సాక్షి, విజయవాడ: టీడీపీ ఎంపీ కేశినేని నాని కార్యాలయం వద్ద ఆయన బాబాయ్ నాగయ్య ఆందోళన చేపట్టారు. కేశినేని నాని తన ఆస్తి కాజేయాలని చూస్తున్నాడని నాగయ్య ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే కేశినేని నాని కార్యాలయం పక్కనే నాగయ్య ఇంటి నిర్మాణం చేసుకుంటున్నాడు. ఆ భవన నిర్మాణం అక్రమమంటూ ఎంపీ నాని కార్పొరేషన్‌తో నోటీసులు ఇప్పించాడని నాగయ్య తెలిపారు. కేశినేని నాని దుర్మార్గుడు.. తన సంతకం ఫోర్జరీ చేసి ఆస్తి కాజేసేందుకు కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు. తనకు అన్యాయం జరిగితే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. పోలీసులు, అధికారులు తన గోడును పట్టించుకోవడం లేదంటూ నాగయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment