రానున్న లోక్‌సభ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారాన్ని షురూ చేసింది. 'సంసద్ మే బీ కేజ్రీవాల్, తో ఢిల్లీ హోగీ ఔర్ ఖుష్ హాల్' నినాదంతో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ‘చీపురు’ పార్టీ లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. 4:3 ఫార్ములా సీట్ల షేరింగ్‌తో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఆప్ గతంలో ప్రకటించింది.
ఢిల్లీలో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఇతర పార్టీ నేతలు, కార్యకర్తల సమక్షంలో ప్రచారాన్ని ప్రారంభించారు. ‘నా కుటుంబ సభ్యులైన ఢిల్లీ ప్రజలకు సేవ చేసేందుకు నేను అన్ని ప్రయత్నాలు చేశాను. మా నినాదం 'సంసద్ మే బీ కేజ్రీవాల్, తో ఢిల్లీ హోగీ ఔర్ ఖుష్ హాల్' (పార్లమెంట్‌లో కేజ్రీవాల్‌తో ఢిల్లీ మరింత అభివృద్ధి)" అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
ఆప్ ఇప్పటికే నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. తూర్పు ఢిల్లీ, న్యూఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ స్థానాలకు ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తోంది. మిగిలిన మూడు స్థానాల్లో అంటే నార్త్ ఈస్ట్, చాందినీ చౌక్, నార్త్ వెస్ట్ (ఎస్సీ రిజర్వ్‌డ్) సెగ్మెంట్‌లలో అభ్యర్థులను నిలబెడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment