27న జగన్ రాక
సజీవ సమాధి మృతుల కుటుంబాలకు పరామర్శ
సాక్షి, గుంటూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 27న జిల్లాకు రానున్నారు. గుంటూరు నగరం లక్ష్మీపురం మెయిన్‌రోడ్డులో భవన నిర్మాణ పనులు చేస్తూ మట్టి పెళ్లలు విరిగిపడి ఏడుగురు కూలీలు సజీవ సమాధి అయిన విషయం తెలిసిందే. ఆ మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు 27న జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు వస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షులు మర్రి రాజ శేఖర్, మాజీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత తెలిపారు. ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడు గ్రామంలో మృతుల కుటుంబాలను ఆయన పరామర్శిస్తారని చెప్పారు.