graduate mlc candidate
-
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బ్లాక్ మెయిలర్: గాదరి కిషోర్
హైదరాబాద్: ఎల్లుండి (సోమవారం) జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైదరాబాద్‌లో ఉండే నల్గొండ పట్టభద్రులు వెళ్లి ఓటు వేయాలని బీఆర్ఎస్ నేత గాదరి కిషోర్ కుమార్ కోరారు. ఆయన శనివారం తెలంగాణ భవన్లో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బ్లాక్ మెయిలర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక మొత్తం ఇలాగే ఉంది. వందలాది కేసులు ఉన్న వ్యక్తి మల్లన్న. బ్లాక్ మెయిల్ కేసులు ఉన్నాయి. రేవంత్‌రెడ్డి సీఎం అవ్వగానే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు నియామక పత్రాలు ఇచ్చి, మేమే ఇచ్చినం అని గొప్పలు చెప్పుకుంటున్నారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. చేసింది చెప్పుకోలేక మేము ఓడిన వాతావరణం కనిపించింది. ఏదైనా అడిగితే దేవుళ్ళ మీద ఒట్లు పెట్టడం తప్ప చేసిందేమీ లేదు. రైతు బంధు ఇవ్వలేదు, సన్నవడ్లకు రూ.500 బోనస్ ఇస్తాం అంటున్నారు. మేనిఫెస్టోలో అన్ని రకాల వడ్లకు రూ. 500 ఇస్తామన్నారు. రైతు రుణమాఫీ ఇద్దరు భార్యాభర్తలకు కలిపి రెండు లక్షలు చేస్తామని ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు. మళ్ళీ కథ మొదటికి వచ్చింది. మోసపూరిత మాటలతో ప్రజల్ని మభ్య పెడుతున్నారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడారు కాంగ్రెస్ నాయకులు’’ అని గాదరి కిషోర్ మండిపడ్డారు. -
వైవీయూ అధ్యాపకుల మద్దతు కోరిన గోపాల్ రెడ్డి
వైవీయూ: పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేస్తున్న వెన్నపూస గోపాల్‌రెడ్డి శనివారం వైవీయూకు వచ్చారు. వైవీయూలోని అన్ని విభాగాలను సందర్శించి అధ్యాపక బృందాలతో సమావేశమై తనకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షుడుగా తాను చేసిన సేవలను వివరించి రానున్న గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మద్దతు ప్రకటించాలని కోరారు. ఈయన వెంట ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం నాయకులు పీఎస్. ఓబులరావు, అశోక్‌కుమార్‌రెడ్డి, వెన్నపూస రవీంద్రారెడ్డి, భాస్కర్‌రెడ్డి, వైవీయూ అధ్యాపకులు పాల్గొన్నారు.