site issue
-
‘సీటు’ఫైట్!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఎన్నికలకు సమయం ఉన్నప్పటికీ కర్నూలు అసెంబ్లీ సీటు విషయంలో అధికార పార్టీలో పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, సీటు ఆశిస్తున్న టీజీ భరత్ పోటాపోటీగా సమావేశాలను నిర్వహిస్తున్నారు. ప్రతీ రోజూ ఏదో ఒక బూత్ కమిటీలతో టీజీ భరత్ సమావేశమవుతున్నారు. అంతేకాకుండా తనకే సీటు వస్తుందని... సీఎం చంద్రబాబు ఇంకా స్పందించలేదన్న విషయాన్ని వారికి గుర్తుచేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బరిలో ఉంటే తప్ప తాను కర్నూలు సీటు వదులుకునేది లేదని స్పష్టం చేస్తున్నారు. కేవలం మంత్రి లోకేష్ ప్రకటించిన మాత్రాన సీటు ఖరారు చేసినట్టు కాదని ఆయన అనుచరులు కూడా బయట ప్రచారం చేయడం ప్రారంభించారు. మరోవైపు ఎమ్మెల్యే ఎస్వీ వార్డుల్లో పర్యటిస్తుండగా.... ఇటు టీజీ భరత్ ప్రతీ రోజూ సాయంత్రం నియోజకవర్గంలోని పలు బూతు కమిటీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రధానంగా గతంలో తన తండ్రి టీజీ వెంకటేష్ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని పేర్కొంటున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఎవరికి సీటు వస్తుందనే విషయంపై అసలు చర్చించాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు వచ్చే సాధారణ ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ సీటుకు పోటీ చేయడం ఖాయమని టీజీ భరత్ తేల్చిచెబుతున్నారు. అయితే, ఎలా పోటీ చేస్తామన్న విషయంపై అప్పుడే చర్చలు, ఆందోళన అవసరం లేదని కూడా పేర్కొంటున్నారు. కేవలం తన వెంట నడిచేందుకే ప్రస్తుతానికి సిద్ధం కావాలని... సీటు విషయంపై అధికార తెలుగుదేశం పార్టీలో సర్వే చేసిన తర్వాతే అభ్యర్థిని ప్రకటిస్తారన్న అంశాన్ని విస్తృతంగా ఆయన ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరువురు నేతలు పోటాపోటీగా సమావేశాలు నిర్వహిస్తుండటం కర్నూలు అసెంబ్లీ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. పోటాపోటీగా...! ఒకవైపు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి వార్డు పర్యటనలను కొనసాగిస్తున్నారు. మరోవైపు టీజీ భరత్ వార్డుల వారీగా సమావేశాలను నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా అటువైపు ఎవరెవరు నేతలు, కార్యకర్తలు ఉన్నారనే అంశాన్ని ఇరువురు నేతలు వాకబు చేస్తున్నారు. తద్వారా అవతలి నేతలు, కార్యకర్తలను ఆకర్షించేందుకు ఇరువురు పోటీపడుతున్నారు. ప్రస్తుతానికి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా మంత్రి లోకేష్ కర్నూలు పర్యటనలో ప్రకటించినప్పటికీ... ఎన్నికల సమయం వచ్చే నాటికి కచ్చితంగా సర్వే ప్రకారమే అభ్యర్థులను ఖరారు చేస్తారని టీజీ భరత్ పేర్కొంటున్నట్టు తెలుస్తోంది. గతంలోనూ ఇదే తరహాలో సీట్లు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేస్తున్నారు. ఒకవేళ సీటు ఇవ్వకపోయినప్పటికీ తాను పోటీ చేసేది మాత్రం పక్కా అని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బలాన్ని మరింత పెంచుకునేందుకు తనవైపు వచ్చే నేతల వివరాలను ఆయన వార్డుల వారీగా సేకరిస్తున్నారు. ఆ నేతలతో మాట్లాడి... తన వెంట నడవాలని కోరుతున్నట్టు తెలుస్తోంది. ఇక మరోవైపు ఎమ్మెల్యే కూడా తనకు బలం ఉందని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అధికారపార్టీలో ఇలా ఇరువురు నేతల మధ్య బలాలప్రదర్వన కొనసాగుతోంది. అయితే, కర్నూలు నియోజకవర్గంలో మాత్రం ప్రధానంగా ప్రజలు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఆ పార్టీకి పట్టుగొమ్మలుగా ఉన్న మైనార్టీ వర్గాల ఓటు బలం ఎక్కువగా ఉండటంతో ఆ పార్టీకే తమ మద్దతు అని తేల్చిచెబుతున్నారు. -
అలా జరిగింది..
