సాక్షి, రాజమహేంద్రవరం :
సెంటు భూమి లేకుండానే స్టంటు
Published Thu, Mar 9 2017 11:44 PM | Last Updated on Tue, Sep 5 2017 5:38 AM
రాజమహేంద్రవరం నగరంలో రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు తెలుగు తమ్ముడు చకచకా పావులు కదుపుతున్నాడు. అది ప్రభుత్వ స్థలమని తెలిసినా అధికారం అండతో చెలరేగిపోతున్నాడు. కంచె వేసిన స్థలం సత్యవోలు పాపారావు కుమారుడు శేషగిరిరావుదంటూ బోర్డులు పెట్టారు. సర్వే నంబర్ 730/2సీ2లోని ప్రైవేటు స్థలంతోపాటు మరికొందరి స్థలాలు ప్రభుత్వం నగరపాలక సంస్థ పాఠశాల నిమిత్తం సేకరించిందని ‘సాక్షి’ సాక్ష్యాధారాలతో సహా వరుస కథనాలతో బయటపెట్టింది. ఇందులో సర్వే నం.730/2సీ2లో సత్యవోలు పాపారావు, అతని తమ్ముడు లింగమూర్తి సత్యవతి దంపతులకు చెందిన 3.69 ఎకరాలకు కూడా నోటిఫికేష¯ŒS జారీ చేసింది. సత్యవోలు సత్యవతి హైకోర్టును ఆశ్రయించడంతో వారి స్థలం 1.81 ఎకరాలు మినహా సత్యవోలు పాపారావు అతని కుమారులకు చెందిన 1.88 ఎకరాకు 1985 జూలై 30వ తేదీన అవార్డు (నంబర్ 6/85) ప్రకటించి, వారి తాలూకు ఎవ్వరూ రాకపోవడంతో రాజమండ్రి సబార్డినేట్ జడ్జి వద్ద జమ చేసింది.
పాపారావుకు భూమి ఎక్కడ ఉంది?
రికార్డుల్లో 4.29 ఎకరాల భూమి ఉన్నా క్షేత్రస్థాయిలో మాత్రం అంత లేదు. సత్యవోలు పాపారావు, అతని తమ్ముడు లింగమూర్తి భార్య సత్యవతి 1950లో పంచుకునేందుకు జరిపిన సర్వేలో అక్కడ 3.54 ఎకరాలుంది. 1979లో ప్రభుత్వం సేకరించేందుకు చేసిన సర్వేలో 3.69 ఎకరాల భూమి ఉంది. ఇందులో సత్యవోలు పాపారావు అతని నలుగురు కుమారుల భూమి 1.81 ఎకరా సేకరించి అవార్డు కూడా ప్రకటించింది. సత్యవోలు సత్యవతి భూమి మాత్రం హైకోర్టు స్టే విధించడంతో సేకరణ నుంచి మినహాయించుకుంది. అయితే తాజాగా సత్యవోలు పాపారావు కుమారుల్లో ఒకరైన సత్యవోలు శేషగిరిరావు పేరిట సర్వే నంబర్ 730/2సీ2 స్థలంలో ఆ భూమి తమదేనంటూ బోర్టులు పెట్టారు. ప్రభుత్వం సేకరించకముందు అది సత్యవోలు పాపారావు కుమారులదే. కానీ 1985లో సేకరణ అనంతరం అవార్డు ప్రకటించిన తర్వాత సత్యవోలు పాపారావు అతని కుమారులకు అక్కడ సెంటు భూమి లేదు. ఉన్న భూమి సత్యవోలు సత్యవతి, ప్రభుత్వానిది. అయితే ఆ భూమి తాను కొనుగోలు చేశానంటూ తెలుగుదేశం పార్టీ నేత రాజమహేంద్రవరం రూరల్ మండలం కోలమూరు గ్రామ జన్మభూమి కమిటీ సభ్యుడు అక్కడ 50 ఏళ్లుగా ఉంటున్న పేదలను ఖాళీ చేయించి అమ్మేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ప్రభుత్వ సర్వే ప్రకారం 3.69 ఎకరాలు
వీరభద్రపురం మున్సిపల్ హైసూ్కల్ నిర్మాణం కోసం అప్పటి కమిషనర్ విజ్ఞప్తి మేరకు సబ్‌కలెక్టర్ కార్యాలయం ఆదెమ్మ దిబ్బ ప్రాంతంలోని సర్వే నంబర్లు 724/1డీ, 725/3ఏ,725/3ఈ, 730/2సీ2, 731/2లలో మొత్తం 5.87 ఎకరాలు సేకరించేందుకు సమాయత్తమైంది. మొత్తం భూమిలో సత్యవోలు కుటుంబానిదే సింహభాగం. సర్వే నంబర్ 730/2సీ2లో సత్యవోలు పాపారావు, అతని తమ్ముడు లింగమూర్తి సత్యవతి దంపతుల భూమి.3.69 ఎకరాలుగా పేర్కొంది. 1979 జూలై 20వ తేదీన డ్రాఫ్ట్ నోటిఫికేష¯ŒS జారీ చేసింది. 1985లో అప్పటి సబ్‌కలెక్టర్ ప్రదీప్‌చంద్ర అవార్డు ప్రకటించేందుకు ముందే సత్యవోలు సత్యవతి తరఫున వారి కుమారులు హైకోర్టును ఆశ్రయించారు. తమ భూమిని సేకరణ నుంచి మినహాయించేలా పిటీష¯ŒS వేయడంతో 1984 నంబర్ 5వ తేదీన కోర్టు స్టే విధించింది. సత్యవోలు పాపారావు వాటా 1.81 ఎకరాకు మిగిలిన వారితోపాటు అవార్డు ప్రకటించింది. మొత్తంమీద వివిధ కోర్టు తీర్పులు, ప్రభుత్వ సేకరణ ఉపసంహరణ తర్వాత ప్రభుత్వం నోటిఫికేష¯ŒS జారీ చేసిన 5.87 ఎకరాలకుగాను 3.80 ఎకరాలు సేకరించింది. ఈ కేసులు 2001లో పూర్తవడంతో 2003లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఈ స్థలంలో వాంబే గృహాలు కట్టేందుకు నిర్ణయించింది. ఏ నుంచి జీ వరకు బ్లాక్‌లను నిర్మించాలని నిర్ణయించి 2003లో ఏ బ్లాక్ నిర్మాణం ప్రారంభించింది.
అసలు సర్వే నం. 730/2సీ2లో స్థలం ఎంత?
టౌ¯ŒS సర్వే నంబర్ 730/2సీ2లో రికార్డుల ప్రకారం సత్యవోలు పాపారావు, అతని తమ్ముడు లింగమూర్తి దంపతులకు 4.29 ఎకరాల భూమి ఉంది. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం రికార్డుల్లో ఉన్న భూమి లేదు. 1950 మే నెల 15వ తేదీన సత్యవోలు పాపారావు, అతని తమ్ముడు భార్య సత్యవతి ఆ భూమిని పంచుకున్నారు. ఇందు కోసం ఉమ్మడిగా సర్వే జరిపించారు. ఇందులో సర్వే నంబర్ 730/2సీ2(అప్పట్లో 730)లో రికార్డుల ప్రకారం 4.29 ఎకరాలున్నా క్షేత్రస్థాయిలో మాత్రం 3.54 ఎకరాలుగా ఉంది. దీనిని ఇద్దరు సమానంగా పంచుకున్నారు. మున్సిపల్ సర్వేయర్ కూడా 2010లో సర్వే చేసి హద్దులు నిర్ణయించారు.
Advertisement
Advertisement