Officers alert
-
ఒక్కరే ఉండాలి...అది ఉన్నతాధికారే..
సాక్షి, ఏలూరు (మెట్రో): బాధ్యతలు స్వీకరించి వారం రోజులు కాకముందే వినూత్న పద్ధతులను అమలు చేస్తున్నారు కలెక్టర్ రేవు ముత్యాలరాజు. జిల్లాలో ఇప్పటికే ఉన్నతాధికారులందరితోనూ సమావేశాన్ని నిర్వహించిన కలెక్టర్ ప్రతి సోమవారం నిర్వహించే మీ కోసం కార్యక్రమంలోనూ మూస పద్ధతికి స్వస్తి పలికారు. సమూల మార్పులకు చర్యలు చేపట్టారు. సోమవారం వచ్చిందంటే జిల్లా అధికారులంతా మూకుమ్మడిగా కలెక్టరేట్లో మీ కోసం కార్యక్రమానికి వస్తారు. మీ కోసం కార్యక్రమంలో కలెక్టర్‌కు ప్రజలు ఫిర్యాదులు చేస్తుంటే ఆ ఫిర్యాదులను కలెక్టర్ సంబంధిత శాఖాధికారులకు అప్పగించి వాటి పరిష్కారం కోసం ఆదేశాలు జారీ చేస్తుంటారు. ఇది ఇప్పటి వరకూ కొనసాగింది. అయితే కలెక్టర్ రేవు ముత్యాలరాజు ఈ పద్ధతిని మానేయాలని అధికారులను ఆదేశించారు. కేవలం ప్రాధాన్యం కలిగిన అధికారులు మాత్రమే మీ కోసం కార్యక్రమానికి హాజరు కావాలంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఫిర్యాదులు రానీ, వచ్చినా అరకొరా వచ్చే శాఖల అధికారులు ఈ కార్యక్రమానికి రావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రజలు ప్రధానంగా ఎదుర్కొనే సమస్యలు ఉన్న శాఖల అధికారులు మాత్రమే రావాలనీ, వచ్చిన ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఒక్కరే ఉండాలి... అదీ ఉన్నతాధికారే.. ఇప్పటివరకూ ప్రతి సోమవారం నిర్వహించే మీ కోసం కార్యక్రమానికి ఒక్కో శాఖ నుంచి ఇద్దరేసి అధికారులు హాజరవుతుండేవారు. వచ్చే సోమవారం నుంచి ప్రతి శాఖ నుంచి ఒక్కరు మాత్రమే మీ కోసం కార్యక్రమానికి హాజరు కావాలంటూ కలెక్టర్ ఆదేశాలిచ్చారు. వచ్చే అధికారి కూడా ఆ శాఖ ఉన్నతాధికారి అయి ఉండాలని స్పష్టం చేశారు. కిందిస్థాయి సిబ్బందిని పంపిస్తే వారిపై చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు. అధికారులు ఎవరైనా జిల్లా దాటివెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా తన అనుమతి తీసుకోవాలని ఆదేశించారు. తిప్పిపంపిన కలెక్టర్ ఫిర్యాదులు రాని శాఖలైన అగ్నిమాపక, రవాణా, చేనేత, ఆర్టీసీ, నెడ్‌క్యాప్, ఎల్డీఎం, జిల్లా మలేరియా, ఆడిట్, మహిళా కౌన్సిలర్ విభాగం, కమర్షియల్ టాక్స్ వంటి శాఖల అధికారులను కలెక్టర్ సోమవారం మీ కోసం కార్యక్రమం నుంచి తిప్పి పంపించేశారు. ఈ సమయాన్ని ఇతర పనులకు కేటాయించాలని, ప్రజలకు మెరుగైన సేవలు అదించాలని కలెక్టర్ సూచించారు. ఫిర్యాదుదారులకు ఫోన్ ప్రతి సోమవారం వచ్చిన ఫిర్యాదులు పరిష్కారమయ్యాయా, కాలేదా, ఎందుకు కాలేదు వంటి వాటిపై ఇక నుంచి కలెక్టర్ ప్రత్యేకించి ప్రతి శుక్రవారం పరిశీలించనున్నారు. పరిష్కారమయ్యాయని అధికారులు చెప్పే అర్జీలను పునఃపరిశీలించనున్నారు. కలెక్టర్ అప్పటికప్పుడు ఏదో ఒక ఫిర్యాదుదారునికి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. అధికారుల్లో జవాబుదారీతనం పెంచేందుకు కలెక్టర్ ముత్యాలరాజు కొత్త విధానాలను అమలు చేస్తున్నారు. ఉద్యోగుల కోసమూ ‘మీ కోసం’ ఉద్యోగుల సమస్యలనూ పరిష్కరించేందుకు ఆయా శాఖల ఉన్నతాధికారులతో మీ కోసం కార్యక్రమాన్ని ప్రతినెలా నిర్వహించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ ముత్యాలరాజు చెప్పారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తేనే ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలను ప్రతి ఉద్యోగి అందించగలుగుతారని ఆయన అభిప్రాయపడ్డారు. వీలైతే ఈనెల 21న ఉద్యోగుల మీ కోసం కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని కలెక్టర్ ‘సాక్షి’కి తెలిపారు. ఉద్యోగులు ఎదుర్కొనే సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని సూచించారు. -
‘లోక్‌సభ’కు రెడీ
సాక్షిప్రతినిధి, వరంగల్: అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించిన అధికారులు ఇక లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నారు. ఈ నెల 8న ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతుందన్న ప్రచారంతో మరోసారి అప్రమత్తం అయ్యారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఆయా జిల్లాల కలెక్టర్లతో ఏర్పాట్లపై సమీక్షించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే లోక్‌సభ ఎన్నికల పనుల్లో బిజీ అయిన అధికారులు ఇప్పటికే పోలింగ్ అధికారులు, సిబ్బందిని ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు. ఫిబ్రవరి చివరి వారంలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని భావించినప్పటికీ భారత్–పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్తత వల్ల జాప్యమైనట్లు చెప్తున్నారు. అయితే ఈ నెల 8న.. లేదంటే రెండోవారంలో షెడ్యూల్ ఖాయమన్న సంకేతాల మేరకు అధికార యంత్రాంగం సర్వసన్నద్ధంమవుతోంది. ఏడు జిల్లాలు.. 14 అసెంబ్లీ నియోజకవర్గాలు.. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల పరిధిలో ఉండే ఈ రెండు లోక్‌సభ నియోజకవర్గాలు... జిల్లాల పునర్విభజన తర్వాత ఏడు జిల్లాల పరిధిలోకి వచ్చాయి. వరంగల్ లోక్‌సభ స్థానం కింద వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. స్టేషన్‌ఘన్‌పూర్, వర్దన్నపేట అసెంబ్లీ స్థానాలు ఎస్సీలకు రిజర్వు చేయగా, మిగతా వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, పాలకుర్తి, పరకాల, భూపాలపల్లి జనరల్ స్థానాలుగా ఉన్నాయి. అదేవిధంగా మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, వరంగల్ రూరల్ జిల్లాల పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు మహబూబాబాద్ (ఎస్టీ) లోక్‌సభ స్థానం కింద ఉన్నాయి. ఇందులో నర్సంపేట జనరల్‌కు మినహాయిస్తే, డోర్నకల్, మహబూబాబాద్, ములుగు, ఇల్లందు, పినపాక, భద్రాచలం సెగ్మెంట్లు ఎస్టీలకు రిజర్వు చేయబడ్డాయి. 30.68 లక్షల మంది ఓటర్లు... ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్, మహబూబా బాద్ లోక్‌సభ స్థానాలు ఉండగా... వీటి పరిధిలో 30,67,684 మంది ఓటర్లు ఉన్నారు. వరంగల్ లోక్‌సభ స్థానం పరిధిలో 16,53,474 మంది ఓట ర్లు ఉండగా, ఇందులో పురుషులు 8,23,582 కాగా, మహిళలు 8,29,716, ఇతరులు 176 మం ది ఉన్నారు. మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో 14,14,210 మంది ఓటర్లు ఉండగా, 6,98,325 పురుషులు, 7,15,848 మహిళలు కాగా, ఇతరులు 37 మంది ఓటర్లుగా నమోదయ్యారు. ఈ రెండు స్థానాల్లోనూ మహిళా ఓటర్లే స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. ఇటీవల ఓటర్ల నమోదుకు అవకాశం ఇచ్చినప్పటికీ అంతగా మార్పు ఉండకపోవచ్చని అధికారులు చెప్తున్నారు. 3,577 పోలింగ్ కేంద్రాలు... రెండు లోక్‌సభ స్థానాల పరి«ధిలోని 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం 3,577 పోలింగ్ కేంద్రాలను అధికారులు గుర్తించారు. ఆయా పోలింగ్ కేంద్రాలలో గట్టి భద్రతా ఏర్పాట్లు చేసే విధంగా వరంగల్ అర్బన్, మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లు ప్రశాంత్ జీవన్ పాటిల్, సీహెచ్.శివలింగయ్య ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో సమన్వయం చేస్తున్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్‌తో కలిసి కలెక్టర్ జీవన్ పాటిల్ ఎన్నికల విధులు నిర్వహించే వివిధ శాఖల సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వరంగల్ లోక్‌సభ రిటర్నింగ్ అధికారిగా ప్రశాంత్ జీవన్ పాటిల్ వ్యవహరించనుండగా, వరంగల్ పశ్చిమకు ఆర్డీవో వెంకారెడ్డి, తూర్పునకు నగర కమిషనర్ రవికిరణ్, వర్ధన్నపేటకు వైవీ.గణేష్‌లను సహాయ రిటర్నింగ్ అధికారులుగా నియమించారు. ఇదే క్రమంలో శాసనసభ ఎన్నికల్లో నియమించిన సెక్టోరియల్, ఫ్లయింగ్ స్క్వాడ్లను తిరిగి పునరుద్ధరించారు. వాహనాల వినియోగం, ర్యాలీలు, సభల నిర్వహణకు ఆన్లైన్లో కనీసం 48 గంటల ముందు సువిధ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికార యంత్రాంగం ఇప్పటికే ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేస్తోంది. లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా సరే... సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. -
కదిలిన యంత్రాంగం
ఆదెమ్మ దిబ్బలో యథేచ్ఛగా గుడిసెల తొలగింపు ముళ్ల కంచెకు రంగులు పరిశీలించి, వివరాలు సేకరించిన అర్బ¯ŒS తహసీల్దార్ పోశయ్య విచారించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి : సీపీఎం సాక్షి, రాజమహేంద్రవరం : రాజమహేంద్రవరం నగరం నడిబొడ్డున ఆదెమ్మ దిబ్బ ప్రాంతంలోని రూ.100 కోట్ల విలువైన భూమిని కబ్జాదారులు నకిలీ డాక్యుమెంట్లతో కాజేసే ప్రక్రియను గత రెండు రోజులుగా ‘సాక్షి’ బహిర్గతం చేయడంతో ఎట్టకేలకు రెవెన్యూ యంత్రాంగంలో కదలిక వచ్చింది. సోమవారం అర్బ¯ŒS తహసీల్దార్ కె.పోశయ్య తన సిబ్బందితో కలిసి వెళ్లి ఆదెమ్మదిబ్బ ప్రాంతాన్ని పరిశీలించారు. స్థానికంగా ఉంటున్న పేదలను విచారించారు. వారు అక్కడ ఎన్నేళ్ల నుంచి ఉంటుంన్నారో అడిగి తెలుసుకున్నారు. ఈ స్థలం ఎవరిదనే కోణంలో ఆరా తీశారు. తాము గత 50 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని పేదలు తెలిపారు. తమలో కొంత మందికి వాంబే గృహాలు వచ్చినా తమ కుమారులు వారి కుంటుంబాలతో అక్కడ ఉంటున్నారని వివరించారు. చిన్న గృహాలు కావడంతో తాము ఇక్కడే గుడిసెల్లో ఉంటున్నామని పేర్కొన్నారు. తమలో చాలా మందికి వాంబే గృహాలు లేవని తహసీల్దార్‌కు చెప్పారు. ఇప్పుడు ఎవరో వచ్చి తాము ఈ స్థలం కొనుగోలు చేశామని చెబుతూ ఖాళీ చేయాలని చెబతున్నారని వాపోయారు. తమకు ఎలాంటి ఆధారం లేదని, తాతల కాలం నుంచి ఇక్కడే ఉంటున్నామని పలువురు విలపించారు. తమకు ఇక్కడే స్థలం కేటాయించి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని విన్నవించారు. అనంతరం గుడిసెలను తొలగిస్తున్న వారి నుంచి కూడా పోశయ్య వివరాలు సేకరంంచారు. ఎవరి దగ్గర, ఎప్పుడు కొన్నదీ అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు చూపించాలని ఆదేశించారు. యథేచ్ఛగా గుడిసెల తొలగింపు... అర్బ¯ŒS తహశీల్ధార్ పోశయ్య స్థలాన్ని పరిశీలించి వెళ్లిన తర్వాత కూడా 36వ డివిజ¯ŒS పరిధిలో ఉన్న గుడిసెలను యథేచ్ఛగా తొలగించారు. 30 మంది కూలీలతో ఈ తంతంగాన్ని గత రెండు రోజులుగా కొనసాగిస్తున్నారు. మొదట 38వ డివిజ¯ŒS పరిధిలోని 56 ఇళ్లను తొలగించిన వెంటనే ఈ విషయాన్ని ’సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. శనివారం తొలగించిన స్థలంలో రాత్రికి రాత్రే ముళ్ల కంచె వేశారు. తాము ఖాళీ చేయబోమన్న పేదల గుడిసెలను కలిపి దారిలేకుండా కంచె వేశారు. ఈ విషయాన్ని ’సాక్షి’ సోమవారం జిల్లా సంచికలో ప్రచురించింది. దీంతో రెవెన్యూ అధికారులు ఆదెమ్మదిబ్బ ప్రాంతాన్ని సందర్శించారు. రెవెన్యూ అధికారులు పరిశీలించి వెళ్లిన వెంటనే కబ్జాదారులు గుడిసెల తొలగింపు వ్యవహారాన్ని కొనసాగించడం గమనార్హం. విచారించి చట్ట ప్రకారం చర్యలు... ఆదెమ్మదిబ్బ స్థలం వ్యవహారంపై విచారించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అర్బ¯ŒS తహసీల్దార్ కె.పోశయ్య తెలిపారు. ఈ వ్యవహారంపై తహశీల్దార్ కార్యాలయంలో ఆయన ’సాక్షి’తో మాట్లాడుతూ ఆదెమ్మదిబ్బ స్థలం రెవెన్యూ సర్వే నంబర్ పరిధిలోకి రావడంలేదని, టౌ¯ŒS సర్వే నంబర్ పరిధిలోకి వస్తుందని చెప్పారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని నగరపాలక సంస్థ టౌ¯ŒS ప్లానింగ్ అధికారులను కోరినట్లు తెలిపారు. కోలమూరుకు చెందిన పిన్నమరెడ్డి ఈశ్వరుడు అనే వ్యక్తి తాను సత్యవోలు శేషగిరిరావు వద్ద ఈ స్థలం కొన్నానని చెబుతున్నారని, అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు చూపించాలని కోరినట్లు చెప్పారు. ఆదే స్థలంలో వాంబే గృహాలున్నాయని కూడా తమ పరిశీలనతో తెలిసిందని పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారించి స్థల వారసులు లేకపోతే బొనావెకెన్సియా చట్టం ప్రకారం స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. సత్యవోలు పాపారావు పేరుతో నగరంలో అనేక స్థలాలు ఇలాగే వివాదంలో ఉన్నాయని చెప్పారు. కొన్ని స్థలాలపై కోర్టుల్లో కేసులు నడుస్తున్నట్లు తెలిపారు. భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి : సీపీఎం ఆదెమ్మ దిబ్బ ప్రాంతంలోని 3.54 ఎకరాల వివాదస్పద స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సీపీఎం రాజమహేంద్రవరం జిల్లా కార్యదర్శి టి. అరుణ్ డిమాండ్ చేశారు. సోమవారం బాధితులను సీపీఎం నాయకులు పరామర్శించారు. ఈ భూమిని తనదేనని కోలమూరు ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఇక్కడ హల్చల్ చేస్తున్నాడని అన్నారు. ఇది ప్రభుత్వ భూమేనని బాధితులు చెబుతున్నారని, అసలు ఈ భూమి ఎవరిదో ప్రభుత్వం తేల్చాలని డిమాండ్ చేశారు.ఈ భూమి తనదేనని చెప్పుకుంటున్న వ్యక్తి శనివారం 38 వ డివిజ¯ŒS లోని 54 ఇళ్లును ఖాళీ చేయించాడు. అక్కడ కంచె కూడా నిర్మించాడు. 40 ఏళ్ళుగా జీవిస్తున్న తమను పొమ్మంటే ఎక్కడికి పోతామని బాధితులు ఇప్పర్తి సత్యవతి, డి. సుబ్బాయమ్మ ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. వివాదాస్పద ఈ స్థలాన్ని సీపీఎం నాయకులు డివిజ¯ŒS కార్యదర్వి ఎస్.ఎస్.మూర్తి, పోలిన వెంకటేశ్వరరావు, భీమేశ్వరరావు, జి.రవి, కె.రామకృష్ణ తదితరులు పరిశీలించారు. -
కృష్ణా నదిలో గుర్రెపు డెక్కతో అవస్థలు
విజయవాడ(వన్‌టౌన్) : కృష్ణానది ఎగువ నుంచి భారీగా గుర్రపుడెక్కా దుర్గాఘాట్ వైపు తోసుకొచ్చింది. దీంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. బుడమేరు నీటిని నదిలోకి వదలటంతో గుర్రపు డెక్కా భారీగా వచ్చింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ అదంతా దుర్గాఘాట్ వైపుకు రావటంతో అధికారులు దానిని తొలగించాలని ఆదేశించారు. మత్స్యశాఖ, నీటిపారదుల శాఖ, నగరపాలకసంస్థ సిబ్బంది తొలగించేందుకు చర్యలు తీసుకున్నారు. జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు దానిని పరిశీలించి సిబ్బందిని అప్రమత్తం చేశారు. గజ ఈతగాళ్లునుlరప్పించి గుర్రపు డెక్కాను ఘాట్లలోకి వెళ్లకుండా ఒడ్డుకు చేర్చారు. అనంతరం దానిని లారీలలో బయటకు తరలించారు. సుమారు 15 టన్నుల గుర్రపుడెక్కాను ప్రవాహం నుంచి తీసి బయటకు పంపినట్లు అధికారులు చెప్పారు. -
హెలెన్‌పై అధికారులను అప్రమత్తం చేశాం: రఘువీరా
హెలెన్ పెను తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లోని అధికారులను అప్రమత్తం చేసినట్లు రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి శుక్రవారం విజయవాడలో వెల్లడించారు. కృష్ణాజిల్లాలో 80 వేల మందిపై తుఫాన్ ప్రభావం ఉండే అవకాశం ఉందని తెలిపారు. అయితే హెలెన్ తుఫాన్ సహాయక చర్యల కోసం నిధుల విషయంలో అధికారులకు అన్ని అధికారాలు ఇచ్చినట్లు మంత్రి రఘువీరా రెడ్డి వెల్లడించారు. అయితే హెలెన్ తుఫాన్ కారణంగా జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు వెల్లడించారు. అలాగే జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. హెలెన్ తుపాన్ వల్ల ఎవరికి ఎటువంటి విపత్కర పరిస్థితి ఎదురైన వెంటనే 08672- 252572, 08672- 251077 నెంబర్లకు ఫోన్ చేయాలని ఆయన సూచించారు. తీర ప్రాంతంలోని ప్రజలకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అధికారులను అప్రమత్తం చేసినట్లు చెప్పారు. అలాగే తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు.