
సాక్షి,హైదరాబాద్: క్లబ్‌లకు వెళ్లి పత్తాలాడే మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా రాహుల్‌గాంధీ గురించి మాట్లాడటం చూస్తుంటే సిగ్గేస్తోందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు బి.మహేశ్ కుమార్‌గౌడ్ వ్యాఖ్యానించారు. మంగళవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ..వివాహ వేడుకల్లో పాల్గొన్న రాహుల్‌గాంధీపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడే నైతిక హక్కు టీఆర్‌ఎస్ నేతలకు లేదన్నారు. అమరవీరుల త్యాగాల మీద పదవులు అనుభవిస్తోన్న టీఆర్‌ఎస్ నేతలు దిగజారి రాజకీయాలు చేయవద్దని హితవు పలికారు.