రేపు వీఆర్‌ఓల అత్యవసర సమావేశం
Published Fri, Sep 9 2016 4:00 AM | Last Updated on Mon, Sep 4 2017 12:41 PM
వీరన్నపేట (మహబూబ్‌నగర్) : వీఆర్‌ఓలు ఎదుర్కొంటున్న సమస్యలపై తెలంగాణ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆ««దl్వర్యంలో ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్లు జిల్లా అధ్యక్షుడు జ్ఞానేశ్వర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో సీపీఎస్ పెన్షన్ సౌకర్యం రద్దు, కొత్త జిల్లాలకు వీఆర్‌ఓల కేటాయింపు, పదోన్నతులు తదితర వాటిపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బానాల రాంరెడ్డి సమావేశానికి విచ్చేస్తున్నారని, జిల్లాలోని వీఆర్‌ఓలు తప్పనిసరిగా సమావేశానికి హాజరుకావాలని కోరారు.
Advertisement
Advertisement