మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్సాహంగా ప్రచారానికి సిద్ధమైన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు నిరాశ ఎదురయ్యింది. ఈ నెల 17న రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రచారానికి ఈరోజే (నవంబరు15) చివరిరోజు కావడంతో అన్ని పార్టీలు తమ ప్రచారాలను హోరెత్తించాయి.
ఈరోజు బేతుల్ జిల్లా ఆమ్లాలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సారధ్యంలో బహిరంగ సభ, ర్యాలీ జరగాల్సి ఉంది. అయితే ఇంతలో ఆయన ప్రయాణించాల్సిన హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో చివరి నిముషంలో కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాల్సివచ్చింది.
మల్లికార్జున ఖర్గే బుధవారం ఉదయం 11.20 గంటలకు ఆమ్లాలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించాల్సి ఉందని, అయితే హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం కారణంగా బహిరంగ సభ రద్దు అయ్యిందని స్థానిక కాంగ్రెస్ నేత ఒకరు చెప్పారు. బెరాసియా, భోపాల్‌లలో జరిగే ర్యాలీలలో కూడా ఖర్గే పాల్గొనాల్సి ఉందని ఆయన తెలిపారు. నవంబర్ 17న మధ్యప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి బుధవారం చివరి రోజు. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ అభ్యర్థి కన్నుమూత.. 25న ఓటింగ్ రద్దు!
Comments
Please login to add a commentAdd a comment