అవినీతి వెనుక.. అసలు కథ ఇదీ! కాకినాడలోని రూ.కోట్ల విలువైన స్థలంపై కన్నేసిన ‘అధికార పెద్దలు’ ఓ సొసైటీకి రిజిస్ట్రేష¯ŒS చేయించేందుకు యత్నాలు తెర వెనుక రాయలసీమ ‘ముఖ్య’మంత్రితో లాబీయింగ్ ముందస్తు వ్యూహంలో భాగంగానే ఏసీబీకి జిల్లా రిజిస్ట్రార్ (లక్కింశెట్టి శ్రీనివాసరావు) అవినీతిపరుల గుండెల్లో ఏసీబీ రైళ్లు పరుగెత్తిస్తోంది. పలు శాఖల్లో లంచాలు తీసుకుంటూ పట్టుబడినవారి సంఖ్య జిల్లాలో రోజురోజుకూ పెరుగుతోంది. అయినా లంచావతారాల సంఖ్య ఎక్కడా తగ్గడం లేదు. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. కొన్ని కేసులలో నాణేనికి రెండోవైపు కనిపిస్తున్న కోణాలు విస్మయం కలిగిస్తున్నాయి. తాజాగా కాకినాడలో జిల్లా రిజిస్ట్రార్ బాలప్రకాష్ లంచం తీసుకుంటూ పట్టుబడిన కేసును లోతుగా పరిశీలిస్తే అనేక ఆసక్తికరమైన అంశాలున్నట్టుగా తేలింది. ఈ వ్యవహారం వెనుక ‘పెద్దల’ హస్తంతో పెద్ద కథే నడిచింది. ఆ కథ మీరూ చదవండి.. కాకినాడ అశోక్‌నగర్‌లో నిషేధ జాబితాలో ఉన్న స్థలం రిజిస్ట్రేష¯ŒS కోసం నో అబ్జెక్ష¯ŒS సర్టిఫికెట్ (ఎ¯ŒSఒసీ) ఇచ్చే విషయంలో రూ.40 వేలు లంచం తీసుకుంటుండగా జిల్లా రిజిస్ట్రార్ బాలప్రకాష్‌ను ఏసీబీ డీఎస్పీ ఎస్.సుధాకర్ వల వేసి పట్టుకున్న విషయం తెలిసిందే. ఆయనను కటకటాల వెనక్కి పంపి నాలుగు రోజులైంది. బాలప్రకాష్ లంచం తీసుకోవడం, ఏసీబీ వలపన్ని పట్టుకోవడం ఈ రెండూ నూరు శాతం నిజమే. ఈ తరహా లంచావతారాలను పట్టుకున్న ఏసీబీ అధికారుల చర్యలను ఎవరైనా స్వాగతించాలి్సందే. రిజిస్ట్రేష¯ŒS శాఖలో తిష్ట వేసిన అవినీతిపరుల గుండెల్లో ఏసీబీ కొంతలో కొంత మార్పు తీసుకువస్తే అంతకుమించి ఏం కావాలి? ఇదే పరిస్థితి మిగిలిన శాఖల్లో కూడా రావాలని ఎవరైనా కోరుకుంటారు. అయితే, బాలప్రకాష్ వ్యవహారంలో పైకి కనిపించినది నాణేనికి ఒకవైపు ఉన్న బొమ్మే. రెండోవైపు దాగి ఉన్న కథతో భారీ కమర్షియల్ సినిమానే తీయొచ్చు. ఈ కథకు స్క్రీ¯ŒSప్లే, దర్శకత్వం అంతా రాష్ట్రంలో అధికారం చలాయిస్తున్న ఒక బలమైన వర్గం చేతుల్లో రెండేళ్లుగా నడుస్తోంది. కృష్ణా జిల్లా మొదలు ఉభయ గోదావరి, ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా వరకు బ్రిటిష్ కాలం నుంచి వందల కోట్ల విలువైన ఆస్తులు (పాఠశాలలు, ఆస్పత్రులు, కాలేజీలు) పలు సంస్థల నిర్వహణలో ఉన్నాయి. అటువంటివి కాకినాడలో కూడా ఉన్నాయి. దశాబ్దాలుగా ఎటూ తేలకుండా ఉన్న ఆ ఆస్తులపై పాలకుల కన్నుపడింది. నిబంధనలకు విరుద్ధంగా సొసైటీలకు అడ్డగోలుగా రిజిస్ట్రేష¯ŒS చేయడం ద్వారా అధికార పార్టీకి చెందిన లాబీయిస్ట్‌లు ఆ ఆస్తులను చేజిక్కించుకుని, కోట్లు మూటగట్టుకోవాలని ప్లా¯ŒS వేశారు. ఇందులో భాగంగా కాకినాడలోని కోట్లాది రూపాయల విలువైన అశోక్‌నగర్ స్థలాన్ని సొసైటీకి రిజిస్టర్ చేయించే బాధ్యతను కృష్ణా జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఒక పెద్ద ముఠా భుజాన వేసుకుంది. అదేదో ఆ సంస్థలకు సేవ చేసేంతటి దానగుణంతో అనుకునేరు! దీని వెనుక కోట్లు చేతులు మారే డీల్ దాగి ఉంది. రాయలసీమకు చెందిన ఓ ‘ముఖ్య’ మంత్రితో అధికార పార్టీకి చెందిన ఆ బృందం లాబీయింగ్ జరిపింది. ఆ ‘ముఖ్య’ మంత్రికి ఎన్ని కోట్లు ఇవ్వడానికి ఒప్పందం కుదిరిందో ఇతమిత్థంగా తెలియరాలేదు. కానీ రిజిస్ట్రేష¯ŒS చేసేందుకు ధైర్యంగా ముందుకు వచ్చే కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో కీలక అధికారులకు మాత్రం రూ.15 కోట్ల ఆఫర్ ఇచ్చారు. ఈ కథా రచన, స్క్రీ¯ŒSప్లే రెండేళ్లుగా సాగుతోంది. ఆఫర్ బాగున్నా మిగిలిన గ్రూపుల నుంచి వచ్చిన బెదిరింపులతో ఈ రెండేళ్లలో ఎవరూ అందుకు సాహసం చేయలేకపోయారు. తాజాగా ఏసీబీకి పట్టుబడ్డ బాలప్రకాష్పై కూడా ముఖ్యనేతలు, ముఖ్య అధికారుల నుంచి ఒత్తిళ్లు వచ్చినా భయంతో ఆయన కూడా తొలుత ముందడుగు వేయలేదు. ఒత్తిళ్లు పెరిగి, భయంతో పదేసి రోజులు సెలవుపై వెళ్లిపోయేవారు. బదిలీ కోసం ప్రయత్నం కూడా చేశారు. ఆయనను బదిలీ చేసేసి తమకు అనుకూలమైన అధికారిని నియమిద్దామంటే ‘పెద్దల’కు నిబంధనలు అడ్డువచ్చాయి. మరోపక్క ఉన్న గ్రూపుల బెదిరింపులతో జిల్లాలో ఉన్న కోట్ల విలువైన ఆ సంస్థ ఆస్తులను సొసైటీ పేరున రిజిస్ట్రేష¯ŒS చేయడానికి బాలప్రకాష్ కూడా భయపడ్డారు. ఈ పరిస్థితుల్లో చిలక్కొట్టుడుకు బుట్టలో పడిపోయే ఆయనకు ఆస్తులను చేజిక్కించుకోవాలనుకున్న బృందం ఎర వేసి, ఏసీబీకి పట్టించేసింది. రాయలసీమకు చెందిన ‘ముఖ్య’ మంత్రి అనుచరుడినంటూ మూడేళ్లుగా చలామణీ అవుతూ కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో చక్రం తిప్పుతోన్న లాబీయిస్ట్ ద్వారా ఈ మొత్తం కథ నడిపించారు. బాలప్రకాష్‌ను అడ్డుతొలగించుకున్న లాబీయిస్టులు తమ పని చక్కబెట్టుకునేందుకు రెండు మార్గాలు అన్వేషిస్తున్నారు. ఒకటి ఆయన స్థానంలో అనుకూల అధికారిని తెచ్చుకోవడం.. లేదా కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాలకు ఉన్న ఇద్దరు డీఐజీల్లో ఒకరిని ఇ¯ŒSచార్జిగా కొనసాగించి అనుకున్న పని పూర్తి చేయించుకోవడం.. ఈ రెండింటిలో ఏది చేయాలా అనేదానిపై తర్జనభర్జన పడుతున్నారు. నెల రోజుల్లో పదవీ విరమణ చేయనున్న ఆ ఉన్నతాధికారిని ఆరు నెలల క్రితం ఇక్కడ నియమించడం వెనుక సొసైటీ రిజిస్ట్రేష¯ŒS చేయించాలనే ముందస్తు వ్యూహం ఉంది. ఇందులో భాగంగానే జిల్లా రిజిస్ట్రేష¯ŒS కార్యాలయం సొసైటీల రిజిస్ట్రేష¯ŒS విభాగంలో సీనియర్లను కాదని జూనియర్లయిన తస్మదీయులను నియమించుకుని సిద్ధంగా కూడా ఉన్నారు. ఈ కథ కంచికి చేరాలంటే కాకినాడ çసహా పలు ప్రాంతాల్లో ఉన్న ఆ సంస్థల ఆస్తులు సొసైటీల పేరున రిజిస్ట్రేష¯ŒS జరగాలి కదా! ఇందుకోసం ‘ముఖ్య’ మంత్రి, ఆయన అనుచరగణం ఈ కథను కొత్తగా ఏ మలుపు తిప్పుతారో వేచి చూడాల్సిందే. -
