మరో మొక్కు తీర్చుకోనున్న సీఎం కేసీఆర్
Published Thu, Feb 23 2017 5:21 PM | Last Updated on Mon, Oct 8 2018 4:59 PM
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు వరుసగా తన మొక్కులను చెల్లిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పదితే మొక్కలు చెల్లిస్తానని మొక్కుకున్నారు. మొదట విజయవాడ కనకదుర్గమ్మవారి మొక్కులు చెల్లించారు. అనంతరం ఈనెల 21,22న తిరుమల శ్రీవారిని దర్శించుకొని రూ.5 కోట్ల ఆభరణాలు మొక్కుబడి చెల్లించారు.
ఇప్పుడు తాజాగా సీఎం మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. కురివిలోని వీరభద్రస్వామికి మొక్కుబడి చెల్లించన్నారు. స్వామి వారికి బంగారు మీసాలు సమర్పించనున్నారు. సుమారు 15 ఏళ్ల క్రితపు మొక్కును ముఖ్యమంత్రి శుక్రవారం తీర్చుకోనున్నారు.
Advertisement