కదిలిన యంత్రాంగం | ademma dibba site issue officers alert | Sakshi
Sakshi News home page

కదిలిన యంత్రాంగం

Published Mon, Dec 12 2016 11:59 PM | Last Updated on Mon, Sep 4 2017 10:33 PM

ademma dibba site issue officers alert

  • ఆదెమ్మ దిబ్బలో యథేచ్ఛగా గుడిసెల తొలగింపు 
  • ముళ్ల కంచెకు రంగులు 
  • పరిశీలించి, వివరాలు సేకరించిన అర్బ¯ŒS తహసీల్దార్‌ పోశయ్య
  • విచారించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ
  • భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి : సీపీఎం
  • సాక్షి, రాజమహేంద్రవరం :
    రాజమహేంద్రవరం నగరం నడిబొడ్డున ఆదెమ్మ దిబ్బ ప్రాంతంలోని రూ.100 కోట్ల విలువైన భూమిని కబ్జాదారులు నకిలీ డాక్యుమెంట్లతో కాజేసే ప్రక్రియను గత రెండు రోజులుగా ‘సాక్షి’ బహిర్గతం చేయడంతో ఎట్టకేలకు రెవెన్యూ యంత్రాంగంలో కదలిక వచ్చింది. సోమవారం అర్బ¯ŒS తహసీల్దార్‌ కె.పోశయ్య తన సిబ్బందితో కలిసి వెళ్లి ఆదెమ్మదిబ్బ ప్రాంతాన్ని పరిశీలించారు. స్థానికంగా ఉంటున్న పేదలను విచారించారు. వారు అక్కడ ఎన్నేళ్ల నుంచి ఉంటుంన్నారో అడిగి తెలుసుకున్నారు. ఈ స్థలం ఎవరిదనే కోణంలో ఆరా తీశారు. తాము గత 50 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని పేదలు తెలిపారు. తమలో కొంత మందికి వాంబే గృహాలు వచ్చినా తమ కుమారులు వారి కుంటుంబాలతో అక్కడ ఉంటున్నారని వివరించారు. చిన్న గృహాలు కావడంతో తాము ఇక్కడే గుడిసెల్లో ఉంటున్నామని పేర్కొన్నారు. తమలో చాలా మందికి వాంబే గృహాలు లేవని తహసీల్దార్‌కు చెప్పారు. ఇప్పుడు ఎవరో వచ్చి తాము ఈ స్థలం కొనుగోలు చేశామని చెబుతూ ఖాళీ చేయాలని చెబతున్నారని వాపోయారు. తమకు ఎలాంటి ఆధారం లేదని, తాతల కాలం నుంచి ఇక్కడే ఉంటున్నామని పలువురు విలపించారు. తమకు ఇక్కడే స్థలం కేటాయించి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని విన్నవించారు. అనంతరం గుడిసెలను తొలగిస్తున్న వారి నుంచి కూడా పోశయ్య వివరాలు సేకరంంచారు. ఎవరి దగ్గర, ఎప్పుడు కొన్నదీ అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు చూపించాలని ఆదేశించారు. 
    యథేచ్ఛగా గుడిసెల తొలగింపు...
    అర్బ¯ŒS తహశీల్ధార్‌ పోశయ్య స్థలాన్ని పరిశీలించి వెళ్లిన తర్వాత కూడా 36వ డివిజ¯ŒS పరిధిలో ఉన్న గుడిసెలను యథేచ్ఛగా తొలగించారు. 30 మంది కూలీలతో ఈ తంతంగాన్ని గత రెండు రోజులుగా కొనసాగిస్తున్నారు. మొదట 38వ డివిజ¯ŒS పరిధిలోని 56 ఇళ్లను తొలగించిన వెంటనే ఈ విషయాన్ని ’సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. శనివారం తొలగించిన స్థలంలో రాత్రికి రాత్రే ముళ్ల కంచె వేశారు. తాము ఖాళీ చేయబోమన్న పేదల గుడిసెలను కలిపి దారిలేకుండా కంచె వేశారు. ఈ విషయాన్ని ’సాక్షి’ సోమవారం జిల్లా సంచికలో ప్రచురించింది. దీంతో  రెవెన్యూ అధికారులు ఆదెమ్మదిబ్బ ప్రాంతాన్ని సందర్శించారు. రెవెన్యూ అధికారులు పరిశీలించి వెళ్లిన వెంటనే కబ్జాదారులు గుడిసెల తొలగింపు వ్యవహారాన్ని కొనసాగించడం గమనార్హం. 
    విచారించి చట్ట ప్రకారం చర్యలు...
    ఆదెమ్మదిబ్బ స్థలం వ్యవహారంపై విచారించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అర్బ¯ŒS తహసీల్దార్‌ కె.పోశయ్య తెలిపారు. ఈ వ్యవహారంపై తహశీల్దార్‌ కార్యాలయంలో ఆయన ’సాక్షి’తో మాట్లాడుతూ ఆదెమ్మదిబ్బ స్థలం రెవెన్యూ సర్వే నంబర్‌ పరిధిలోకి రావడంలేదని, టౌ¯ŒS సర్వే నంబర్‌ పరిధిలోకి వస్తుందని చెప్పారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని నగరపాలక సంస్థ టౌ¯ŒS ప్లానింగ్‌ అధికారులను కోరినట్లు తెలిపారు. కోలమూరుకు చెందిన పిన్నమరెడ్డి ఈశ్వరుడు అనే వ్యక్తి తాను సత్యవోలు  శేషగిరిరావు వద్ద  ఈ స్థలం కొన్నానని చెబుతున్నారని, అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు చూపించాలని కోరినట్లు చెప్పారు. ఆదే స్థలంలో వాంబే గృహాలున్నాయని కూడా తమ పరిశీలనతో తెలిసిందని పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారించి స్థల వారసులు లేకపోతే బొనావెకెన్సియా చట్టం ప్రకారం స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. సత్యవోలు పాపారావు పేరుతో నగరంలో అనేక స్థలాలు ఇలాగే వివాదంలో ఉన్నాయని చెప్పారు. కొన్ని స్థలాలపై కోర్టుల్లో కేసులు నడుస్తున్నట్లు తెలిపారు. 
     
    భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి : సీపీఎం   
    ఆదెమ్మ దిబ్బ ప్రాంతంలోని 3.54 ఎకరాల వివాదస్పద స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సీపీఎం రాజమహేంద్రవరం జిల్లా కార్యదర్శి టి. అరుణ్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం బాధితులను సీపీఎం నాయకులు పరామర్శించారు.  ఈ భూమిని తనదేనని కోలమూరు ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఇక్కడ హల్‌చల్‌ చేస్తున్నాడని అన్నారు.  ఇది ప్రభుత్వ భూమేనని బాధితులు చెబుతున్నారని, అసలు ఈ భూమి ఎవరిదో ప్రభుత్వం తేల్చాలని డిమాండ్‌ చేశారు.ఈ భూమి తనదేనని చెప్పుకుంటున్న వ్యక్తి శనివారం 38 వ డివిజ¯ŒS లోని 54 ఇళ్లును ఖాళీ చేయించాడు. అక్కడ కంచె కూడా నిర్మించాడు. 40 ఏళ్ళుగా జీవిస్తున్న తమను పొమ్మంటే ఎక్కడికి పోతామని బాధితులు ఇప్పర్తి సత్యవతి, డి. సుబ్బాయమ్మ ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. వివాదాస్పద ఈ స్థలాన్ని సీపీఎం నాయకులు డివిజ¯ŒS కార్యదర్వి ఎస్‌.ఎస్‌.మూర్తి, పోలిన వెంకటేశ్వరరావు, భీమేశ్వరరావు, జి.రవి, కె.రామకృష్ణ తదితరులు పరిశీలించారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement