సాక్షి,హైదరాబాద్: ధరణి పోర్టర్ ప్రారంభం నుంచి రైతుల పాలిట శాపంగా మారిందని అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ధరణి పోర్టల్‌పై ఆయన మాట్లాడుతూ.. ఊరు పేరు లేని సంస్థలకు ధరణిని అప్పగించారు. ఆ రెండు సంస్థలు కేటీఆర్,హరీష్ రావుకి లోపాయికారీ ఒప్పందంగా ఉండి దర్జాగా భూములు కొల్లగొట్టారని ఆరోపించారు.
అందుకే ధరణి పోర్టల్ నిర్వహణను తెలంగాణ ప్రభుత్వం..కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్‌ఐసీ ఎన్‌ఐసీ (National Informatics Centre)కి అప్పగించినట్లు చెప్పారు. మూడేళ్ల నిర్వహణకు ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామన్న ఆయన పనితీరు బాగుంటే మరో రెండేళ్లు పొడిగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పొందంలో పేర్కొందని తెలిపారు.
బీజేపీ నేతలు మాట్లాడే దానికి అర్ధం ఉండాలి. మతాన్ని అడ్డు పెట్టుకొని ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం మంచిదికాదు. ప్రతి అంశంతో ఓట్లు దండుకోవాలనుకోవడం అవివేకం. వామపక్ష భావజాలంతో ఉండి..బీజేపీకి వెళ్ళింది మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కదా అని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కేంద్రం ఇచ్చిన వాగ్దానాలు ఎంతమేర నెరవేర్చారు అని ఈటల ప్రధాని మోదీని అడగాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment