- పక్కా వ్యూహంతో ఆదెమ్మ దిబ్బ స్థలం కబ్జా
- నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి యజమానిగా చెలామణి
- ఖాళీ చేయాలంటూ పేదలపై దౌర్జన్యం
- రాత్రికి రాత్రే కంచె ఏర్పాటు
- కాదన్నవారికి గృహనిర్బంధం
రూ.100 కోట్ల స్థలానికి కంచె
Published Sun, Dec 11 2016 10:46 PM | Last Updated on Mon, Sep 4 2017 10:28 PM
సాక్షి, రాజమహేంద్రవరం :
నగరంలోని ఆదెమ్మదిబ్బలో భూకబ్జాదారులు రెచ్చిపోతున్నారు. 36, 38 డివిజన్ల పరిధిలోని సర్వే నంబర్ 725లో ఉన్న 3.54 ఎకరాల్లో 110 మంది పేదలు చిన్నచిన్న ఇళ్లు వేసుకుని నివసిస్తున్నారు. మురుగు చెరువును క్రమంగా పూడ్చి నగరంలో ఇళ్లు లేని పేదలు ఇక్కడ ఉంటున్నారు. 36, 38 డివిజన్ల మధ్య సీసీ రోడ్డుకు ఒకవైపు 56, మరోవైపు 54 ఇళ్లు ఉన్నాయి. 38వ డివిజ¯ŒS వైపు ఉన్న 54 ఇళ్లను, పూరిపాకలను శనివారం తొలగించిన కబ్జాదారులు రాత్రికి రాత్రే దాని చుట్టూ కంచె వేశారు. పూరిపాకలు, రేకుల షెడ్లకు రేట్లు కట్టి పేదలను బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు. పెద్దలతో ఇబ్బందులు ఎందుకనుకున్న పలువురు.. వారిచ్చిన సొమ్ము తీసుకుని వెళ్లిపోయారు. కబ్జాదారుల ప్రతిపాదనలను ఒప్పుకోని పేదలు అక్కడే తమ నివాసంలో ఉంటున్నారు. వారు అక్కడ ఉన్నా చుట్టుపక్కల ఇళ్లను కూలగొట్టి చుట్టూ ఇనుప కంచె వేశారు. దీంతో అక్కడే ఉంటున్న ప్రజలు గృహనిర్బంధమైపోయారు.
పక్కా వ్యూహంతో..
కొద్దికాలంగా ఈ స్థలంపై కబ్జాదారుల కన్ను పడింది. అక్కడ పేదలను నయానో భయానో బెదిరించి ఖాళీ చేయించాలని వ్యూహం పన్నారు. స్థానిక నాయకులుగా చెలామణి అవుతున్నవారితో మంతనాలు జరిపారు. నేతలుగా చెలామణి అవుతున్నవారికి పక్కనే ఉన్న వాంబే గృహాల్లో ఫ్లాట్లు ఉన్నాయి. అయినప్పటికీ వారు కూడా ఇక్కడే రేకుల షెడ్లు వేసుకుని ఉంటున్నారు. వారిని అడ్డం పెట్టుకుని పూరిగుడిసెలు, రేకుల షెడ్లవారికి రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకూ ఇవ్వాలని నిర్ణయించారు. అసలు అక్కడ ఎంతమంది పేదలు ఉంటున్నారో తెలుసుకునేందుకు ఓ పథకం రచించారు. అందరికీ విద్యుత్ మీటర్లు ఇస్తామంటున్నారని దరఖాస్తు చేసుకోవాలని స్థానికంగా నాయకులుగా చెలమణి అవుతున్నవారు పేదలతో అర్జీలు పెట్టించారు. తద్వారా అక్కడ మొత్తం 110 మంది ఉన్నారని లెక్కగట్టారు. తలాకొంత ముట్టజెప్పి పంపేందుకు రంగం సిద్ధం చేశారు. మొదట అక్కడ నేతలుగా చెలామణి అవుతున్నవారు యజమానులుగా చెప్పుకుంటున్న కబ్జాదారులు ఇచ్చిన రూ.50 వేలు తీసుకుని ఇళ్లను ఖాళీ చేశారు. అనంతరం వారే ఆ స్థలాన్ని ఎవరో కొన్నారని, మనం ఖాళీ చేయాల్సిందేనంటూ పేదలను భయపెట్టారు. తద్వారా ఆ స్థలాన్ని చేజిక్కించుకునేందుకు పక్కా పథకం వేశారు.
కబ్జాదారులకు వత్తాసుగా కార్పొరేటర్లు
ఆ స్థలం కొన్నామంటూ కోలమూరుకు చెందిన ఓ వ్యక్తి వచ్చి చెప్పాడని అక్కడివారు చెబుతున్నారు. కొనుగోలు పత్రాలు, లింకు డాక్యుమెంట్లు చూపించాలని అడగడంతో ‘మీ సంగతి ఇలా ఉందా’ అంటూ బెదిరించాడని అంటున్నారు. ఆ తర్వాత అతడు రాలేదని స్థానిక 36, 38వ డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు పలుమార్లు వచ్చి, ఆ స్థలాన్ని ఆ వ్యక్తి కొన్నాడని, ఖాళీ చేయక తప్పదని చెప్పారని స్థానికులు చెబుతున్నారు. ఓట్లకోసం దండాలు పెట్టి వచ్చారని, ఇప్పుడు తమకు నిలువ నీడ లేకుండా చేశారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Advertisement