‘భూ’మంత్రం
-
దర్జాగా నగరపాలక సంస్థ స్థలం ఆక్రమణ
-
ఆదెమ్మదిబ్బ స్థలంలో గుడిసెలు ఖాళీ
-
ఆ పక్కనే సర్వే నం.275/3ఏలోని
-
ప్రభుత్వ స్థలంలో కూడా పాగా
-
గుడిసెలు పీకి, చదును చేస్తున్న కబ్జాదారులు
-
కన్నెత్తిచూడని కార్పొరేష¯ŒS అధికారులు
చారిత్రక రాజమహేంద్రవరంలో భూ ఆక్రమణదారులు చెలరేగిపోతున్నారు. ప్రభుత్వ, పైవేటు అనే తేడా లేకుండా, కంట్లోపడిన స్థలాన్ని కాజేస్తున్నారు. రూ.100 కోట్ల విలువైన 3.54 ఎకరాల ఆదెమ్మదిబ్బ స్థలాన్ని కొనుగోలు చేశామని చెబుతూ, కబ్జా చేసేందుకు యత్నిస్తున్న ఆసాముల కన్ను తాజాగా దాని పక్కనే వాంబే గృహాల కోసం సేకరించిన కార్పొరేష¯ŒS స్థలంపై పడింది. దీనిని కూడా కాజేసేందుకు అక్రమార్కులు కథ నడిపిస్తున్నారు.
– సాక్షి, రాజమహేంద్రవరం
సర్వే నంబర్ 370లో సత్యవోలు పాపారావు కుమారుడు సత్యవోలు శేషగిరిరావు వద్ద తాను కొనుగోలు చేశానని చెప్పి ఆదెమ్మదిబ్బ స్థలంలో ఉన్న పేదలను కోలమూరుకు చెందిన పిన్నమరెడ్డి ఈశ్వరుడు అనే వ్యక్తి కొద్దిరోజులుగా ఖాళీ చేయిస్తున్నారు. ఇప్పటివరకూ 36, 38 డివిజన్ల పరిధిలో ఉన్న 110 మంది పేదలను ఖాళీ చేయించారు. ఇక 36వ డివిజ¯ŒS పరిధిలో ఉన్న 10 బ్రాహ్మణ కుటుంబాల వారినీ ఖాళీ చేయించేందుకు అన్ని విధాలా పావులు కదుపుతున్నారు. ఇందతా ఒక ఎత్తయితే, తాజాగా పిన్నమరెడ్డి ఈశ్వరుడు మరో ఎత్తు వేశారు. ఈ స్థలానికి పక్కన ఉన్న ప్రభుత్వ స్థలాన్నీ కాజేసేందుకు వ్యూహం పన్నారు. అధికార యంత్రాంగం చూసీచూడనట్టుగా ఉందన్న భరోసాతో ప్రభుత్వ స్థలాన్ని కలిపేసుకునేందుకు వేగంగా పావులు కదుపుతున్నారు.
హోలీఏంజెల్స్ స్కూల్ వెనుక ప్రాంతమే..
ఆదెమ్మదిబ్బలో వాంబే గృహాలను ఆనుకుని హోలీఏంజెల్స్ స్కూల్ ఉంది. సర్వే నంబర్ 275/3ఏలో ఉన్న ఈ పాఠశాల భవనం స్థలంపై నగరపాలక సంస్థకు, ఆ పాఠశాల యాజమాన్యానికి మధ్య వివాదం నెలకొని ఉంది. దీనిపై కోర్టుల్లో వాదోపవాదాలూ నడిచాయి. నగరపాలక సంస్థ పాఠశాల భవనం గోడ వెనుక భాగాన.. ఈ స్థలం తమదంటూ ఆక్రమించిన వారు శిక్షార్హులని రాయించింది. ప్రస్తుత కమిషనర్ వి.విజయరామరాజు బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాఠశాల పక్కనే 275/3ఏ సర్వే నంబర్‌లో ఉన్న హోలీఏంజెల్స్ స్కూల్ గోడౌ¯ŒSను కూల్చివేయించారు. పాఠశాల భవనం వెనుక ‘ఏ, బీ’ బ్లాకుల పేరుతో వాంబే గృహాలు నిర్మించారు. వాంబే గృహాలకు, పాఠశాలకు మధ్య నగరపాలక సంస్థ సీసీ రోడ్డు కూడా నిర్మించింది. హోలీఏంజెల్స్ స్కూల్ భవనం వెనుక, గోడౌ¯ŒS పక్కన ఉన్న ఖాళీ స్థలంలో పేదలు గుడిసెలు, రేకుల షెడ్లు వేసుకుని నివసిస్తున్నారు. ఈ స్థలం తాము కొన్నామంటూ అక్రమార్కులు ఖాళీ చేయిస్తున్నారు. తాము ఇక్కడ ఎన్నో ఏళ్లుగా ఉంటున్నామని చెప్పినా, గుడిసెకు రూ.50 వేలు, రేకుల షెడ్డుకు రూ.70 వేల లెక్కన ఇస్తామని హామీ ఇస్తున్నారని పేదలు చెబుతున్నారు.
పట్టించుకోని అధికార యంత్రాంగం
ఆదెమ్మదిబ్బ స్థలాన్ని ఆక్రమించేందుకు పేదలను ఖాళీ చేయిస్తున్నారని ఈ నెల 11న ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో అర్బ¯ŒS తహసీల్దార్ కె.పోసయ్య తన సిబ్బందితో కలసి ఆ స్థలాన్ని పరిశీలించారు. ఆ స్థలం టౌ¯ŒS సర్వే నంబర్ పరిధిలోకి వస్తుందని తేల్చారు. మరుసటి రోజు రెవెన్యూ, నగరపాలక సంస్థ సర్వేయర్లు ఆ స్థలాన్ని పరిశీలించి వెళ్లారు. సర్వే నంబర్ 370లోని ఆ స్థలం ప్రైవేటు వ్యక్తులదని, అందులో కొంత ప్రభుత్వం సేకరించిందని తేల్చారు. అప్పటినుంచి పట్టించుకోవడం మానేశారు. దీంతో వాంబే ఏ, బీ బ్లాక్‌లకు ఎదురుగా సర్వే నంబర్ 275/3ఏలో ఉన్న స్థలాన్ని కబ్జా చేసేందుకు అక్రమార్కులు యత్నిస్తున్నారు. అక్కడ గుడిసెలు, షెడ్లు తొలగిస్తున్నారు.