
సాక్షి,న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన రేపు కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. కేంద్ర మంత్రివర్గ విస్తరణ తర్వాత తొలిసారిగా ఈ భేటీ జరగనుంది. గురువారం సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. కేబినెట్ మీటింగ్‌లో పలు కీలక అంశాలపై చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది.
కాగా, బుధవారం రోజున కొత్త కేంద్రమంత్రివర్గ విస్తరణ జరిగిన విషయం తెలిసిందే. కేబినెట్ విస్తరణ కోసం మోదీ ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేసినట్లు కనిపిస్తోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికలు.. గడిచిన ఎన్నికలు, కేంద్ర మంత్రుల పనితీరు, సామాజిక కూర్పు, మహిళా కోటా తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని కేబినెట్ విస్తరణ చేశారు. పాత, కొత్త వారిని కలుపుకుని మొత్తం 43 మందికి కేబినెట్‌లో చోటు కల్పించారు. వీరంతా బుధవారం ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు.