Bigg Boss 7 : శ్రీలల మాటలకు సిగ్గుతో మొగ్గలేసిన అమర్‌దీప్‌ | Bigg Boss 7 Telugu: Sreeleela And Anil Ravipudi Fun With Contestants | Sakshi
Sakshi News home page

Bigg Boss 7 : శ్రీలల మాటలకు సిగ్గుతో మొగ్గలేసిన అమర్‌దీప్‌..ప్రోమో వీడియా

Published Sun, Oct 15 2023 11:54 AM | Last Updated on Sun, Oct 15 2023 12:39 PM

Bigg Boss 7 Telugu: Sreeleela And Anil Ravipudi Fun With Contestants - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో సండే అంటే ఫన్‌ డే అన్నట్లే. వారమంతా ఎలా ఉన్నా.. వీకెండ్‌లో మాత్రం మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటుంది. ప్రతి వారం ఎవరో ఒక గెస్ట్‌ రావడం.. వాళ్లతో కలిసి కంటెస్టెంట్స్‌ గేమ్స్‌ ఆడడం.. చిలిపి ప్రశ్నలు.. ఇలా ఆదివారం ఎపిసోడ్‌ చాలా సరదాగా గడిపోతుంది. ఈ వారం కూడా బిగ్‌బాస్‌ షోకి అతిథులుగా ప్రముఖ దర్శకుడు అనిల్‌ రావిపూడి, అందాల తార శ్రీలీల వచ్చారు. భగవంత్‌ కేసరి సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వీరిద్దరు బిగ్‌బాస్‌ షోకి వచ్చినట్లు తాజాగా రిలీజైన ప్రోమో చూస్తే అర్థమతుంతుంది. 

బిగ్‌బాస్‌ రియాల్టీ షోకి అనిల్‌ రావిపూడి పెద్ద అభిమాన్ని. తన సినిమాలు ఉన్న లేకపోయినా. ప్రతి సీజన్‌కి మాత్రం వచ్చేస్తాడు. ఈసారి వచ్చి రావడంతో తనదైన పంచులతో ఇచ్చిపడేశాడు. పనిలో పనిగా.. సీజన్‌ సీజన్‌కి టీఆర్పీతో పాటు మీ గ్లామర్‌ కూడా పెరిగిపోతుందంటూ నాగార్జునను పొగిడేశాడు. హౌస్‌మేట్స్‌ గురించి చెబుతూ.. తేజ కాలేజీలో తన జూనియర్‌ అని.. బాగా ఇంప్రూవ్‌ అయ్యాడని చెప్పాడు.

ఇక శోభాశెట్టిని క్రాకర్‌ అని..అందరిని ఒక ఆట ఆడిస్తోందని చెప్పాడు. ఇక అమర్‌దీప్‌ లేచి.. ‘శ్రీలీల గారు మీరు ఏం చెప్పట్లేదండి’ అని అనగా..‘మీరు చాలా బాగున్నారండి’అని ఆమె చెప్పింది. అయితే మనోడికి అర్థం కాలేదేమో..సింపుల్‌గా థ్యాంక్యూ అండి అని కూర్చోబోయాడు. వెంటనే నాగార్జున కలగజేసుకొని..ఆమె ఎం చెప్పిందో అర్థమయిందా? నువ్వు చాలా బాగున్నావని చెప్పింది అని అనగా.. అమర్‌ సిగ్గుతో  మొగ్గలేశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement