ademmadibba
-
సెంటు భూమి లేకుండానే స్టంటు
సాక్షి, రాజమహేంద్రవరం : రాజమహేంద్రవరం నగరంలో రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు తెలుగు తమ్ముడు చకచకా పావులు కదుపుతున్నాడు. అది ప్రభుత్వ స్థలమని తెలిసినా అధికారం అండతో చెలరేగిపోతున్నాడు. కంచె వేసిన స్థలం సత్యవోలు పాపారావు కుమారుడు శేషగిరిరావుదంటూ బోర్డులు పెట్టారు. సర్వే నంబర్ 730/2సీ2లోని ప్రైవేటు స్థలంతోపాటు మరికొందరి స్థలాలు ప్రభుత్వం నగరపాలక సంస్థ పాఠశాల నిమిత్తం సేకరించిందని ‘సాక్షి’ సాక్ష్యాధారాలతో సహా వరుస కథనాలతో బయటపెట్టింది. ఇందులో సర్వే నం.730/2సీ2లో సత్యవోలు పాపారావు, అతని తమ్ముడు లింగమూర్తి సత్యవతి దంపతులకు చెందిన 3.69 ఎకరాలకు కూడా నోటిఫికేష¯ŒS జారీ చేసింది. సత్యవోలు సత్యవతి హైకోర్టును ఆశ్రయించడంతో వారి స్థలం 1.81 ఎకరాలు మినహా సత్యవోలు పాపారావు అతని కుమారులకు చెందిన 1.88 ఎకరాకు 1985 జూలై 30వ తేదీన అవార్డు (నంబర్ 6/85) ప్రకటించి, వారి తాలూకు ఎవ్వరూ రాకపోవడంతో రాజమండ్రి సబార్డినేట్ జడ్జి వద్ద జమ చేసింది. పాపారావుకు భూమి ఎక్కడ ఉంది? రికార్డుల్లో 4.29 ఎకరాల భూమి ఉన్నా క్షేత్రస్థాయిలో మాత్రం అంత లేదు. సత్యవోలు పాపారావు, అతని తమ్ముడు లింగమూర్తి భార్య సత్యవతి 1950లో పంచుకునేందుకు జరిపిన సర్వేలో అక్కడ 3.54 ఎకరాలుంది. 1979లో ప్రభుత్వం సేకరించేందుకు చేసిన సర్వేలో 3.69 ఎకరాల భూమి ఉంది. ఇందులో సత్యవోలు పాపారావు అతని నలుగురు కుమారుల భూమి 1.81 ఎకరా సేకరించి అవార్డు కూడా ప్రకటించింది. సత్యవోలు సత్యవతి భూమి మాత్రం హైకోర్టు స్టే విధించడంతో సేకరణ నుంచి మినహాయించుకుంది. అయితే తాజాగా సత్యవోలు పాపారావు కుమారుల్లో ఒకరైన సత్యవోలు శేషగిరిరావు పేరిట సర్వే నంబర్ 730/2సీ2 స్థలంలో ఆ భూమి తమదేనంటూ బోర్టులు పెట్టారు. ప్రభుత్వం సేకరించకముందు అది సత్యవోలు పాపారావు కుమారులదే. కానీ 1985లో సేకరణ అనంతరం అవార్డు ప్రకటించిన తర్వాత సత్యవోలు పాపారావు అతని కుమారులకు అక్కడ సెంటు భూమి లేదు. ఉన్న భూమి సత్యవోలు సత్యవతి, ప్రభుత్వానిది. అయితే ఆ భూమి తాను కొనుగోలు చేశానంటూ తెలుగుదేశం పార్టీ నేత రాజమహేంద్రవరం రూరల్ మండలం కోలమూరు గ్రామ జన్మభూమి కమిటీ సభ్యుడు అక్కడ 50 ఏళ్లుగా ఉంటున్న పేదలను ఖాళీ చేయించి అమ్మేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ సర్వే ప్రకారం 3.69 ఎకరాలు వీరభద్రపురం మున్సిపల్ హైసూ్కల్ నిర్మాణం కోసం అప్పటి కమిషనర్ విజ్ఞప్తి మేరకు సబ్‌కలెక్టర్ కార్యాలయం ఆదెమ్మ దిబ్బ ప్రాంతంలోని సర్వే నంబర్లు 724/1డీ, 725/3ఏ,725/3ఈ, 730/2సీ2, 731/2లలో మొత్తం 5.87 ఎకరాలు సేకరించేందుకు సమాయత్తమైంది. మొత్తం భూమిలో సత్యవోలు కుటుంబానిదే సింహభాగం. సర్వే నంబర్ 730/2సీ2లో సత్యవోలు పాపారావు, అతని తమ్ముడు లింగమూర్తి సత్యవతి దంపతుల భూమి.3.69 ఎకరాలుగా పేర్కొంది. 1979 జూలై 20వ తేదీన డ్రాఫ్ట్ నోటిఫికేష¯ŒS జారీ చేసింది. 