రేపు విజయవాడలో కాంట్రాక్టు లెక్చరర్ల సదస్సు
Published Fri, Nov 4 2016 10:49 PM | Last Updated on Mon, Sep 4 2017 7:11 PM
కొత్తపేట :
ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్ధీకరించాలనే డిమాండ్‌పై కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనకు ఈ నెల 6న విజయవాడలో రాష్ట్ర వ్యాప్త ప్రతినిధుల సదస్సు నిర్వహిస్తున్నట్టు జిల్లా కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేష¯ŒS ఉపాధ్యక్షుడు చిక్కాల నరసింహం తెలిపారు.శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విజ యవాడ రాఘవయ్య పార్కు సమీపంలో గల ఎంబీ భవ¯ŒSలో 13 జిల్లాల అసోసియేషన్ల ఆధ్వర్యంలో లెక్చరర్లు పాల్గొంటారని తెలిపారు. క్రమబద్ధీకరణతో పాటు పదో పీఆర్‌సీ ప్రకారం జీతాల చెల్లింపు, జీఓ : 197 అమలు, గత నెల 26 నాటి సుప్రీం కోర్టు తీర్పు తదితర అంశాలపై చర్చిస్తామన్నారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్లు హాజరు కావాలని కోరారు.
Advertisement
Advertisement