![BJP has no right to talk on Telangana merger: Mahesh Kumar Goud](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/09/18/MAHESH-KUMAR-GOUD-3.jpg.webp?itok=CSM9tK_K)
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్
సాక్షి, హైదరాబాద్: దేశ స్వాతంత్య్ర పోరాటం, హైదరాబాద్ విలీనంలో బీజేపీకి ఎలాంటి పాత్ర లేదని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. మంగళవారం గాం«దీభవన్‌లో ‘తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం’ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులరి్పంచారు. అనంతరం మహేశ్ జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తూ మతోన్మాదాన్ని రెచ్చగొడుతోందని ఆరోపించారు. హైదరాబాద్ విలీనంలో పాత్ర లేని బీజేపీ.. కాంగ్రెస్ పారీ్టకి నీతులు చెప్పాల్సిన అవసరంలేదని హితవు పలికారు.
స్వాతంత్య్రానంతరం అన్ని సంస్థానాలను దేశంలో అంతర్భాగం చేయాలని అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్‌ను ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ కోరారన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు బీజేపీతో ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేశారు. నిజాంకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు పోరాటం చేశారని, జనసంఘ్, బీజేపీల ఆచూకీ ఎక్కడా లేదన్నారు. రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటును వ్యతిరేకించడం బీఆర్‌ఎస్‌కు తగదని మహేశ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పాటుకు కారణమైన సోనియాగాంధీ కుటుంబాన్ని కించపరచడం బీఆర్‌ఎస్ నీతిమాలిన చర్యలకు పరాకాష్టఅని విరుచుకుపడ్డారు.
తొమ్మిదేళ్లలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచి్చన వెంటనే సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సంకలి్పంచామని చెప్పారు. హైదరాబాద్ విలీన దినం సందర్భంగా కాంగ్రెస్ ప్రజా పాలన దినోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందని మహేశ్ అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ వి.హనుమంతరావు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, డీసీసీ అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డి, టీజీయూఎఫ్‌ఐడీసీ చైర్మన్ చల్లా నరసింహారెడ్డి, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, టీపీసీసీ నేతలు బొల్లు కిషన్, మత్స వరలక్షి్మ, కోట్ల శ్రీనివాస్, మిద్దెల జితేందర్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment