రేపు జేఈఈ అడ్వాన్స్‌డ్ | jee advance exame tobe held on may 24th | Sakshi
Sakshi News home page

రేపు జేఈఈ అడ్వాన్స్‌డ్

Published Sat, May 23 2015 3:01 AM | Last Updated on Tue, Oct 16 2018 2:49 PM

jee advance exame tobe held on may 24th

హైదరాబాద్: ఐఐటీల్లో ప్రవేశానికి ఈనె ల 24న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష జరగనుంది. ఇందుకోసం ఐఐటీ ముంబై ఏర్పాట్లు పూర్తి చేసింది. దేశ వ్యాప్తంగా 1.20 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు కానున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి 20 వేల మంది వరకు హాజరుకానున్నట్లు అంచనా.

పరీక్ష ఫలితాలను జూన్ 18న ప్రకటిస్తారు. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపరు-1 పరీక్ష, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపరు-2 పరీక్ష ఉంటుంది. ఇక బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌లో ప్రవేశాల కోసం ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూట్ టెస్టును (ఏఏటీ) జూన్ 21న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు.
 
ఇవీ పరీక్ష కేంద్రాలు...
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఐదు కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఐఐటీ ఖరగ్‌పూర్ పరిధిలోని విశాఖపట్నం, ఐఐటీ మద్రాసు పరిధిలోని నెల్లూరు, విజయవాడ, హైదరాబాద్, వరంగల్ కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement