్‌మెంట్ల అమ్మకాలు పెరిగి, విల్లాల జోరు అధికమై, వాణిజ్య సముదాయాలకు గిరాకీ రెట్టింపై దేశ, విదేశీ పెట్టుబడుదారులను హైదరాబాద్ వైపు దృష్టి సారించేలా చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే పలు ఐటీ, ఈ-కామర్స్ కంపెనీలు నగరంలో తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.

మరికొన్ని విస్తరణ యోచనలో ఉన్నాయి. దీంతో ఉత్పత్తి, సేవా, ఆతిథ్యం, షాపింగ్ మాళ్లకు ఆదరణ పెరగనుంది. భారీగా పెరగనున్న ఉద్యోగులు,  వేతనాలు.. వంటి కారణాల వల్ల స్థిరాస్తి రంగానికి ఢోకాలేదని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్ కూడా సానుకూలంగా ఉండటం వల్ల వివిధ నిర్మాణాల్లో అమ్మకాలు మెరుగ్గా సాగుతున్నాయంటున్నారు.

 గచ్చిబౌలి-పెద్ద అంబర్‌పేట్..
 గతంలో స్థిరాస్తి వ్యాపారమంటే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హిమాయత్‌నగర్ వంటి ప్రాంతాల మీదే ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. మెట్రో రైలు, ఔటర్ రింగ్ రోడ్డులతో నగరం చుట్టూ అభివృద్ధికి బాటలు పరచుకుంది. మియాపూర్, గచ్చిబౌలి, నార్సింగి, అప్పా జంక్షన్, మణికొండ, ఉప్పల్ వంటి ప్రాంతాల్లోనే అభివృద్ధి జరుగుతుంది. 50 శాతం అభివృద్ధి తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్యే ఉందని పలువురు వ్యాపారులు చెబుతున్నారు. ప్రత్యేకించి గచ్చిబౌలి నుంచి పెద్ద అంబర్‌పేట వరకు హాట్‌స్పాట్. ఎందుకంటే ఇక్కడ భూమి ఉంది. ధరలూ అందుబాటులోనే ఉన్నాయి.

విద్యుత్, నీరు వంటి మౌలిక వసతులు మెరుగ్గా ఉన్నాయి. పెపైచ్చు అంతర్జాతీయ విమానాశ్రయం. ఆ తర్వాత అభివృద్ధి విజయవాడ హైవే మీదు గా వరంగల్ హైవేకు మళ్లే అవకాశాలున్నాయి. మరో 8 నెలల్లో 40-50 శాతం మేర ధరలు పెరిగే అవకాశాలూ లేకపోలేదు. త్వరలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్న ఔటర్ రింగురోడ్డు, మెట్రో రైల్ కారణంగా భవిష్యత్తులో నగరమంతా అభివృద్ధి జరుగుతుందని స్థిరాస్తి వ్యాపారులు చెబుతున్నారు.

 ఫ్లాట్లకు గిరాకీ..
 గతంలో సొంతూర్లలో స్థలాలు, ఇళ్లను కొనడం మీద దృష్టిసారించిన వారు సైతం నగరానికి ఉన్న ప్రత్యేకతను గుర్తించి భవిష్యత్తు అభివృద్ధిని అంచనా వేసుకొని ఇక్కడ ఫ్లాట్లను కొనడంపై మక్కువ చూపుతున్నారు. దీంతో ఒకప్పుడు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లలో మాత్రమే కన్పించే అపార్ట్‌మెంట్ సంస్కృతి ఇప్పుడు శివారు ప్రాంతాలైన నార్సింగి, అప్పా జంక్షన్ , మణికొండ వంటి ప్రాంతాలకు కూడా విస్తరించింది. ప్రసు ్తతం నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్లలో చాలా వరకు మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో పెట్టుకునే రియల్టర్లు నిర్మాణాలు చేపడుతున్నారంటే ఫ్లాట్లకు ఉన్న గిరాకీని అర ్థం చేసుకోవచ్చు. నాణ్యత, వసతుల కల్పనలో ఏమాత్రం తగ్గకుండా లగ్జరీ అపార్ట్‌మెంట్లను నిర్మిస్తున్నారు కూడా.

 వాణిజ్య స్థిరాస్తి జోష్..
 నగరంలో ఏటా 50 లక్షల చ.అ. వాణిజ్య స్థలం అభివృద్ధి చెందుతుంది. 2015 నాటికల్లా ఆఫీసు సముదాయాల విస్తీర్ణం 50 కోట్ల చ.అ.లకు చేరుకుంటుందని స్థిరాస్తి నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ స్థాయిలో వృద్ధిని నమోదు చేయడం వల్లే ప్రపంచంలో హైదరాబాద్ రియల్ మార్కెట్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఐటీ, ఐటీఈఎస్ రంగాల్లో విస్తరణ కారణంగా నిర్మాణ సంస్థలు ఐటీ పార్కులు, షాపింగ్ మాళ్లను ఏర్పాటు చేస్తున్నాయి. రెండేళ్ల నుంచి ఖాళీగా ఉన్న వాణిజ్య ఆఫీసు సముదాయాల్లో స్థలాల్ని తీసుకునేవారు విపరీతంగా పెరుగుతున్నారు.
 
 స్టాంపు డ్యూటీని తగ్గించాల్సిందే..
 సరిగ్గా రెండేళ్ల తర్వాత నగరంలో భూముల ధరలను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. బహిరంగ మార్కెట్ ధరలను ప్రామాణికంగా తీసుకొని ప్రభుత్వం భూముల ధరలను పెంచనుంది. అయితే ఈ నిర్ణయం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ఆదిభట్ల, మహేశ్వరం, ఘట్‌కేసర్, భువనగిరి, షామీర్‌పేట వంటి ప్రాంతాలకు బాగా కలిసొస్తుందని భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) హైదరాబాద్ అధ్యక్షుడు ఎస్ రాంరెడ్డి ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. అయితే స్టాంప్ డ్యూటీని తగ్గించకుండా భూముల విలువను పెంచితే సామాన్యుల రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు ముందుకురారని ఆయన పేర్కొన్నారు.

అందుకే 6 శాతంగా ఉన్న స్టాంప్ డ్యూటీని 4 శాతానికి తగ్గించాలని ఆయన కోరారు. అప్పుడే రిజిస్ట్రేషన్లలో పారదర్శకత పెరుగుతుందని, ప్రభుత్వానికి ఆదాయమూ దండిగా వస్తుందన్నారు. ఇదిలా ఉంటే భూముల ధరలు తక్కువగా ఉన్నచోట ఎలాగైతే పెంచనుందో.. అలాగే ఎక్కువగా ఉన్న  చోట ధరలను అదుపులో ఉంచడం కూడా అవసరమేననేది ఆయన అభిప్రాయం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement