
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, రంగారెడ్డి: తట్టిఅన్నారంలో మున్సిపల్ అధికారులు చేతవాటం చూపించారు. కబ్జాదారుడు కేవీ సత్యనారాయణ రెడ్డితో అధికారులు చేతులు కలిపి అవినీతికి పాల్పడ్డారు. వివరాల ప్రకారం.. కేవీ సత్యనారాయణతో చేతులు కలిపిన మున్సిపల్ అధికారులు వివాదాస్పద ప్రైవేటు భూమిలో సీసీ రోడ్డు నిర్మాణం చేపించారు. రూ.12 కోట్ల విలువైన భూమిని కాజేసేందుకు క్రుట చేశారు.
ఈ క్రమంలో స్థానికులు వారిపై ఫిర్యాదు చేసినా మున్సిపల్ ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. రోడ్డు ఆపేశామని చెప్పి తెల్లారేసరికి రోడ్డు పనులు పూర్తిచేశారు. ఈ క్రమంలో రోడ్డు నిర్మాణం అడ్డుకున్న బాధితున్ని కబ్జాదారుడు బెదిరింపులకు గురిచేశాడు. దీంతో, ఈ విషయాన్ని పోలీసు కమిషనర్ దృష్టికి బాధితులు తీసుకెళ్లారు. ఈ సందర్భంగానే ప్రతీరోజు ప్రైవేటు గూండాలను పెట్టి పహరా కాస్తున్నట్టు తెలిపారు. దీంతో, పోలీసులు సత్యనారాయణరెడ్డిపై హయత్‌నగర్ పీఎస్‌లో కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment