
ఢిల్లీ: 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర మంత్రివర్గం,ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) తొలి సమావేశం ఇవాళ సాయంత్రం 5 గంటలకు జరగనుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ప్రధాన ఆర్థిక విధానాలు,పలు కార్యక్రమాలను చర్చ జరగనుంది.అనంతరం,జులైలో జరగనున్న 2024-25 పూర్తి బడ్జెట్‌పై ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
సీసీఈఏ అంటే ఏమిటి?
ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ)కేంద్రంలోని అత్యంత ముఖ్యమైన కమిటీలలో ఒకటి. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పారిశ్రామిక విధానాలు, ఇతర కీలక ఆర్థిక కార్యక్రమాలకు సంబంధించిన నిర్ణయాలను ఖరారు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
సీసీఈఏలో 8 కేబినెట్ కమిటీలు:
1. కేబినెట్ నియామకాల కమిటీ
2. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ
3. రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ
4. పెట్టుబడి,వృద్ధిపై కేబినెట్ కమిటీ
5. భద్రతపై కేబినెట్ కమిటీ
6. పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ
7. ఉపాధి,నైపుణ్యాభివృద్ధిపై కేబినెట్ కమిటీ
8. వసతిపై కేబినెట్ కమిటీ