రేపు ‘సంగీత గేయధార’ | tomorrow sangeetha gheyadhara | Sakshi
Sakshi News home page

రేపు ‘సంగీత గేయధార’

Published Thu, Mar 9 2017 11:20 PM | Last Updated on Tue, Sep 5 2017 5:38 AM

tomorrow sangeetha gheyadhara

రాజమహేంద్రవరం కల్చరల్‌ (రాజమహేంద్రవరం సిటీ) :
సాహిత్య సంస్థ ప్రసంగ తరంగిణి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం 5.30 గంటలకు సంగీత గేయధార పేరిట వినూత్న సంగీత ప్రక్రియను అందించనున్నట్టు ఆ సంస్థ గౌరవాధ్యక్షుడు, వాస్తు జ్యోతిష పండితుడు డాక్టర్‌ ప్రభల సుబ్రహ్మణ్యశర్మ తెలిపారు. ఆనం రోటరీ హాలులో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ కార్యక్రమ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఘంటసాల జీవితంపై పరిశోధన చేసిన డాక్టర్‌ టి.శరత్‌చంద్ర ‘ఘంటసాల అమృత గానలహరి ’పేరిట ఆయన పాటలు ఆలపిస్తారన్నారు. ‘సంగీత సాహిత్య నిధి’డాక్టర్‌ వీబీ సాయికృష్ణ యాచేంద్ర (వెంకట గిరిరాజా) సంగీత గేయధార చేస్తారని తెలిపారు. నటుడు, గాయకుడు జిత్‌మోహ¯ŒS మిత్రా, డాక్టర్‌ టి.శరత్‌చంద్ర, డాక్టర్‌ బిక్కిన రామమనోహర్‌ ఘంటసాల స్వర మనోహర ఝరి నిర్వహిస్తారన్నారు. జిత్‌మోహ¯ŒS మిత్రా, ప్రసంగ తరంగిణి అధ్యక్షుడు డాక్టర్‌ బిక్కిన రామమనోహర్, డాక్టర్‌. టి.శరత్‌చంద్ర, కొప్పర్తి రామకృష్ణ, జగపతి, చౌదరి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement