రేపు జిల్లాకు సీఎం రాక | tomorrow cm is coming to east | Sakshi
Sakshi News home page

రేపు జిల్లాకు సీఎం రాక

Published Wed, Aug 10 2016 12:26 AM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM

tomorrow cm is coming to east

రాజమహేంద్రవరంలో పుష్కరుడికి వీడ్కోలు 
నగరంలో పలు కార్యక్రమాల్లో
పాల్గొననున్న చంద్రబాబు
సాక్షి, రాజమహేంద్రవరం : ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబు నాయడు గురువారం జిల్లా పర్యటనకు రానున్నారని సమచార, పౌర సంబంధాల శాఖ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. సీఎం విజయవాడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం మూడు గంటలకు మధురపూడి విమానశ్రయానికి చేరుకుంటారు. 3:25 గంటలకు రాజమహేంద్రవరం తూర్పు రైల్వే స్టేషన్‌ రోడ్డులోని దేవాదాయ శాఖ స్థలంలో నిర్మించిన వాంబే గృహాలను లబ్ధిదారులకు అందించి వారినుద్దేశించి ప్రసంగిస్తారు. 4:5కు హుకుంటపేట హైస్కూల్‌కు చేరుకుని బహిరంగ మల విసర్జనలేని గ్రామంగా ఎంపికైన ఆ గ్రామ పంచాయతీ జన్మభూమి కమిటీ సభ్యులకు రూ.5 లక్షల ప్రోత్సాహక బహుమతిని అందిస్తారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ వీధి దీపాలను ప్రారంభిస్తారు. 4:30కు చెరుకూరి కల్యాణ మండపంలో జరిగే తెలుగుదేశం పార్టీ సమావేశంలో పాల్గొంటారు. 5:45 నుంచి 6:45 వరకు పుష్కరఘాట్‌లో హారతి కార్యక్రమంలో పాల్గొని పుష్కరుడికి వీడ్కోలు పలుకుతారు. 7:05 గంటలకు మధురపూడి విమానాశ్రయంకు చేరుకుని ప్రత్యేక విమానంలో విజయవాడ వెళతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement