రేపు వికాసలో ఇంటర్వ్యూలు
Published Fri, Apr 7 2017 12:27 AM | Last Updated on Tue, Sep 5 2017 8:07 AM
కాకినాడ సిటీ :
నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో భాగంగా వికాస సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీన ఇంటర్వూ్యలు నిర్వహిస్తున్నట్టు వికాస పీడీ వీఎ¯ŒS.రావు ఒక ప్రకటనలో తెలిపారు. నక్కపల్లిలోని హెటెరో డ్రగ్స్ కంపెనీలో పనిచేందుకు ప్రొడక్షన్, ఆర్‌అండ్‌డీ, క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అనలిస్ట్, నర్శింగ్, టెక్నికల్ సర్వీస్ పోస్టులకు ఇంటర్వూ్యలు ఉంటాయన్నారు. ఎం.ఎస్.సి(ఆర్గానిక్/అనలిటికల్ కెమిస్ట్రీ), బీఎస్సీ(కెవిుస్ట్రీ), ఎం.ఫార్మసీ, బి.ఫార్మసీ, బీఎస్సీ (నర్సింగ్) చదివిన 27 సంవత్సరాలలోపు వయస్సు ఉన్న పురుష అభ్యర్థులు అర్హులన్నారు. బి.టెక్ (కెమికల్ ఇంజనీర్), డిప్లమా (కెమికల్ ఇంజనీర్) చదివిన 27 సంవత్సరాలలోపు వయస్సు ఉన్న స్త్రీ, పురుష అభ్యర్థులు ఈ ఇంటర్వూ్యకు అర్హులని, ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరానికి రూ.1.75 లక్షల నుంచి రూ.2.25 లక్షల వరకు జీతం ఇస్తారన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులందరూ శనివారం ఉదయం 9 గంటలకు కలెక్టరేట్ ఆవరణలోని వికాస కార్యాలయంలో బయోడేటా జెరాక్స్ సర్టిఫికెట్స్‌తో హాజరు కావాలన్నారు.
Advertisement
Advertisement