వ్యవసాయాన్ని పండుగ చేశాం! | TPCC President Mahesh Goud Guest Column On Farming | Sakshi
Sakshi News home page

వ్యవసాయాన్ని పండుగ చేశాం!

Published Mon, Dec 2 2024 8:32 AM | Last Updated on Mon, Dec 2 2024 8:32 AM

TPCC President Mahesh Goud Guest Column On Farming

అన్నదాత కష్టాలను క్షేత్రస్థాయిలో కళ్లారా చూసి చలించిన కాంగ్రెస్, 2022 మేలో వరంగల్‌ సభలో రాహుల్‌ గాంధీ నేతృత్వంలో ‘రైతు డిక్లరేషన్‌’ వెలువ రించింది. అందుకు అనుగుణంగానే బడ్జెట్‌లో వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు పెద్దపీట వేస్తూ రూ. 72,659 కోట్లు కేటాయించింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ‘రుణమాఫీ’ పథకానికి అధిక ప్రాధాన్యమిచ్చింది. మొత్తం మూడు విడతలలో 22,37,848 మంది రైతులకు రూ. 17,933.18 కోట్లను విడుదల చేసింది. తాజాగా నాలుగో విడత రుణమాఫీగా మరో రూ.2,747.67 కోట్లు అందించింది. అలా ఇచ్చిన మాటకు కాంగ్రెస్‌ కట్టుబడుతుందని రుజువు చేసింది. రైతులకు వ్యవసాయాన్ని పండుగ చేయడం జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు ఏదో ఒక అంశాన్ని లేవనెత్తుతూ నానా యాగీ చేస్తున్నాయి.

దేశాభివృద్ధికి బడా వ్యాపారస్తుల కంటే రైతులే కీలకమని విశ్వసించే కాంగ్రెస్‌... అన్న దాతల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఎన్నో ఆశలతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో అన్నిరంగాల్లో దగా పడింది. రాష్ట్రానికి వెన్నెముక లాంటి రైతులను కేసీఆర్‌ సర్కార్‌ పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో వ్యవసాయ రంగం కుదేలైంది. రైతులు కష్టాల సుడిగుండంలో చిక్కుకొని ఎన్నో ఇబ్బందులు ఎదు ర్కొంటున్నా... అప్పటి సీఎం కేసీఆర్‌ మాయమాటలతో అరచేతిలో స్వర్గం చూపించారు. అన్నదాత కష్టాలను క్షేత్రస్థాయిలో కళ్లారా చూసి చలించిన కాంగ్రెస్, వారి కన్నీటిని తుడవాలనే లక్ష్యంతో 2022 మేలో వరంగల్‌ వేదికగా పార్టీ అధినేత రాహుల్‌ గాంధీ నేతృత్వంలో పలు సంక్షేమ పథకాలతో ‘రైతు డిక్లరేషన్‌’ ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే వ్యవసాయ రంగానికి రూ. 54,280 కోట్లు ఖర్చు చేసి తమది రైతు ప్రభుత్వం అని నిరూపించుకుంది.

రైతులు సిరిసంపదలతో ఆనందంగా ఉంటేనే సమాజంలో సుఖ సంతోషాలు వెల్లివిరిస్తాయనేది కాంగ్రెస్‌ విశ్వాసం. అందుకే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడగానే వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తామని వరంగల్‌ డిక్లరేషన్‌లో ప్రకటించాం. రూ. 2 లక్షల రైతు రుణమాఫీ, ఏడాదికి ఎకరాకు రూ. 15 వేల ‘ఇందిరమ్మ భరోసా’, అన్ని పంట లనూ సరైన మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేయడం, వివిధ కారణాలతో నష్టపోయే పంటలకు తక్షణం నష్టపరిహారం చెల్లించడం, పంటల బీమా పథకం వర్తింపు, ‘మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకా’న్ని వ్యవసాయ పంటలకు అనుసంధానం చేయడం, పోడు భూముల రైతులకు, అసైన్డ్‌ భూముల లబ్ధిదారులకు అన్ని రకాల యాజమాన్య హక్కులు కల్పించడం, అవినీతికి మారుపేరుగా మారిన ధరణి పోర్టల్‌ను రద్దు చేసి దాని స్థానంలో నూతన రెవెన్యూ వ్యవస్థను ఏర్పాటు చేయడం వంటి పలు రైతు ప్రయోజనకర పథకా లను ‘వరంగల్‌ డిక్లరేషన్‌’లో కాంగ్రెస్‌ ప్రకటించింది. ప్రజల ఆశీర్వా దాలతో అధికారంలోకి రాగానే, తాను ప్రకటించిన కార్యక్రమాలను అమలు చేయడానికి చర్యలు చేపట్టింది.

ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ముందుండే కాంగ్రెస్‌ అందుకు అనుగుణంగా 2024–25 తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవ సాయం దాని అనుబంధ రంగాలకు పెద్దపీట వేస్తూ రూ. 72,659 కోట్లు కేటాయించింది. వ్యవసాయంతో పాటు హార్టికల్చర్‌కు రూ. 737 కోట్లు, పశుసంవర్ధక శాఖకు రూ. 19.080 కోట్లు బడ్జెట్‌లో కేటా యించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి తామిచ్చే ప్రాధా న్యాన్ని మాటల్లో కాక చేతల్లో చూపించింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ‘రుణమాఫీ’ పథకానికి అధిక ప్రాధాన్యమిచ్చింది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనుచిత నిర్ణయాలతో రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసినా,కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆర్థికంగా పలు ఇబ్బందులు ఎదురవుతాయని తెలిసినా మూడు దశలలో సంబంధిత రైతుల బ్యాంకుల ఖాతాల్లో వాయిదాల పద్ధతిలో కాకుండా ఒకేసారి 2 లక్షల రూపాయలు జమ చేసింది.

మొదటి విడతలో 11,50,193 మంది రైతులకు రూ. 6.098.93 కోట్లు, రెండో విడతలో 6,40,823 మంది రైతులకు రూ. 6,190.01 కోట్లు, మూడో విడతలో 4,46,832 మంది రైతులకు రూ. 5,644.24 కోట్లు... మొత్తం మూడు విడతలలో 22,37,848 మంది రైతులకు రూ. 17,933.18 కోట్లను విడుదల చేసి... ఇచ్చిన మాటకు కాంగ్రెస్‌ కట్టుబడి ఉంటుందని మరోసారి రుజువు చేసింది. కొన్నిసాంకేతిక కారణాల వల్ల కొంతమంది రైతుల ఖాతాల్లో నగదు జమ కాకపోవడంతో, అందరికీ న్యాయం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించి పారదర్శకంగా లబ్ధిదారులందరికీ రుణమాఫీ అయ్యేలా చర్యలు తీసుకుంది. కానీ ప్రభుత్వాన్ని విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రతిపక్ష పార్టీలు నిరాధార ఆరోపణలు చేస్తున్నాయి. గతంలో కేసీఆర్‌ సర్కార్‌ రుణమాఫీని వాయిదాల పద్ధతిలో అసంపూర్తిగా నిర్వహించి అన్నదాతల ఆగ్రహానికి గురై అధి కారం కోల్పోయింది. అయినా బీఆర్‌ఎస్‌ ఆత్మవిమర్శ చేసుకోకుండా ప్రభుత్వాన్ని విమర్శిస్తే ప్రజలు సమయం వచ్చినప్పుడు ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పడం ఖాయం.

‘రైతు భరోసా’ ప్రకటించిన కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక రూ. 7,625 కోట్లు ఖర్చు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన స్వల్ప కాలంలోనే లోక్‌సభ ఎన్నికలు రావడంతో నిబంధనల ప్రకారం పలు పథకాల (హామీల) అమలులో కొంత జాప్యం జరిగింది. ఈ ప్రభావం ‘రైతు భరోసా’పై కూడా పడింది. ప్రస్తుతం రాబోయే సీజన్‌లో రైతు లకు వ్యవసాయానికి సంబంధించిన కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఉండాలని లబ్ధిదారులందరికీ వీలైనంత త్వరగా ‘రైతు భరోసా’ పంపిణీ పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో కాంగ్రెస్‌ సర్కార్‌ ఉంది. సంక్రాంతి పర్వదిన సందర్భంగా పంపిణీకి ఏర్పాట్లు జరుగు తున్నాయి. దీనికి తోడు రూ. 1514 కోట్ల ‘రైతు బీమా’ను కూడా ప్రభుత్వం పూర్తి చేసింది. వరికి రూ. 500 బోనస్‌ చెల్లిస్తామన్న హామీని నిలబెట్టుకుంది.

ప్రకృతి వైపరీత్యాలతో ఇటీవల పంట నష్టం జరిగినప్పుడు కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ సరైన రీతితో స్పందించకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఆదుకుంది. పంట నష్ట సహాయంలో కేంద్రం ప్రభుత్వం వివక్ష చూపించినా, రాష్ట్రానికి చెందిన 8 మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఎన్డీఏ ప్రభుత్వంపై ఒత్తిడి తేలేక పోయారు. తెలంగాణ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం భూములను  కోల్పోయి త్యాగం చేస్తున్న రైతులకు మెరుగైన ప్రయోజనం కలిగించా లనే దృష్టితో... ఆ భూముల మార్కెట్‌ విలువను మూడింతలు పెంచు తామని ఇటీవల సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించడం కాంగ్రెస్‌ పార్టీ రైతుల పక్షపాతి అని చెప్పడానికి నిదర్శనం.

పోడు భూముల హక్కుల కోసం పోరాడిన రైతులపై గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన దౌర్జన్యాలు బహిరంగ రహస్యమే. దీనికి భిన్నంగా పోడు భూములపై హక్కులను అక్కడ వ్యవసాయం చేసుకుంటున్న రైతులకే అప్పగించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అంతేకాక  పొలాలకు సాగునీరు అందించేందుకు అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టుల్లో ప్రాధాన్యం ఇస్తూ... వాటికి నిధులు కేటాయించి వేగవంతంగా పనులు పూర్తి చేయాలనే సంకల్పంతోకాంగ్రెస్‌ ప్రభుత్వం ఉంది. తెలంగాణలో పండే అన్ని రకాల పంట లకూ రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసి అన్న దాతలకు నష్టం రాకుండా చర్యలు తీసుకుంది.

రాష్ట్రం కొను గోలు చేసిన పంటల్లో కేంద్రం 25 శాతమే తీసుకుంటున్నా కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా ఇబ్బందులు కలగకూడదనే సంకల్పంతో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ఎప్పటికప్పుడు అన్ని రకాల పంటలను సేకరిస్తోంది.ప్రజలకు, ముఖ్యంగా రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ నెరవేర్చుతుంటే... జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు పనిగట్టుకొని ఏదో ఒక అంశాన్ని లేవనెత్తుతూ నానా యాగీ చేస్తున్నాయి. రైతు వ్యతిరేక విధానాలను ప్రశ్నించిన అన్నదాతలపై కేసులు బనాయించి జైలు పాలు చేసిన ఘనత బీఆర్‌ఎస్‌ది. ఇప్పుడు కాంగ్రెస్‌ రైతు ప్రయో జనాలను కాపాడుతుంటే వారు చూడలేకపోతున్నారు. రాష్ట్రంలోకాంగ్రెస్‌ అధికారంలోకి రావడం, వెంట వెంటనే తీసుకుంటున్న సత్వర చర్యలు, నిర్ణయాలతో... రైతులకు వ్యవసాయం ఒక పండు గలా మారింది. ఈ నేపథ్యంలో అన్నదాతలకు అభయహస్తం అందించిన కాంగ్రెస్‌ పార్టీ పెద్ద ఎత్తున మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన ‘రైతు పండుగ’ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన రాష్ట్రంలోని రైతులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు.
-బి. మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, వ్యాసకర్త ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షులు
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement