ademma dibba
-
‘భూ’మంత్రం
దర్జాగా నగరపాలక సంస్థ స్థలం ఆక్రమణ ఆదెమ్మదిబ్బ స్థలంలో గుడిసెలు ఖాళీ ఆ పక్కనే సర్వే నం.275/3ఏలోని ప్రభుత్వ స్థలంలో కూడా పాగా గుడిసెలు పీకి, చదును చేస్తున్న కబ్జాదారులు కన్నెత్తిచూడని కార్పొరేష¯ŒS అధికారులు చారిత్రక రాజమహేంద్రవరంలో భూ ఆక్రమణదారులు చెలరేగిపోతున్నారు. ప్రభుత్వ, పైవేటు అనే తేడా లేకుండా, కంట్లోపడిన స్థలాన్ని కాజేస్తున్నారు. రూ.100 కోట్ల విలువైన 3.54 ఎకరాల ఆదెమ్మదిబ్బ స్థలాన్ని కొనుగోలు చేశామని చెబుతూ, కబ్జా చేసేందుకు యత్నిస్తున్న ఆసాముల కన్ను తాజాగా దాని పక్కనే వాంబే గృహాల కోసం సేకరించిన కార్పొరేష¯ŒS స్థలంపై పడింది. దీనిని కూడా కాజేసేందుకు అక్రమార్కులు కథ నడిపిస్తున్నారు. – సాక్షి, రాజమహేంద్రవరం సర్వే నంబర్ 370లో సత్యవోలు పాపారావు కుమారుడు సత్యవోలు శేషగిరిరావు వద్ద తాను కొనుగోలు చేశానని చెప్పి ఆదెమ్మదిబ్బ స్థలంలో ఉన్న పేదలను కోలమూరుకు చెందిన పిన్నమరెడ్డి ఈశ్వరుడు అనే వ్యక్తి కొద్దిరోజులుగా ఖాళీ చేయిస్తున్నారు. ఇప్పటివరకూ 36, 38 డివిజన్ల పరిధిలో ఉన్న 110 మంది పేదలను ఖాళీ చేయించారు. ఇక 36వ డివిజ¯ŒS పరిధిలో ఉన్న 10 బ్రాహ్మణ కుటుంబాల వారినీ ఖాళీ చేయించేందుకు అన్ని విధాలా పావులు కదుపుతున్నారు. ఇందతా ఒక ఎత్తయితే, తాజాగా పిన్నమరెడ్డి ఈశ్వరుడు మరో ఎత్తు వేశారు. ఈ స్థలానికి పక్కన ఉన్న ప్రభుత్వ స్థలాన్నీ కాజేసేందుకు వ్యూహం పన్నారు. అధికార యంత్రాంగం చూసీచూడనట్టుగా ఉందన్న భరోసాతో ప్రభుత్వ స్థలాన్ని కలిపేసుకునేందుకు వేగంగా పావులు కదుపుతున్నారు. హోలీఏంజెల్స్ స్కూల్ వెనుక ప్రాంతమే.. ఆదెమ్మదిబ్బలో వాంబే గృహాలను ఆనుకుని హోలీఏంజెల్స్ స్కూల్ ఉంది. సర్వే నంబర్ 275/3ఏలో ఉన్న ఈ పాఠశాల భవనం స్థలంపై నగరపాలక సంస్థకు, ఆ పాఠశాల యాజమాన్యానికి మధ్య వివాదం నెలకొని ఉంది. దీనిపై కోర్టుల్లో వాదోపవాదాలూ నడిచాయి. నగరపాలక సంస్థ పాఠశాల భవనం గోడ వెనుక భాగాన.. ఈ స్థలం తమదంటూ ఆక్రమించిన వారు శిక్షార్హులని రాయించింది. ప్రస్తుత కమిషనర్ వి.విజయరామరాజు బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాఠశాల పక్కనే 275/3ఏ సర్వే నంబర్లో ఉన్న హోలీఏంజెల్స్ స్కూల్ గోడౌ¯ŒSను కూల్చివేయించారు. పాఠశాల భవనం వెనుక ‘ఏ, బీ’ బ్లాకుల పేరుతో వాంబే గృహాలు నిర్మించారు. వాంబే గృహాలకు, పాఠశాలకు మధ్య నగరపాలక సంస్థ సీసీ రోడ్డు కూడా నిర్మించింది. హోలీఏంజెల్స్ స్కూల్ భవనం వెనుక, గోడౌ¯ŒS పక్కన ఉన్న ఖాళీ స్థలంలో పేదలు గుడిసెలు, రేకుల షెడ్లు వేసుకుని నివసిస్తున్నారు. ఈ స్థలం తాము కొన్నామంటూ అక్రమార్కులు ఖాళీ చేయిస్తున్నారు. తాము ఇక్కడ ఎన్నో ఏళ్లుగా ఉంటున్నామని చెప్పినా, గుడిసెకు రూ.50 వేలు, రేకుల షెడ్డుకు రూ.70 వేల లెక్కన ఇస్తామని హామీ ఇస్తున్నారని పేదలు చెబుతున్నారు. పట్టించుకోని అధికార యంత్రాంగం ఆదెమ్మదిబ్బ స్థలాన్ని ఆక్రమించేందుకు పేదలను ఖాళీ చేయిస్తున్నారని ఈ నెల 11న ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో అర్బ¯ŒS తహసీల్దార్ కె.పోసయ్య తన సిబ్బందితో కలసి ఆ స్థలాన్ని పరిశీలించారు. ఆ స్థలం టౌ¯ŒS సర్వే నంబర్ పరిధిలోకి వస్తుందని తేల్చారు. మరుసటి రోజు రెవెన్యూ, నగరపాలక సంస్థ సర్వేయర్లు ఆ స్థలాన్ని పరిశీలించి వెళ్లారు. సర్వే నంబర్ 370లోని ఆ స్థలం ప్రైవేటు వ్యక్తులదని, అందులో కొంత ప్రభుత్వం సేకరించిందని తేల్చారు. అప్పటినుంచి పట్టించుకోవడం మానేశారు. దీంతో వాంబే ఏ, బీ బ్లాక్‌లకు ఎదురుగా సర్వే నంబర్ 275/3ఏలో ఉన్న స్థలాన్ని కబ్జా చేసేందుకు అక్రమార్కులు యత్నిస్తున్నారు. అక్కడ గుడిసెలు, షెడ్లు తొలగిస్తున్నారు. -
ఆక్రమణదారుల బంపర్ ఆఫర్
ఆదెమ్మ దిబ్బ వాసులకు ఆశ చూపిస్తున్న ఆక్రమణదారులు మార్కెట్ విలువ రూ.లక్షకు పై మాటే రూ.13,500కు ఇవ్వడంలో మతలబేమిటో? ఇంత జరుగుతున్నా సంబంధితాధికారులది ప్రేక్షకపాత్రే.. ప్రభుత్వం స్వా«ధీనం చేసుకోవాలని వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ షర్మిలా రెడ్డి డిమాండ్ సాక్షి, రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం నడిబొడ్డున కంబాల చెరువు ప్రాంతంలో ఉన్న ఆదెమ్మ దిబ్బ స్థలాన్ని తాము కొనుగోలు చేశామని చెబుతున్న ఆసాములు అక్కడ ఉంటున్న పేదలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. గుడిసెలు ఖాళీ చేస్తే రూ.50 వేల నుంచి రూ.70 వేలు ఇస్తామని ఓ వైపు చెబుతూ అక్కడే ఉండాలని అనుకుంటే గజం రూ.13,500లకే విక్రయిస్తామని ప్రకటిస్తున్నారు. ఇప్పటికే స్థానికంగా ఉన్న రమణ అనే వ్యక్తి తాను రూ.13,500 లెక్కన 200 గజాలు కొన్నానని ’సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. తనకు రెండు రేకుల షెడ్లున్నాయని రూ.1.4 లక్షలు ఇవ్వడంతో పక్కనే తనకు ఉన్న వాంబే గృహాల్లోకి చేరిపోయానని తెలిపారు. రాజమహేంద్రవరం నగర నడిబొడ్డున ఉన్న ఈ స్థలం ఖరీదు ప్రస్తుతం మార్కెట్ ప్రకారం గజం రూ.