‘పాలమూరు’తో చెరువులకు జలకళ
మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా మహబూబ్‌నగర్ నియోజకవర్గంలోని చెరువులన్నింటికీ జలకళ రానుందని మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేతో కలిసి మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో చేపడుతున్న మిషన్ కాకతీయ పనులతో పాటు బీటీరోడ్లను ప్రారంభించారు. టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, ఎంపీపీ సావిత్రి, జెడ్పీటీసీ శ్రీదేవి, సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌యాదవ్, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు రాజేశ్వర్‌గౌడ్, ఎంపీటీసీ మంగమ్మ, సింగిల్‌విండో ఉపాధ్యక్షుడు రవినాయక్ పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మహబూబ్‌నగర్‌లోని వెంకటేశ్వర కాలనీ, ఏనుగొండలో ఇంకుడుగుంతల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ కె.జ్యోతి, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
జిల్లా అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి
ఆత్మకూర్ : జిల్లాను అన్నివిధాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారని ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే చిట్టెం రాంమ్మోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆత్మకూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఆవరణలో జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. జిల్లాలో సాగు, తాగునీటిని అందించడం కోసం కృషిచేస్తున్నామని, 12లక్షల ఎకరాలకు సాగునీరందించడంతోపాటు ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తామన్నారు. రైతులకు పగటిపూట 9గంటల పాటు కరెంట్ ఇచ్చి తీరుతామన్నారు.