1985లో అప్పటి సబ్‌కలెక్టర్ ప్రదీప్‌చంద్ర అవార్డు ప్రకటించేందుకు ముందే సత్యవోలు సత్యవతి తరఫున వారి కుమారులు హైకోర్టును ఆశ్రయించారు. తమ భూమిని సేకరణ నుంచి మినహాయించేలా పిటీష¯ŒS వేయడంతో 1984 నంబర్ 5వ తేదీన కోర్టు స్టే విధించింది. సత్యవోలు పాపారావు వాటా 1.81 ఎకరాకు మిగిలిన వారితోపాటు అవార్డు ప్రకటించింది. మొత్తంమీద వివిధ కోర్టు తీర్పులు, ప్రభుత్వ సేకరణ ఉపసంహరణ తర్వాత ప్రభుత్వం నోటిఫికేష¯ŒS జారీ చేసిన 5.87 ఎకరాలకుగాను 3.80 ఎకరాలు సేకరించింది. ఈ కేసులు 2001లో పూర్తవడంతో 2003లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఈ స్థలంలో వాంబే గృహాలు కట్టేందుకు నిర్ణయించింది. ఏ నుంచి జీ వరకు బ్లాక్‌లను నిర్మించాలని నిర్ణయించి 2003లో ఏ బ్లాక్ నిర్మాణం ప్రారంభించింది. అసలు సర్వే నం. 730/2సీ2లో స్థలం ఎంత? టౌ¯ŒS సర్వే నంబర్ 730/2సీ2లో రికార్డుల ప్రకారం సత్యవోలు పాపారావు, అతని తమ్ముడు లింగమూర్తి దంపతులకు 4.29 ఎకరాల భూమి ఉంది. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం రికార్డుల్లో ఉన్న భూమి లేదు. 1950 మే నెల 15వ తేదీన సత్యవోలు పాపారావు, అతని తమ్ముడు భార్య సత్యవతి ఆ భూమిని పంచుకున్నారు. ఇందు కోసం ఉమ్మడిగా సర్వే జరిపించారు. ఇందులో సర్వే నంబర్ 730/2సీ2(అప్పట్లో 730)లో రికార్డుల ప్రకారం 4.29 ఎకరాలున్నా క్షేత్రస్థాయిలో మాత్రం 3.54 ఎకరాలుగా ఉంది. దీనిని ఇద్దరు సమానంగా పంచుకున్నారు. మున్సిపల్ సర్వేయర్ కూడా 2010లో సర్వే చేసి హద్దులు నిర్ణయించారు. -
ఎట్టకేలకు కదిలారు
ఆదెమ్మదిబ్బ కబ్జాపై స్పందించిన అధికారులు కంచె వేసిన కొద్ది ప్రాంతంలో హెచ్చరిక బోర్డు హోలీ ఏంజెల్స్ స్కూల్ ప్రాంతం కార్పొరేష¯ŒSదంటూ వివరణ సాక్షి, రాజమహేంద్రవరం : నగరంలోని కంబాల చెరువు సమీపంలో రూ.100 కోట్ల విలువైన ఆదెమ్మదిబ్బ ప్రాంతంలో ప్రైవేటు వ్యక్తుల భూ కబ్జాపై నగరపాలక సంస్థ అధికారులు ఎట్టకేలకు స్పందించారు. ఆ స్థలం తాను కొనుగోలు చేశానంటూ కోలమూరుకు చెందిన తెలుగుదేశం పార్టీ నేత పిన్నమరెడ్డి ఈశ్వరుడు.. 50 ఏళ్లుగా అక్కడ ఉంటున్న పేదలను ఖాళీ చేయించడంపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. సర్వే నంబర్–730లోని స్థలం ప్రైవేటు వ్యక్తులదంటూ అధికారులు కూడా పేర్కొన్నారు. అయితే ఇది ప్రభుత్వం సేకరించిందా? లేదా? అన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. దీనిపై సత్యవోలు పాపారావు కుమారుల్లో ఒకరైన సత్యవోలు శేషగిరిరావు విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి ఆ స్థలం తమదేనని పేర్కొన్నారు. ‘సాక్షి’ తనవద్ద ఉన్న ఆధారాలతో ప్రశ్నించగా.. ఆ భూమిని తాము ప్రభుత్వ సేకరణకు ఇవ్వలేదని తోసిపుచ్చారు. ప్రభుత్వం తమ పినతండ్రి సత్యవోలు లింగమూర్తి, సత్యవతి దంపతుల వాటా సేకరించిందని చెప్పారు. మొత్తం స్థలం 4 ఎకరాల 19 సెంట్లు కాగా.. తన తండ్రి పాపారావు 2 ఎకరాల 23 సెంట్లు, తన పిన్నమ్మ సత్యవతి ఎకరా 96 సెంట్ల లెక్కన పంచుకున్నారని చెప్పారు. తమ స్థలం పిన్నమరెడ్డి ఈశ్వరుడికి అభివృద్ధి నిమిత్తం ఇచ్చామని చెప్పుకొచ్చారు. ఓవైపు ఈ స్థలంపై అనేక ఆరోపణలు వస్తూండగా పిన్నమరెడ్డి ఈశ్వరుడు మాత్రం తమ పని కానిచ్చేశారు. పేదలను ఖాళీ చేయించి కంచె వేశారు. పనిలో పనిగా సర్వే నంబర్–725/3ఎ లోని హోలీ ఏంజెల్స్ స్కూల్ వెనుక, పక్కన గుడిసెలు వేసుకుని నివసిస్తున్న పేదలను కూడా ఖాళీ చేయించి, అక్కడ కూడా కంచె వేశారు. దీనిపై గత డిసెంబర్ 26న ‘భూమంత్రం’ శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురించింది. నెల రోజుల తర్వాత మేల్కొన్న అధికారులు తాజాగా ఆ స్థలం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థదేనంటూ హోలీ ఏంజెల్స్ స్కూల్ పక్కన, వెనుక బోర్డులు పెట్టారు. ఆ స్థలం ఆక్రమించిన వారు శిక్షార్హులంటూ పిన్నమరెడ్డి ఈశ్వరుడు వేసిన కంచెకు హెచ్చరిక ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే, మిగిలిన ప్రాంతంపై అధికారులు ఇంకా స్పష్టతనివ్వలేదు. -
‘తెర’ పడేదెప్పుడు?
ఆదెమ్మదిబ్బ స్థలంపై వీడని చిక్కుముడి తాను కొనుగోలు చేశానన్న పిన్నమరెడ్డి ఈశ్వరుడు అమ్మిందీ లేదు.. కొన్న లేదన్న ‘సాక్షి’ చివరకు తెరపైకి సత్యవోలు శేషగిరిరావు తాము అభివృద్ధి చేయిస్తున్నామంటూ వివరణ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు చూపని వైనం రాజమహేంద్రవరంలో రూ.కోట్ల విలువచేసే ఆదెమ్మదిబ్బ ప్రాంతంపై 20 రోజులుగా నగరంతోపాటు జిల్లా వ్యాప్తంగా ప్రజలు, అధికారుల్లో చర్చ సాగింది. తాజాగా సత్యవోలు శేషగిరిరావు ఈ స్థలం తనదంటూ విలేకర్ల సమావేశంలో చెప్పిన పలు వివరాలు స్థల యాజమాన్య హక్కుపై మరింత చిక్కుముడికి దారితీశాయి. – సాక్షి, రాజమహేంద్రవరం గత ఇరవై రోజులుగా ఆదెమ్మదిబ్బ స్థలంలో ఉన్న 110 మంది పేదలను ఖాళీ చేయించడం, వారికి నగదు ముట్టజెప్పడంతో దీనిపై అనేక అనుమానాలు రేకెత్తాయి. యాబై, ఆరవై ఏళ్లుగా అక్కడ ఉంటున్న పేదలను ఇప్పటికిప్పుడు ఎవరో వచ్చి ఈ స్థలం ఖాళీ చేయాలని ఆదేశించడంతో కొందరు పేదలు మీడియాను ఆశ్రయించారు. తాము ఎన్నో ఏళ్లుగా ఈ స్థలంలో ఉంటున్నామని, ఇప్ప డు ఎవరో వచ్చి ఖాళీ చేయాలని చెబుతున్నారని వాపోయారు. ఈ వ్యవహారాన్ని ఈ నెల 11వ తేదీన ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. అనంతరం వరుస కథనాలు ప్రచురించింది. 13వ తేదీ అర్బ¯ŒS తహసీల్దార్ కె.పోసయ్య స్థలా న్ని పరిశీలించారు. అక్కడ ఉన్న పేదలతో మాట్లాడారు. తమకు ఇళ్లు లేవని ఇక్కడే స్థలం ఇవ్వాలని పేదలు తహసీల్దార్‌కు విన్నవించారు. అదే విధంగా తహసీల్దార్ పోసయ్య అక్కడ గుడిసెలు ఖాళీ చేయిస్తున్న వ్యక్తిని ఈ వ్యవహారంపై ప్రశ్నిం చారు. అదే రోజు తహసీల్దార్ పోసయ్య ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఆదెమ్మదిబ్బ స్థలం కోలమూరుకు చెందిన పిన్నమరెడ్డి ఈశ్వరుడు అనే వ్యక్తి సత్యవోలు పాపారావు కుమారుడు సత్యవోలు శేషగిరిరావు వద్ద కొనుగోలు చేశారని తనకు చెప్పారని పేర్కొన్నారు. అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు చూపించాలని అడగ్గా సాయంత్రం లేదా మరుసటి రోజు తీసుకుని వచ్చి చూపిస్తానన్నారని వివరించారు. మరుసటి రోజు నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, సీపీఎం నేతలు ఆ స్థలాన్ని పరిశీలించగా తాను ఈ స్థలం కొనుగోలు చేశానని వారితో పిన్నమరెడ్డి ఈశ్వరుడు పేర్కొన్నారు. వారికి కూడా డాక్యుమెంట్లు చూపిస్తానని చెప్పడడంతో వారు వెనుదిరిగారు. వారం రోజులు గడుస్తున్నా డాక్యుమెంట్లు అధికారులకు, రాజకీయ పార్టీల నేతలకు చూపించలేదు. దీనిపై ఈ నెల 21న ‘కొన్నది లేదు.. అమ్మిందీ లేదు’ అన్న శీర్షికన పలు ప్రశ్నలు సందిస్తూ ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీంతో ఆ స్థలం సత్యవోలు పాపారావుదంటూ అక్కడ ఫ్లెక్సీపై రాయించి పెట్టారు. ఎవరి స్థలం సేకరించారు? ఫ్లెక్సీ పెట్టిన అనంతరం అక్కడ ఇళ్లను తొలగించడం కొనసాగించారు. అక్కడ నివసిస్తున్న పేదలకు పలు రకాల ప్రలోభాలు పెట్టడంపై కూడా ‘సాక్షి’ కథనాలు ప్రచురించింది. దీంతో సోమవారం సత్యవోలు పాపారావు కుమారుడు సత్యవోలు శేషగిరిరావు విలేకర్ల సమావేశం నిర్వహించి ఆదెమ్మదిబ్బ ప్రాంతంలోని సర్వే నంబర్ 730లో 4.19 ఎకరాల స్థలం తమ కుటుంబానిదని పేర్కొన్నారు. తన తండ్రి సత్యవోలు పాపారావు రెండు ఎకరాల 23 సెంట్లు, తన పినతండ్రి సత్యవోలు లింగమూర్తి ఎకరా 96 సెంట్లు లెక్కన పంచుకున్నారని వివరించారు. ఈ స్థలాన్ని అభివృద్ధి చేయాలని అక్కడ ఉన్న ఆక్రమణదారులను ఖాళీ చేయిస్తున్నామని చెప్పారు. అయితే 1985లో ప్రభుత్వం పలు సర్వే నంబర్లలో దాదాపు 5 ఎకరాలు 20 సెంట్లు సేకరించింది. ఇందులో సర్వే నంబర్ 730లో సత్యవోలు లింగమూర్తి, సత్యవోలు పాపారావు కుంటుంబాలకు చెందిన సుమారు 3 ఎకరాల 25 సెంట్లు కూడా ఉంది. సేకరణ చేసిన భూమికి సంబంధించిన అవార్డును ప్రభుత్వం కొంతమందికి చెల్లించగా మరికొంత మంది అవార్డును కోర్టులో డిపాజిట్ చేసింది. అయితే సర్వే నంబర్ 730లో సేకరించిన భూమి, అవార్డుపై సత్యవోలు శేషగిరిరావు విలేకర్ల సమావేశంలో భిన్నరకాల సమాధానాలు ఇచ్చారు. ప్రభుత్వం తమ భూమి సేరించిందని ఒకసారి, అది తమ పనితండ్రి వాటా అని మరోసారి, తమ వాటా అవార్డు తీసుకోలేదని, అస్సలు తమకు అవార్డుతో సంబంధంలేదని, ప్రభుత్వం నచ్చినట్లు రాసుకుందని, మరోసారి నగదులేక కోర్టులో జమ చేయలేదని, అవార్డు రద్దు చేశారని ఇలా పొంతనలేని సమాధానాలు ఇచ్చారు. చివరగా ఈ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు జిల్లా జాయింట్ కలెక్టర్, రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్, అర్బ¯ŒS తహసీల్దార్‌కు చూపించామని, డాక్యుమెంట్ల నకళ్లు కూడా ఇచ్చామని పేర్కొన్నారు. మీడియాకు కూడా డాక్యుమెంట్ల నకళ్లు ఇస్తామని విలేకర్ల సమావేశంలో పలుమార్లు చెప్పినా చివరకు ఇవ్వకుండానే ముగించారు. ఈ స్థలం సత్యవోలు పాపారావు, లింగమూర్తికి చెందినది అని అధికారులు పేర్కొన్నా అందులో ఎవరి స్థలం ప్రభుత్వం సేకరించిందన్న దానిపై సందిగ్ధం నెలకొంది.