బెజ్జంకి(సిద్దిపేట): గతంలో ఇచ్చిన హామీ మేరకు సబ్ స్టేషన్ కోసం తీసుకున్న తమ మూడెకరాల భూమికి బదులు వేరే చోట భూమి ఇవ్వాలని కల్లెపెల్లికి చెందిన రైతు బిట్ల కనుకయ్య కుటుంబ సభ్యులతో కలిసి పురుగులు మందు డబ్బాతో మంగళవారం ఆందోళనకు దిగాడు. స్థానికులు జోక్యం చేసుకుని వారిని బుజ్జగించి ఆందోళనను విరమింపజేశారు. వివరాల ప్రకారం..గతేడాది గ్రామంలో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి అనువుగా ఉందని కనుకయ్యకు చెందిన 1.04 గుంటల భూమిని సబ్‌స్టేషన్‌కు అప్పగిస్తే ప్రభుత్వం నుంచి 3 ఎకరాల సాగుభూమిని ఇప్పిస్తామని ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చారు.
కానీ ఆ హామీ ఇంత వరకు నెరవేరలేదు. నిరుపేద అయిన కనుకయ్యకు నలుగురు కూతుళ్లు. సాగు చేసే భూమి పోవడంతో తమకు పూట గడిచే పరిస్థితి లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య రాజేశ్వరి పేరున ప్రభుత్వం నుంచి 3 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేయించినప్పటికీ హద్దులు చూపించి కాస్తుకు ఇవ్వడంలేదని వాపోయారు. గతంలో భూమి పట్టాదారుకు ప్రభుత్వం డబ్బులు ఇవ్వటంలేదని వారికి రిజిస్ట్రేషన్ చేసినా భూమిలోకి రానివ్వటంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment