
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు బుధవారం నగరానికి రానున్నారు. ఉదయం 9.50 గంట లకు విశాఖ ఎయిర్‌పోర్టుకు ప్రత్యేక విమానంలో వస్తారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఎన్‌ఎస్‌టీఎల్ చేరుకొని అక్కడ నిర్వహిస్తున్న గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొం టారు. అక్కడి నుంచి 12 గంటలకు బయలు దేరి సాగరనగర్‌లోని తన స్నేహితుడు ఇంటికి వెళ్తారు. సాయంత్రం 6 గంటలకు కిర్లంపూడి లే అవుట్‌లోని ఆయన నివాసానికి చేరుకొని రాత్రికి బస చేస్తారు. గురువారం ఉదయం 9 గంటలకు నివాసం నుం చి బయలదేరి రోడ్డు మార్గం ద్వారా గంభీ రం ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్క్‌లో జరిగే సదస్సులో పాల్గొంటారు. అక్కడ నుంచి 12 గంట లకు ఎయిర్‌పోర్టుకు చేరుకొని ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరితారు..