విద్యారంగానికి రూ.28 వేల కోట్లు కేటాయింపు
విద్యారంగానికి రూ.28 వేల కోట్లు కేటాయింపు
Published Tue, Sep 6 2016 9:56 PM | Last Updated on Mon, Sep 4 2017 12:26 PM
ఏలూరు (ఆర్‌ఆర్ పేట): రాష్ట్రంలో విద్యారంగానికి రూ.28 వేల కోట్లు కేటాయించి ప్రతి ఒక్కరికి విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కార్యక్రమాలు అమలు చేస్తోందని మంత్రి పీతల సుజాత చెప్పారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా స్థానిక శనివారపుపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో టీచర్‌గా పనిచేసి మంత్రి పదవిని చేపట్టిన సుజాతను డీఈవో మధుసూదనరావు సత్కరించారు. ఉపాధ్యాయులుగా పనిచేసిన వారు ఏ రంగంలోనైనా రాణిస్తారనడానికి మంత్రి సుజాత నిదర్శనమని డీఈవో అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని బుధవారం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి సుజాత చెప్పారు. రూ.10 కోట్లతో 634 కిచెన్ షెడ్ల నిర్మాణం పూర్తి చేస్తున్నామన్నారు. కామవరపుకోట జెడ్పీటీసీ సభ్యుడు గంటా సుధీర్‌బాబు, జంగారెడ్డిగూడెం ఎంపీడీవో సుజాత తదితరులు పాల్గొన్నారు.
Advertisement