- అవినీతి వెనుక.. అసలు కథ ఇదీ!
- కాకినాడలోని రూ.కోట్ల విలువైన స్థలంపై కన్నేసిన ‘అధికార పెద్దలు’
- ఓ సొసైటీకి రిజిస్ట్రేష¯ŒS చేయించేందుకు యత్నాలు
- తెర వెనుక రాయలసీమ ‘ముఖ్య’మంత్రితో లాబీయింగ్
- ముందస్తు వ్యూహంలో భాగంగానే ఏసీబీకి జిల్లా రిజిస్ట్రార్
అలా జరిగింది..
Published Sun, Apr 16 2017 12:05 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM
(లక్కింశెట్టి శ్రీనివాసరావు)
అవినీతిపరుల గుండెల్లో ఏసీబీ రైళ్లు పరుగెత్తిస్తోంది. పలు శాఖల్లో లంచాలు తీసుకుంటూ పట్టుబడినవారి సంఖ్య జిల్లాలో రోజురోజుకూ పెరుగుతోంది. అయినా లంచావతారాల సంఖ్య ఎక్కడా తగ్గడం లేదు. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. కొన్ని కేసులలో నాణేనికి రెండోవైపు కనిపిస్తున్న కోణాలు విస్మయం కలిగిస్తున్నాయి. తాజాగా కాకినాడలో జిల్లా రిజిస్ట్రార్ బాలప్రకాష్ లంచం తీసుకుంటూ పట్టుబడిన కేసును లోతుగా పరిశీలిస్తే అనేక ఆసక్తికరమైన అంశాలున్నట్టుగా తేలింది. ఈ వ్యవహారం వెనుక ‘పెద్దల’ హస్తంతో పెద్ద కథే నడిచింది. ఆ కథ మీరూ చదవండి..
కాకినాడ అశోక్‌నగర్‌లో నిషేధ జాబితాలో ఉన్న స్థలం రిజిస్ట్రేష¯ŒS కోసం నో అబ్జెక్ష¯ŒS సర్టిఫికెట్ (ఎ¯ŒSఒసీ) ఇచ్చే విషయంలో రూ.40 వేలు లంచం తీసుకుంటుండగా జిల్లా రిజిస్ట్రార్ బాలప్రకాష్‌ను ఏసీబీ డీఎస్పీ ఎస్.సుధాకర్ వల వేసి పట్టుకున్న విషయం తెలిసిందే. ఆయనను కటకటాల వెనక్కి పంపి నాలుగు రోజులైంది. బాలప్రకాష్ లంచం తీసుకోవడం, ఏసీబీ వలపన్ని పట్టుకోవడం ఈ రెండూ నూరు శాతం నిజమే. ఈ తరహా లంచావతారాలను పట్టుకున్న ఏసీబీ అధికారుల చర్యలను ఎవరైనా స్వాగతించాలి్సందే. రిజిస్ట్రేష¯ŒS శాఖలో తిష్ట వేసిన అవినీతిపరుల గుండెల్లో ఏసీబీ కొంతలో కొంత మార్పు తీసుకువస్తే అంతకుమించి ఏం కావాలి? ఇదే పరిస్థితి మిగిలిన శాఖల్లో కూడా రావాలని ఎవరైనా కోరుకుంటారు. అయితే, బాలప్రకాష్ వ్యవహారంలో పైకి కనిపించినది నాణేనికి ఒకవైపు ఉన్న బొమ్మే. రెండోవైపు దాగి ఉన్న కథతో భారీ కమర్షియల్ సినిమానే తీయొచ్చు. ఈ కథకు స్క్రీ¯ŒSప్లే, దర్శకత్వం అంతా రాష్ట్రంలో అధికారం చలాయిస్తున్న ఒక బలమైన వర్గం చేతుల్లో రెండేళ్లుగా నడుస్తోంది. కృష్ణా జిల్లా మొదలు ఉభయ గోదావరి, ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా వరకు బ్రిటిష్ కాలం నుంచి వందల కోట్ల విలువైన ఆస్తులు (పాఠశాలలు, ఆస్పత్రులు, కాలేజీలు) పలు సంస్థల నిర్వహణలో ఉన్నాయి. అటువంటివి కాకినాడలో కూడా ఉన్నాయి. దశాబ్దాలుగా ఎటూ తేలకుండా ఉన్న ఆ ఆస్తులపై పాలకుల కన్నుపడింది. నిబంధనలకు విరుద్ధంగా సొసైటీలకు అడ్డగోలుగా రిజిస్ట్రేష¯ŒS చేయడం ద్వారా అధికార పార్టీకి చెందిన లాబీయిస్ట్‌లు ఆ ఆస్తులను చేజిక్కించుకుని, కోట్లు మూటగట్టుకోవాలని ప్లా¯ŒS వేశారు. ఇందులో భాగంగా కాకినాడలోని కోట్లాది రూపాయల విలువైన అశోక్‌నగర్ స్థలాన్ని సొసైటీకి రిజిస్టర్ చేయించే బాధ్యతను కృష్ణా జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఒక పెద్ద ముఠా భుజాన వేసుకుంది. అదేదో ఆ సంస్థలకు సేవ చేసేంతటి దానగుణంతో అనుకునేరు! దీని వెనుక కోట్లు చేతులు మారే డీల్ దాగి ఉంది. రాయలసీమకు చెందిన ఓ ‘ముఖ్య’ మంత్రితో అధికార పార్టీకి చెందిన ఆ బృందం లాబీయింగ్ జరిపింది. ఆ ‘ముఖ్య’ మంత్రికి ఎన్ని కోట్లు ఇవ్వడానికి ఒప్పందం కుదిరిందో ఇతమిత్థంగా తెలియరాలేదు. కానీ రిజిస్ట్రేష¯ŒS చేసేందుకు ధైర్యంగా ముందుకు వచ్చే కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో కీలక అధికారులకు మాత్రం రూ.15 కోట్ల ఆఫర్ ఇచ్చారు. ఈ కథా రచన, స్క్రీ¯ŒSప్లే రెండేళ్లుగా సాగుతోంది. ఆఫర్ బాగున్నా మిగిలిన గ్రూపుల నుంచి వచ్చిన బెదిరింపులతో ఈ రెండేళ్లలో ఎవరూ అందుకు సాహసం చేయలేకపోయారు.
తాజాగా ఏసీబీకి పట్టుబడ్డ బాలప్రకాష్‌పై కూడా ముఖ్యనేతలు, ముఖ్య అధికారుల నుంచి ఒత్తిళ్లు వచ్చినా భయంతో ఆయన కూడా తొలుత ముందడుగు వేయలేదు. ఒత్తిళ్లు పెరిగి, భయంతో పదేసి రోజులు సెలవుపై వెళ్లిపోయేవారు. బదిలీ కోసం ప్రయత్నం కూడా చేశారు. ఆయనను బదిలీ చేసేసి తమకు అనుకూలమైన అధికారిని నియమిద్దామంటే ‘పెద్దల’కు నిబంధనలు అడ్డువచ్చాయి. మరోపక్క ఉన్న గ్రూపుల బెదిరింపులతో జిల్లాలో ఉన్న కోట్ల విలువైన ఆ సంస్థ ఆస్తులను సొసైటీ పేరున రిజిస్ట్రేష¯ŒS చేయడానికి బాలప్రకాష్ కూడా భయపడ్డారు. ఈ పరిస్థితుల్లో చిలక్కొట్టుడుకు బుట్టలో పడిపోయే ఆయనకు ఆస్తులను చేజిక్కించుకోవాలనుకున్న బృందం ఎర వేసి, ఏసీబీకి పట్టించేసింది. రాయలసీమకు చెందిన ‘ముఖ్య’ మంత్రి అనుచరుడినంటూ మూడేళ్లుగా చలామణీ అవుతూ కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో చక్రం తిప్పుతోన్న లాబీయిస్ట్ ద్వారా ఈ మొత్తం కథ నడిపించారు. బాలప్రకాష్‌ను అడ్డుతొలగించుకున్న లాబీయిస్టులు తమ పని చక్కబెట్టుకునేందుకు రెండు మార్గాలు అన్వేషిస్తున్నారు. ఒకటి ఆయన స్థానంలో అనుకూల అధికారిని తెచ్చుకోవడం.. లేదా కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాలకు ఉన్న ఇద్దరు డీఐజీల్లో ఒకరిని ఇ¯ŒSచార్జిగా కొనసాగించి అనుకున్న పని పూర్తి చేయించుకోవడం.. ఈ రెండింటిలో ఏది చేయాలా అనేదానిపై తర్జనభర్జన పడుతున్నారు. నెల రోజుల్లో పదవీ విరమణ చేయనున్న ఆ ఉన్నతాధికారిని ఆరు నెలల క్రితం ఇక్కడ నియమించడం వెనుక సొసైటీ రిజిస్ట్రేష¯ŒS చేయించాలనే ముందస్తు వ్యూహం ఉంది. ఇందులో భాగంగానే జిల్లా రిజిస్ట్రేష¯ŒS కార్యాలయం సొసైటీల రిజిస్ట్రేష¯ŒS విభాగంలో సీనియర్లను కాదని జూనియర్లయిన తస్మదీయులను నియమించుకుని సిద్ధంగా కూడా ఉన్నారు. ఈ కథ కంచికి చేరాలంటే కాకినాడ çసహా పలు ప్రాంతాల్లో ఉన్న ఆ సంస్థల ఆస్తులు సొసైటీల పేరున రిజిస్ట్రేష¯ŒS జరగాలి కదా! ఇందుకోసం ‘ముఖ్య’ మంత్రి, ఆయన అనుచరగణం ఈ కథను కొత్తగా ఏ మలుపు తిప్పుతారో వేచి చూడాల్సిందే.
Advertisement