
‘‘మా అబ్బాయి సంజయ్ నటించిన ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ ప్రమోషన్‌కి నాగార్జున, అలీ, అనిల్ రావిపూడి.. ఇలా అందరూ సపోర్ట్ చేశారు. ఇలా అందరి ప్రేమను సంపాదించడమే నా ఆస్తిగా భావిస్తున్నా’’ అని నటుడు బ్రహ్మాజీ అన్నారు. సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’. అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్‌టైన్మెంట్ సంస్థ రేపు రిలీజ్ చేస్తోంది. ‘‘ఈ చిత్రంలో విడాకుల స్పెషలిస్ట్ లాయర్‌గా కనిపిస్తాను’’ అన్నారు బ్రహ్మాజీ.
Comments
Please login to add a commentAdd a comment