బీఆర్‌ఎస్‌లో మూడు ముక్కలాట..
బీజేపీలో నాలుగు ముక్కలాట: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్
సాక్షి, హైదరాబాద్: రా ష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించటంలో బీఆర్ ఎస్, బీజేపీలు విఫలమ య్యాయని పీసీసీ అధ్య క్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ విమర్శించారు. బీ ఆర్‌ఎస్ పార్టీలో మూ డు ముక్కలాట, బీజేపీ లో నాలుగు ముక్కలా ట నడుస్తున్నదని ఎద్దే వా చేశారు. ‘కుర్చీ కా వాలని కేసీఆర్ కుమార్తె కవిత అడుగుతోంది. కాదు నాకే కావాలని కుమారుడు కేటీఆర్ అంటున్నారు. ఈ ఇద్దరి మధ్య ఏదైనా జరిగితే కుర్చీ లాక్కోవాలని హరీశ్‌రావు చూస్తున్నారు. ఇక, బీజేపీలో కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఉత్తర, దక్షిణ ధృవాలుగా పనిచేస్తున్నారు. ఈటల రాజేందర్ తూర్పు చూస్తుంటే, డి.కె.అరుణ పడమర చూస్తున్నా రు’ అని ఎద్దేవా చేశారు.
శనివారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీ డియాతో మాట్లాడుతూ.. వచ్చే సాధారణ ఎన్నికల నాటికి తెలంగాణ రా జకీయ ముఖచిత్రం నుంచి బీఆర్‌ఎస్ కనిపించకుండా పోతుందని చెప్పా రు. ఆ పార్టీ నుంచి చాలా మంది తమతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. 8 మంది ఎంపీలను గెలిపిస్తే బీజేపీ నేతలు రాష్ట్రానికి ఎన్ని నిధులు తెచ్చా రని ప్రశ్నించారు. తాము కేటీఆర్ అరెస్టు కోసం గవర్నర్ అనుమతి కోరిన ప్పటికీ ఎందుకు అనుమతి రావడం లేదో బీజేపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. తనకు మంత్రివర్గంలో చేరాలనే ఆలోచన ఎప్పుడూ లేదని అ న్నారు.
ఎస్సీ వర్గీకరణ విషయంలో ఏఐసీసీ నిర్ణయమే ఫైనల్ అని స్పష్టంచేశారు. సమగ్ర సర్వే గణాంకాల ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్లు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. పాలమూరు వీర పాట విడుదల: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్స రం పూర్తయిన సందర్భంగా సీఎం రేవంత్‌పై రూపొందించిన ‘పాలమూ రు వీర’ అనే పాటను మహేశ్‌గౌడ్ శనివారం అసెంబ్లీ అవరణలో ఆవిష్క రించారు. నిర్మాత యుగంధర్‌గౌడ్ ఆధ్వర్యంలో కవి రేలారే ప్రసాద్ రచించిన ఈ గీతం అద్భుతంగా ఉందని ఆయన ప్రశంసించారు. ఈ గీతానికి కళ్యాణ్ సంగీతం అందించగా, ఎంఎల్‌ఆర్ కార్తికేయ ఆలపించారు.
Comments
Please login to add a commentAdd a comment