న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి మండలి ఆదివారం సమావేశం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. సీమాంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తామని హామీ ఇచ్చిన కేంద్రం అందుకు ఆమోదం తెలిపవచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే పోలవరం ముంపు గ్రామాలకు సంబంధించి ఆర్డినెన్స్పై కేబినెట్ నిర్ణయం తీసుకోవచ్చు.
శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో అవినీతి నిరోధక బిల్లు ఎజెండాలో ఉన్నా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రెండో రోజుల వ్యవధిలోనే మరోసారి సమావేశమవుతున్న మంత్రి మండలి పలు ఆర్డినెన్స్లపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. కాగా కేంద్ర ప్రభుత్వ పదవీకాలం త్వరలో ముగియనందున వీటిపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్పందన ఎలా ఉంటుందనే విషయంపై కాంగ్రెస్ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు.
రేపు కేంద్ర కేబినెట్ భేటీ
Published Sat, Mar 1 2014 4:28 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement
Advertisement