సాయమ్మ (ఫైల్)
సాక్షి, వర్ని(నిజామాబాద్) : పొలం మార్పిడి చేయలేదనే కోపంతో కన్న తల్లిని కొడుకు హతమార్చిన విషాద ఘటన చందూర్ మండలం లక్ష్మాపూర్ గ్రామంలో జరిగింది. పొలం తన పేరిట మార్పిడి చేయాలని తల్లి సాయమ్మ (50)తో కుమారుడు నారాయణ కొన్ని నెలలుగా ఒత్తిడి తెచ్చినా స్పందించలేదనే కోపంతో గొంతు నులిమి హతమార్చి సాధారణ మరణంగా చిత్రికరించే ప్రయత్నం చేశాడు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు లక్మాపూర్ గ్రామానికి ముక్కెర సాయమ్మకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. సాయమ్మ కుమారుడు, కోడలితో కలిసి ఉంటోంది. ఆస్తిలో కూతుళ్లకు కూడా వాట ఇస్తుందనే అనుమానంతో తల్లిని వేధించే వాడు. నారాయణ భార్య కాన్పుకోసం ఇటీవల పుట్టింటికి వెళ్లింది. బుదవారం అర్థరాత్రి తల్లితో గొడవ పడి ఆవేశంతో హత్య చేశాడు.
ఆ తర్వాత డ్రైనేజీలో పడి మృతి చెందిందని ఒక సారి, విద్యుత్ షాక్‌తో మృతి చెందిందని బంధువులకు ఫోన్ చేసి పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బోధన్ ఏసీపీ రామారావ్, రుద్రూర్ సీఐ అశోక్ రెడ్డి, వర్ని ఎస్సై అనిల్ రెడ్డి ఘటన స్థలానికి పరిశీలించారు. హతురాలి కుమార్తె శోభ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ అశోక్ రెడ్డి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment