
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): తన భూ సమస్యను పరిష్కరించాలని, లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని ఓ రైతు హెచ్చరించాడు. సోమవారం మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో కిరోసిన్ డబ్బాతో వచ్చాడు. మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌కు చెందిన ఈశ్వరయ్య తనకు ఉన్న ఏడు గుంటల భూమిని పక్క పొలానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి ఆక్రమించుకున్నాడని కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు వచ్చాడు.
ఈ సందర్భంగా ఆయన కిరోసిన్ డబ్బాతో వచ్చి.. తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని తెలిపాడు. ఈ మేరకు సిబ్బంది గుర్తించి కిరోసిన్ డబ్బా లాక్కొని సర్ది చెప్పారు. అనంతరం అతను కలెక్టర్ రొనాల్డ్ రోస్‌కు వినతిపత్రం సమర్పించగా.. ఆయన మిడ్జిల్ తహసీల్దార్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడి ఈశ్వరయ్యకు న్యాయం చేయాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment