రేపు జయశంకర్ విగ్రహావిష్కరణ
Published Fri, Aug 5 2016 12:19 AM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM
నల్లగొండ కల్చరల్ : తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ టౌన్ హాల్ పక్కన ఉన్న పార్కులో తెలంగాణ ఉద్యమ రూపకర్త ప్రొఫెసర్ జయశంకర్‌సార్ విగ్రహాన్ని ఈనెల 6న సాయంత్రం 4 గంటలకు ఆవిష్కరించనున్నట్లు జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు విద్యాసాగర్, జవహర్, జిల్లా అధ్యక్షుడు బోనగిరి దేవేందర్ తెలిపారు. గురువారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. మహోన్నత తెలంగాణ ఉద్యమానికి దారిచూపిన దివిటి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్‌సార్ అని కొనియాడారు. అంతటి మహనీయుడు విగ్రహాన్ని జిల్లా కేంద్రంలో స్థాపించుకోవడం ఆనందదాయకమని అన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకంట్ల కవిత, మంత్రి జగదీశ్‌రెడ్డి, శాసన మండలి వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్, ప్రభుత్వ విప్ సునీత, జడ్పీ చైర్మన్ బాలునాయక్, ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, గుత్తా సుఖేందర్‌రెడ్డి తదితర ముఖ్య నాయకులు పాల్గొంటారని తెలిపారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విగ్రహావిష్కరణ, బహిరంగ సభ ను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఉపేందర్‌రావు, శ్రీని వాసాచారి, టి.వెంకట్, రంజిత్‌గౌడ్, సాయినిఖిల్, రవితేజ పాల్గొన్నారు.
Advertisement