నేడు ఎయిర్‌పోర్టుకు జగన్‌మోహన్‌రెడ్డి రాక
సాక్షి ప్రతినిధి, కాకినాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం జిల్లాకు వస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటనకు వెళ్లేందుకు ఆయన హైదరాబాద్ నుంచి మధురపూడి ఎయిర్‌పోర్టుకు సాయంత్రం వస్తున్నారు. అనంతరం ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆయన పశ్చిమ గోదావరి జిల్లాకు వెళతారు. ఈ విషయాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు సోమవారం వెల్లడించారు.