
టీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని, బీజేపీకి చెందిన కీలక నేతలు కూడా మాట్లాడుతున్నారని, వీరంతా త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఆయన వెల్లడించారు
సాక్షి, హైదరాబాద్: నెల రోజుల వ్యవధిలో కాంగ్రెస్ పార్టీలోకి ఆశ్చర్యకర చేరికలుంటాయని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.మహేశ్‌కుమార్‌గౌడ్ చెప్పారు. టీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని, బీజేపీకి చెందిన కీలక నేతలు కూడా మాట్లాడుతున్నారని, వీరంతా త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఆయన వెల్లడించారు.
పెరిగిన ధరలకు వ్యతిరేకంగా ఈనెల 5న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న ఆందోళన విజయవంతం చేసేందుకు మంగళవారం టీపీసీసీ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం గాంధీభవన్‌లో జరిగింది. సమావేశం అనంతరం పార్టీ రాష్ట్ర నేతలు అంజన్‌కుమార్ యాదవ్, బొల్లు కిషన్, రాచమళ్ల సిద్దేశ్వర్, బోరెడ్డి అయోధ్యరెడ్డి, ప్రసాద్ తదితరులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
చదవండి: టీఆర్‌ఎస్‌కు మంత్రి ఎర్రబెల్లి సోదరుడు గుడ్‌బై! బీజేపీలోకి ప్రదీప్‌రావు?