లక్ష వరకూ ఉంటుందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు. ఇంత విలువైన స్థలాన్ని కొనుగోలు చేశానని చెబుతున్న వ్యక్తి గజం రూ.13,500లకే అమ్ముతుండడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోలమూరుకు చెందిన పిన్నమరెడ్డి ఈశ్వరుడు తాను 4000 గజాల స్థలాన్ని సత్యవోలు శేషగిరిరావు వద్ద కొనుగోలు చేశానని రెవెన్యూ అధికారుల వద్ద పేర్కొన్నారు. సాధారణంగా రియల్ వ్యాపారులు లాభాలకే ప్రాధాన్యమిస్తారు. స్థలం కొనుగోలు చేసిన వ్యక్తి అక్కడ ఉన్న అక్రమణదారులను ఖాళీ చేయించడానికి భారీ మొత్తంలో నగదు ఇవ్వాల్సిన అవసరమేమిటన్న ప్రశ్న నగరవాసుల మొదడును తొలిచేస్తోంది. స్థలం కొనుగోలు చేసినప్పుడు అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు కోర్టుకు చూపించి చట్ట ప్రకారం వారిని ఖాళీ చేయించవచ్చు. గుడిసెల తొలగింపునకే రూ. 50 లక్షలు నగరంలోని 36, 38 డివిజన్ల పరిధిలో ఆదెమ్మదిబ్బ ప్రాంతంలోని 3.54 ఎకరాల స్థలంలో 110 మంది పేదలు గుడిసెలు, రేకుల షెడ్లు వేసుకుని నివసిస్తున్నారు. ఖాళీ చేస్తే ఒక్కొక్కరికీ రూ.50 నుంచి రూ.70 వేలు చొప్పున చెల్లిస్తూ ఇప్పటికే రూ.50 లక్షలు ఖర్చు చేసినట్టు తెలిసింది. ఓ వైపు ఎదురు చెల్లింపులు ... ఇంకోవైపు బంపర్ ఆఫర్లు ఇస్తుండడంతో అనేక అనుమానాలకు తావిస్తోంది. ఒకరి వెంట ఒకరు చెల్లాచెదురై... ఆదెమ్మదిబ్బ స్థలంలో ఉంటున్నవారందరూ అక్కడ తాత్కాలికంగా గుడిసెలు వేసుకుని అరవై ఏళ్లుగా నివసిస్తున్నవారే. ఇందులో పలువురికి వాంబే గృహాలు కూడా వచ్చాయి. గృహాలు వచ్చిన వారు ఖాళీ చేయకుండా గుడిసెలను ఆద్దెకు ఇచ్చారు. ఇప్పడు ఆక్రమణదారులు రావడంతో ఎంత డబ్బులిచ్చినా తీసుకొని ఖాళీ చేసేస్తామని చెప్పడంతో నిజమైన పేదలు ఇబ్బందులు పడుతున్నారు. -
కదిలిన యంత్రాంగం
ఆదెమ్మ దిబ్బలో యథేచ్ఛగా గుడిసెల తొలగింపు ముళ్ల కంచెకు రంగులు పరిశీలించి, వివరాలు సేకరించిన అర్బ¯ŒS తహసీల్దార్ పోశయ్య విచారించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి : సీపీఎం సాక్షి, రాజమహేంద్రవరం : రాజమహేంద్రవరం నగరం నడిబొడ్డున ఆదెమ్మ దిబ్బ ప్రాంతంలోని రూ.100 కోట్ల విలువైన భూమిని కబ్జాదారులు నకిలీ డాక్యుమెంట్లతో కాజేసే ప్రక్రియను గత రెండు రోజులుగా ‘సాక్షి’ బహిర్గతం చేయడంతో ఎట్టకేలకు రెవెన్యూ యంత్రాంగంలో కదలిక వచ్చింది. సోమవారం అర్బ¯ŒS తహసీల్దార్ కె.పోశయ్య తన సిబ్బందితో కలిసి వెళ్లి ఆదెమ్మదిబ్బ ప్రాంతాన్ని పరిశీలించారు. స్థానికంగా ఉంటున్న పేదలను విచారించారు. వారు అక్కడ ఎన్నేళ్ల నుంచి ఉంటుంన్నారో అడిగి తెలుసుకున్నారు. ఈ స్థలం ఎవరిదనే కోణంలో ఆరా తీశారు. తాము గత 50 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని పేదలు తెలిపారు. తమలో కొంత మందికి వాంబే గృహాలు వచ్చినా తమ కుమారులు వారి కుంటుంబాలతో అక్కడ ఉంటున్నారని వివరించారు. చిన్న గృహాలు కావడంతో తాము ఇక్కడే గుడిసెల్లో ఉంటున్నామని పేర్కొన్నారు. తమలో చాలా మందికి వాంబే గృహాలు లేవని తహసీల్దార్‌కు చెప్పారు. ఇప్పుడు ఎవరో వచ్చి తాము ఈ స్థలం కొనుగోలు చేశామని చెబుతూ ఖాళీ చేయాలని చెబతున్నారని వాపోయారు. తమకు ఎలాంటి ఆధారం లేదని, తాతల కాలం నుంచి ఇక్కడే ఉంటున్నామని పలువురు విలపించారు. తమకు ఇక్కడే స్థలం కేటాయించి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని విన్నవించారు. అనంతరం గుడిసెలను తొలగిస్తున్న వారి నుంచి కూడా పోశయ్య వివరాలు సేకరంంచారు. ఎవరి దగ్గర, ఎప్పుడు కొన్నదీ అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు చూపించాలని ఆదేశించారు. యథేచ్ఛగా గుడిసెల తొలగింపు... అర్బ¯ŒS తహశీల్ధార్ పోశయ్య స్థలాన్ని పరిశీలించి వెళ్లిన తర్వాత కూడా 36వ డివిజ¯ŒS పరిధిలో ఉన్న గుడిసెలను యథేచ్ఛగా తొలగించారు. 30 మంది కూలీలతో ఈ తంతంగాన్ని గత రెండు రోజులుగా కొనసాగిస్తున్నారు. మొదట 38వ డివిజ¯ŒS పరిధిలోని 56 ఇళ్లను తొలగించిన వెంటనే ఈ విషయాన్ని ’సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. శనివారం తొలగించిన స్థలంలో రాత్రికి రాత్రే ముళ్ల కంచె వేశారు. తాము ఖాళీ చేయబోమన్న పేదల గుడిసెలను కలిపి దారిలేకుండా కంచె వేశారు. ఈ విషయాన్ని ’సాక్షి’ సోమవారం జిల్లా సంచికలో ప్రచురించింది. దీంతో రెవెన్యూ అధికారులు ఆదెమ్మదిబ్బ ప్రాంతాన్ని సందర్శించారు. రెవెన్యూ అధికారులు పరిశీలించి వెళ్లిన వెంటనే కబ్జాదారులు గుడిసెల తొలగింపు వ్యవహారాన్ని కొనసాగించడం గమనార్హం. విచారించి చట్ట ప్రకారం చర్యలు... ఆదెమ్మదిబ్బ స్థలం వ్యవహారంపై విచారించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అర్బ¯ŒS తహసీల్దార్ కె.పోశయ్య తెలిపారు. ఈ వ్యవహారంపై తహశీల్దార్ కార్యాలయంలో ఆయన ’సాక్షి’తో మాట్లాడుతూ ఆదెమ్మదిబ్బ స్థలం రెవెన్యూ సర్వే నంబర్ పరిధిలోకి రావడంలేదని, టౌ¯ŒS సర్వే నంబర్ పరిధిలోకి వస్తుందని చెప్పారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని నగరపాలక సంస్థ టౌ¯ŒS ప్లానింగ్ అధికారులను కోరినట్లు తెలిపారు. కోలమూరుకు చెందిన పిన్నమరెడ్డి ఈశ్వరుడు అనే వ్యక్తి తాను సత్యవోలు శేషగిరిరావు వద్ద ఈ స్థలం కొన్నానని చెబుతున్నారని, అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు చూపించాలని కోరినట్లు చెప్పారు. ఆదే స్థలంలో వాంబే గృహాలున్నాయని కూడా తమ పరిశీలనతో తెలిసిందని పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారించి స్థల వారసులు లేకపోతే బొనావెకెన్సియా చట్టం ప్రకారం స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. సత్యవోలు పాపారావు పేరుతో నగరంలో అనేక స్థలాలు ఇలాగే వివాదంలో ఉన్నాయని చెప్పారు. కొన్ని స్థలాలపై కోర్టుల్లో కేసులు నడుస్తున్నట్లు తెలిపారు. భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి : సీపీఎం ఆదెమ్మ దిబ్బ ప్రాంతంలోని 3.54 ఎకరాల వివాదస్పద స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సీపీఎం రాజమహేంద్రవరం జిల్లా కార్యదర్శి టి. అరుణ్ డిమాండ్ చేశారు. సోమవారం బాధితులను సీపీఎం నాయకులు పరామర్శించారు. ఈ భూమిని తనదేనని కోలమూరు ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఇక్కడ హల్చల్ చేస్తున్నాడని అన్నారు. ఇది ప్రభుత్వ భూమేనని బాధితులు చెబుతున్నారని, అసలు ఈ భూమి ఎవరిదో ప్రభుత్వం తేల్చాలని డిమాండ్ చేశారు.ఈ భూమి తనదేనని చెప్పుకుంటున్న వ్యక్తి శనివారం 38 వ డివిజ¯ŒS లోని 54 ఇళ్లును ఖాళీ చేయించాడు. అక్కడ కంచె కూడా నిర్మించాడు. 40 ఏళ్ళుగా జీవిస్తున్న తమను పొమ్మంటే ఎక్కడికి పోతామని బాధితులు ఇప్పర్తి సత్యవతి, డి. సుబ్బాయమ్మ ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. వివాదాస్పద ఈ స్థలాన్ని సీపీఎం నాయకులు డివిజ¯ŒS కార్యదర్వి ఎస్.ఎస్.మూర్తి, పోలిన వెంకటేశ్వరరావు, భీమేశ్వరరావు, జి.రవి, కె.రామకృష్ణ తదితరులు పరిశీలించారు. -
రూ.100 కోట్ల స్థలానికి కంచె
పక్కా వ్యూహంతో ఆదెమ్మ దిబ్బ స్థలం కబ్జా నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి యజమానిగా చెలామణి ఖాళీ చేయాలంటూ పేదలపై దౌర్జన్యం రాత్రికి రాత్రే కంచె ఏర్పాటు కాదన్నవారికి గృహనిర్బంధం సాక్షి, రాజమహేంద్రవరం : నగరంలోని ఆదెమ్మదిబ్బలో భూకబ్జాదారులు రెచ్చిపోతున్నారు. 36, 38 డివిజన్ల పరిధిలోని సర్వే నంబర్ 725లో ఉన్న 3.54 ఎకరాల్లో 110 మంది పేదలు చిన్నచిన్న ఇళ్లు వేసుకుని నివసిస్తున్నారు. మురుగు చెరువును క్రమంగా పూడ్చి నగరంలో ఇళ్లు లేని పేదలు ఇక్కడ ఉంటున్నారు. 36, 38 డివిజన్ల మధ్య సీసీ రోడ్డుకు ఒకవైపు 56, మరోవైపు 54 ఇళ్లు ఉన్నాయి. 38వ డివిజ¯ŒS వైపు ఉన్న 54 ఇళ్లను, పూరిపాకలను శనివారం తొలగించిన కబ్జాదారులు రాత్రికి రాత్రే దాని చుట్టూ కంచె వేశారు. పూరిపాకలు, రేకుల షెడ్లకు రేట్లు కట్టి పేదలను బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు. పెద్దలతో ఇబ్బందులు ఎందుకనుకున్న పలువురు.. వారిచ్చిన సొమ్ము తీసుకుని వెళ్లిపోయారు. కబ్జాదారుల ప్రతిపాదనలను ఒప్పుకోని పేదలు అక్కడే తమ నివాసంలో ఉంటున్నారు. వారు అక్కడ ఉన్నా చుట్టుపక్కల ఇళ్లను కూలగొట్టి చుట్టూ ఇనుప కంచె వేశారు. దీంతో అక్కడే ఉంటున్న ప్రజలు గృహనిర్బంధమైపోయారు. పక్కా వ్యూహంతో.. కొద్దికాలంగా ఈ స్థలంపై కబ్జాదారుల కన్ను పడింది. అక్కడ పేదలను నయానో భయానో బెదిరించి ఖాళీ చేయించాలని వ్యూహం పన్నారు. స్థానిక నాయకులుగా చెలామణి అవుతున్నవారితో మంతనాలు జరిపారు. నేతలుగా చెలామణి అవుతున్నవారికి పక్కనే ఉన్న వాంబే గృహాల్లో ఫ్లాట్లు ఉన్నాయి. అయినప్పటికీ వారు కూడా ఇక్కడే రేకుల షెడ్లు వేసుకుని ఉంటున్నారు. వారిని అడ్డం పెట్టుకుని పూరిగుడిసెలు, రేకుల షెడ్లవారికి రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకూ ఇవ్వాలని నిర్ణయించారు. అసలు అక్కడ ఎంతమంది పేదలు ఉంటున్నారో తెలుసుకునేందుకు ఓ పథకం రచించారు. అందరికీ విద్యుత్ మీటర్లు ఇస్తామంటున్నారని దరఖాస్తు చేసుకోవాలని స్థానికంగా నాయకులుగా చెలమణి అవుతున్నవారు పేదలతో అర్జీలు పెట్టించారు. తద్వారా అక్కడ మొత్తం 110 మంది ఉన్నారని లెక్కగట్టారు. తలాకొంత ముట్టజెప్పి పంపేందుకు రంగం సిద్ధం చేశారు. మొదట అక్కడ నేతలుగా చెలామణి అవుతున్నవారు యజమానులుగా చెప్పుకుంటున్న కబ్జాదారులు ఇచ్చిన రూ.50 వేలు తీసుకుని ఇళ్లను ఖాళీ చేశారు. అనంతరం వారే ఆ స్థలాన్ని ఎవరో కొన్నారని, మనం ఖాళీ చేయాల్సిందేనంటూ పేదలను భయపెట్టారు. తద్వారా ఆ స్థలాన్ని చేజిక్కించుకునేందుకు పక్కా పథకం వేశారు. కబ్జాదారులకు వత్తాసుగా కార్పొరేటర్లు ఆ స్థలం కొన్నామంటూ కోలమూరుకు చెందిన ఓ వ్యక్తి వచ్చి చెప్పాడని అక్కడివారు చెబుతున్నారు. కొనుగోలు పత్రాలు, లింకు డాక్యుమెంట్లు చూపించాలని అడగడంతో ‘మీ సంగతి ఇలా ఉందా’ అంటూ బెదిరించాడని అంటున్నారు. ఆ తర్వాత అతడు రాలేదని స్థానిక 36, 38వ డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు పలుమార్లు వచ్చి, ఆ స్థలాన్ని ఆ వ్యక్తి కొన్నాడని, ఖాళీ చేయక తప్పదని చెప్పారని స్థానికులు చెబుతున్నారు. ఓట్లకోసం దండాలు పెట్టి వచ్చారని, ఇప్పుడు తమకు నిలువ నీడ లేకుండా చేశారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.