కదిలిన యంత్రాంగం
ఆదెమ్మ దిబ్బలో యథేచ్ఛగా గుడిసెల తొలగింపు ముళ్ల కంచెకు రంగులు పరిశీలించి, వివరాలు సేకరించిన అర్బ¯ŒS తహసీల్దార్ పోశయ్య విచారించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి : సీపీఎం సాక్షి, రాజమహేంద్రవరం : రాజమహేంద్రవరం నగరం నడిబొడ్డున ఆదెమ్మ దిబ్బ ప్రాంతంలోని రూ.100 కోట్ల విలువైన భూమిని కబ్జాదారులు నకిలీ డాక్యుమెంట్లతో కాజేసే ప్రక్రియను గత రెండు రోజులుగా ‘సాక్షి’ బహిర్గతం చేయడంతో ఎట్టకేలకు రెవెన్యూ యంత్రాంగంలో కదలిక వచ్చింది. సోమవారం అర్బ¯ŒS తహసీల్దార్ కె.పోశయ్య తన సిబ్బందితో కలిసి వెళ్లి ఆదెమ్మదిబ్బ ప్రాంతాన్ని పరిశీలించారు. స్థానికంగా ఉంటున్న పేదలను విచారించారు. వారు అక్కడ ఎన్నేళ్ల నుంచి ఉంటుంన్నారో అడిగి తెలుసుకున్నారు. ఈ స్థలం ఎవరిదనే కోణంలో ఆరా తీశారు. తాము గత 50 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని పేదలు తెలిపారు. తమలో కొంత మందికి వాంబే గృహాలు వచ్చినా తమ కుమారులు వారి కుంటుంబాలతో అక్కడ ఉంటున్నారని వివరించారు. చిన్న గృహాలు కావడంతో తాము ఇక్కడే గుడిసెల్లో ఉంటున్నామని పేర్కొన్నారు. తమలో చాలా మందికి వాంబే గృహాలు లేవని తహసీల్దార్‌కు చెప్పారు. ఇప్పుడు ఎవరో వచ్చి తాము ఈ స్థలం కొనుగోలు చేశామని చెబుతూ ఖాళీ చేయాలని చెబతున్నారని వాపోయారు. తమకు ఎలాంటి ఆధారం లేదని, తాతల కాలం నుంచి ఇక్కడే ఉంటున్నామని పలువురు విలపించారు. తమకు ఇక్కడే స్థలం కేటాయించి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని విన్నవించారు. అనంతరం గుడిసెలను తొలగిస్తున్న వారి నుంచి కూడా పోశయ్య వివరాలు సేకరంంచారు. ఎవరి దగ్గర, ఎప్పుడు కొన్నదీ అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు చూపించాలని ఆదేశించారు. యథేచ్ఛగా గుడిసెల తొలగింపు... అర్బ¯ŒS తహశీల్ధార్ పోశయ్య స్థలాన్ని పరిశీలించి వెళ్లిన తర్వాత కూడా 36వ డివిజ¯ŒS పరిధిలో ఉన్న గుడిసెలను యథేచ్ఛగా తొలగించారు. 30 మంది కూలీలతో ఈ తంతంగాన్ని గత రెండు రోజులుగా కొనసాగిస్తున్నారు. మొదట 38వ డివిజ¯ŒS పరిధిలోని 56 ఇళ్లను తొలగించిన వెంటనే ఈ విషయాన్ని ’సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. శనివారం తొలగించిన స్థలంలో రాత్రికి రాత్రే ముళ్ల కంచె వేశారు. తాము ఖాళీ చేయబోమన్న పేదల గుడిసెలను కలిపి దారిలేకుండా కంచె వేశారు. ఈ విషయాన్ని ’సాక్షి’ సోమవారం జిల్లా సంచికలో ప్రచురించింది. దీంతో రెవెన్యూ అధికారులు ఆదెమ్మదిబ్బ ప్రాంతాన్ని సందర్శించారు. రెవెన్యూ అధికారులు పరిశీలించి వెళ్లిన వెంటనే కబ్జాదారులు గుడిసెల తొలగింపు వ్యవహారాన్ని కొనసాగించడం గమనార్హం. విచారించి చట్ట ప్రకారం చర్యలు... ఆదెమ్మదిబ్బ స్థలం వ్యవహారంపై విచారించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అర్బ¯ŒS తహసీల్దార్ కె.పోశయ్య తెలిపారు. ఈ వ్యవహారంపై తహశీల్దార్ కార్యాలయంలో ఆయన ’సాక్షి’తో మాట్లాడుతూ ఆదెమ్మదిబ్బ స్థలం రెవెన్యూ సర్వే నంబర్ పరిధిలోకి రావడంలేదని, టౌ¯ŒS సర్వే నంబర్ పరిధిలోకి వస్తుందని చెప్పారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని నగరపాలక సంస్థ టౌ¯ŒS ప్లానింగ్ అధికారులను కోరినట్లు తెలిపారు. కోలమూరుకు చెందిన పిన్నమరెడ్డి ఈశ్వరుడు అనే వ్యక్తి తాను సత్యవోలు శేషగిరిరావు వద్ద ఈ స్థలం కొన్నానని చెబుతున్నారని, అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు చూపించాలని కోరినట్లు చెప్పారు. ఆదే స్థలంలో వాంబే గృహాలున్నాయని కూడా తమ పరిశీలనతో తెలిసిందని పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారించి స్థల వారసులు లేకపోతే బొనావెకెన్సియా చట్టం ప్రకారం స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. సత్యవోలు పాపారావు పేరుతో నగరంలో అనేక స్థలాలు ఇలాగే వివాదంలో ఉన్నాయని చెప్పారు. కొన్ని స్థలాలపై కోర్టుల్లో కేసులు నడుస్తున్నట్లు తెలిపారు. భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి : సీపీఎం ఆదెమ్మ దిబ్బ ప్రాంతంలోని 3.54 ఎకరాల వివాదస్పద స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సీపీఎం రాజమహేంద్రవరం జిల్లా కార్యదర్శి టి. అరుణ్ డిమాండ్ చేశారు. సోమవారం బాధితులను సీపీఎం నాయకులు పరామర్శించారు. ఈ భూమిని తనదేనని కోలమూరు ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఇక్కడ హల్చల్ చేస్తున్నాడని అన్నారు. ఇది ప్రభుత్వ భూమేనని బాధితులు చెబుతున్నారని, అసలు ఈ భూమి ఎవరిదో ప్రభుత్వం తేల్చాలని డిమాండ్ చేశారు.ఈ భూమి తనదేనని చెప్పుకుంటున్న వ్యక్తి శనివారం 38 వ డివిజ¯ŒS లోని 54 ఇళ్లును ఖాళీ చేయించాడు. అక్కడ కంచె కూడా నిర్మించాడు. 40 ఏళ్ళుగా జీవిస్తున్న తమను పొమ్మంటే ఎక్కడికి పోతామని బాధితులు ఇప్పర్తి సత్యవతి, డి. సుబ్బాయమ్మ ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. వివాదాస్పద ఈ స్థలాన్ని సీపీఎం నాయకులు డివిజ¯ŒS కార్యదర్వి ఎస్.ఎస్.మూర్తి, పోలిన వెంకటేశ్వరరావు, భీమేశ్వరరావు, జి.రవి, కె.రామకృష్ణ తదితరులు పరిశీలించారు.