
న్యూఢిల్లీ: మణిపూర్ తగలబడుతుంటే బీజేపీ మాత్రం ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో మునిగి తేలుతోందని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఆరోపించారు. గురువారం ఆయన ఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో జరిగిన మహిళా కాంగ్రెస్ సభ్యుల సమావేశంలో మాట్లాడారు.
మహిళా నేతలు కష్టపడి పనిచేయాలన్నారు. ‘మన నేత రాహుల్ మణిపూర్‌కు వెళ్లగా లేనిది ప్రధాని ఎందుకు వెళ్లడం లేదు? ’అని ఖర్గే ప్రశ్నించారు. మణిపూర్‌లో అత్యాచారాలు జరుగుతున్నా మౌనంగా ఉండిపోయిన ప్రధాని మోదీ..అవిశ్వాస తీర్మానం తెచి్చన తర్వాత మాత్రమే పార్లమెంట్‌లో మాట్లాడారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment