హైదరాబాద్‌సిటీ: నిజామాబాద్ ఎంపీ కవిత ఏం చేసిందని బంగారమైందో మంత్రి కేటీఆర్ చెప్పాలని టీపీసీసీ అధికార ప్రతినిధి మహేశ్‌కుమార్‌గౌడ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ తెలంగాణ ఇస్తేనే కేటీఆర్ మంత్రి అయ్యాడని గుర్తుచేశారు. కాంగ్రెస్ చేసిందేమిటో అదే వేదిక మీదున్న డి.శ్రీనివాస్‌ను అడిగితే తెలిసేది కదా అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ నోటిని అదుపులో పెట్టుకోకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గత చరిత్ర విప్పాల్సి వస్తుందని హెచ్చరించారు.
సంస్కారం లేకుండా మాట్లాడితే సహించేది లేదన్నారు. అమెరికాలో నేర్చుకున్న సంస్కారం ఇదేనా అని మహేశ్‌కుమార్ గౌడ్ ప్రశ్నించారు. ఉద్యోగులను చెప్పులతో కొట్టాలన్న కేటీఆర్‌ను తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు.